MS Dhoni: ఇదేందిది.! టీ20ల్లో ధోని అత్యంత చెత్త రికార్డు ఇదా..
ధోని.. ఇండియాస్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ కెప్టెన్. అద్భుతమైన రికార్డులు తన పేరిట లిఖించిన ధోని.. ఓ చెత్త రికార్డు కూడా నమోదు చేసి ఉంటాడని మీరు అనుకుంటున్నారా.? అయితే ఆ చెత్త రికార్డు ఉంది. అదేంటంటే ఈ స్టోరీ చదివేయండి.

టీమిండియా తరఫున T20 ఫార్మాట్‌లో 1000కి పైగా పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌లలో సూర్యకుమార్ యాదవ్ అత్యధిక స్ట్రైక్ రేట్ సాధించగా.. MS ధోని అత్యల్ప స్ట్రైక్ రేట్‌తో నిలిచిన సంగతి మీకు తెలుసా.? ధోని 1617 పరుగులను 126.1 స్ట్రైక్ రేట్‌తో సాధించగా, సూర్యకుమార్ 1675 పరుగులను 175.7 స్ట్రైక్ రేట్‌తో నమోదు చేశాడు. వివరాల్లోకి వెళ్తే.! భారత జట్టు తరఫున T20 క్రికెట్‌లో బ్యాట్స్‌మెన్ల స్ట్రైక్ రేట్‌కు సంబంధించిన ఆసక్తికర గణాంకాలు ఇటీవల వెలుగులోకి వచ్చాయి.
ఇది చదవండి: ‘ఆ సాంగ్ వల్లే హీరోయిన్‌గా సినిమాలు మానేశా.!’
1000 కంటే ఎక్కువ పరుగులు చేసిన భారతీయ బ్యాట్స్‌మెన్‌లలో, సూర్యకుమార్ యాదవ్ అగ్రస్థానంలో నిలిచాడు. అతడు తన కెరీర్‌లో 175.7 స్ట్రైక్ రేట్‌తో 1675 పరుగులు సాధించాడు. ఈ స్ట్రైక్ రేట్ టీమిండియా తరఫున మాత్రమే కాకుండా, అంతర్జాతీయ T20 క్రికెట్‌లోనూ అత్యుత్తం అని చెప్పొచ్చు. అయితే, ఇదే విభాగంలో అంటే 1000 కంటే ఎక్కువ పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మెన్‌లలో అత్యల్ప స్ట్రైక్ రేట్ రికార్డు ఎంఎస్ ధోని పేరు మీద ఉంది.
ధోని టీమిండియా తరఫున 126.1 స్ట్రైక్ రేట్‌తో 1617 పరుగులు చేశాడు. ఒక విజయవంతమైన ఫినిషర్‌గా పేరున్న MS ధోని ఈ గణాంకాలలో అత్యల్ప స్ట్రైక్ రేట్‌ను కలిగి ఉండటం గమనార్హం. టీ20 ఫార్మాట్‌లో MS ధోని టీమిండియాకు అద్భుతమైన కెప్టెన్‌గా, వికెట్ కీపర్‌గా సేవలందించినప్పటికీ, బ్యాట్స్‌మెన్‌గా అతని గణాంకాలు 1000+ పరుగులు చేసిన ఇతర ఆటగాళ్ళతో పోలిస్తే భిన్నంగా ఉందనడంలో అతిశయోక్తి లేదు.
ఇది చదవండి: షూట్‌లో అలా గాజులు పగలుగొట్టాలి.. బాలకృష్ణ వచ్చి ఏమన్నారంటే.?
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..




