తిరుపతి జిల్లా నాయుడుపేట అర్బన్ పోలీస్ స్టేషన్లో సీఐ బాబి, హెడ్ కానిస్టేబుల్ రామ్మోహన్లు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. ఒక వైన్ షాపు యజమాని నుంచి నెలనెలా రూ.30,000 మామూళ్లు డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. అక్రమ కేసులు పెట్టకుండా వ్యాపారం సజావుగా సాగేందుకు ఈ లంచాలు కోరినట్లు వెల్లడైంది.