Amaravathi Farmers: అమరావతి రైతులకు పండగ లాంటి వార్త.. కూటమి సర్కార్ సూపర్ న్యూస్
అమరావతి రైతులకు సీఆర్డీఏ భారీ శుభవార్త అందించింది. రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు స్థలాలను కేటాయించనుంది. వాళ్లు కోరుకున్న చోట ప్లాట్లు ఇవ్వనుంది. ఈ-లాటరీ విధానంలో ఈ స్థలాలను సీఆర్డీఏ కేటాయిస్తోంది. ఈ నెల 29వ తేదీన ప్లాట్లను ఇవ్వనున్నట్లు సీఆర్డీఏ వర్గాలు స్పష్టం చేశాయి.

ఏపీలోని రాజధాని అమరావతి రైతులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. రాజధాని కోసం భూములు త్యాగం చేసిన రైతులకు ప్రభుత్వం ప్లాట్లు కేటాయిస్తోన్న విషయం తెలిసిందే. దశలవారీగా సీఆర్డీఏ ఈ ప్లాట్లను రైతులను అందిస్తోంది. ఈ-లాటరీ విధానం ద్వారా వీటిని కేటాయిస్తోంది. ఇటీవల రాజధాని కోసం భూసేకరణ ప్రక్రియలో భాగంగా భూములిచ్చిన రైతులకు ప్లాట్లను సీఆర్డీఏ కేటాయించింది. దీంతో వేలమంది రైతులు లబ్ది పొందారు. ఈ క్రమంలో తాజాగా సీఆర్డీఏ మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతిలో సీడె యాక్సెస్ రోడ్డును ప్రభుత్వం నిర్మించేందుకు సిద్దమైంది. ఇందుకోసం రైతుల నుంచి భూములు సేకరించింది. దీంతో ఈ రోడ్డు నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు ప్రభుత్వం ప్లాట్లు కేటాయించేందుు ముహూర్తం ఫిక్స్ చేసింది.
ఈ నెల 27న ప్లాట్ల కేటాయింపు
సీడ్ యాక్సెస్ రోడ్డు కోసం భూములిచ్చిన రైతులకు ఈ నెల 29వ తేదీన ప్లాట్లు కేటాయించనున్నట్లు రాజధాని ప్రాంత అభివృద్ది సంస్థ అయిన సీఆర్డీఏ వెల్లడించింది. పారదర్శకంగా ఈ-లాటరీ విధానంలో వీటిని కేటాయిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ నెల 28వ తేదీనే ఈ ప్రక్రియ చేపట్టాల్సి ఉన్నప్పటికీ.. కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. ఈ నెల 29వ తేదీన కేటాయించేందుకు సిద్దమవ్వగా.. ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. అటు ఉండవల్లిలో జరీబు కోసం భూములిచ్చిన రైతులకు జనవరి 30వ తేదీన స్థలాలు కేటాయించనున్నాట్లు తెలుస్తోంది. కానీ దీనిపై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందని తెలుస్తోంది.
రైతులకు ప్రొవిజనల్ సర్టిఫికేట్లు
రైతులకు స్థలాలు కేటాయించిన తర్వాత ప్రభుత్వం వారికి ప్రొవిజనల్ సర్టిఫికేట్లు అందించనుంది. అలాగే రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా త్వరతగతిన చేపట్టనుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ త్వరగా పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని మంత్రి నారాయణ అధికారులకు అదేశాలు జారీ చేశారు. గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు స్థలాలను కేటాయించగా.. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టింది. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరిగి ఈ ప్రక్రియను ప్రారంభించింది. ఇటీవల ఉండవల్లిలో భూములిచ్చిన 200కిపైగా రైతులకు 390 స్థలాలు కేటాయించారు. ఇక 14 గ్రామాలకు చెందిన 90 మంది రైతులకు ఇటీవలే 135 స్థలాల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. ఇప్పటివరకు మొత్తం 30 వేల మంది రైతులకు 69,421 స్థలాలు కేటాయించే ప్రాసెస్ పూర్తి చేసింది. 2019కి ముందు విడుదల చేసిన నిబంధనల ప్రకారమే రైతులకు భూములను కేటాయిస్తున్నట్లు సీఆర్డీఏ అధికారులు చెబుతున్నారు. త్వరలోనే రైతులందరికీ కేటాయించి ఈ ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు పేర్కొన్నారు.
