- Telugu News Photo Gallery Students of Badirula School in Prakasam district sang the national anthem with silent gestures
మూగబోని దేశభక్తి.. సైగలతోనే జాతీయ గీతం..
జాతీయ గీతం పాడాలి అంటే మాట వస్తేనే పాడగలం కాదు, ఆత్మస్థైర్యం, నమ్మకం దృఢ సంకల్పం ఉంటే, మాటలు రాకపోయినా, జాతీయ గీతం పాడగలం అని నిరూపించారు ప్రకాశం జిల్లాలోని అద్దంకిలోని బదిరుల పాఠశాల విద్యార్థలు. తమ సైగలతోనే దేశభక్తిని చాటి, ప్రతి ఒక్కరిచే ప్రశంసలు అందుకుంటున్నారు.
Updated on: Jan 27, 2026 | 1:06 PM

జాతీయ గీతం పాడాలి అంటే మాట వస్తేనే పాడగలం కాదు, ఆత్మస్థైర్యం, నమ్మకం దృఢ సంకల్పం ఉంటే, మాటలు రాకపోయినా, జాతీయ గీతం పాడగలం అని నిరూపించారు ప్రకాశం జిల్లాలోని అద్దంకిలోని బదిరుల పాఠశాల విద్యార్థలు. తమ సైగలతోనే దేశభక్తిని చాటి, ప్రతి ఒక్కరిచే ప్రశంసలు అందుకుంటున్నారు.

భాష ఏదైనా భావం ఒక్కటే.. మాట రాకపోయినా, పాట వినబడకపోయినా వారి గుండెల్లో దేశభక్తి మాత్రం గట్టిగా ప్రతిధ్వనించింది. ప్రకాశం జిల్లా అద్దంకిలోని బదిరుల పాఠశాలలో జరిగిన గణతంత్ర వేడుకలు అందరినీ కదిలించాయి. సైగలనే స్వరాలుగా చేసుకుని ఆ చిన్నారులు ఆలపించిన జాతీయ గీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

వారికీ మాటలు రావు.. కానీ వారి భావాల్లో స్పష్టత ఉంది. వారికి పాట వినబడదు.. కానీ వారి సైగల్లో లయ ఉంది. ప్రకాశం జిల్లా అద్దంకిలోని చైతన్య మహిళా మండలి బధిరుల పాఠశాల విద్యార్థులు గణతంత్ర దినోత్సవం వేళ దేశభక్తిని చాటారు.

గత 26 ఏళ్లుగా బధిర విద్యార్థులకు అండగా నిలుస్తున్న ఈ పాఠశాలలో గణతంత్ర వేడుకలు మిన్నంటాయి. సంస్థ అధ్యక్షురాలు పూనూరి ఆరోగ్యం జెండా ఎగురవేయగా, ప్రిన్సిపల్ సురేంద్రబాబు భారత రాజ్యాంగ గొప్పతనాన్ని విద్యార్థులకు వివరించారు. సాధారణ విద్యార్థుల కంటే తామేమీ తక్కువ కాదని.. సైగల భాషలోనే రాజ్యాంగ విశిష్టతను తెలుసుకుంటూ ఆ చిన్నారులు ఆశ్చర్య పరిచారు.

ముఖ్యంగా విద్యార్థులు సైగలతో వందేమాతరం జాతీయ గీతాన్ని ఆలపించడం అక్కడికి వచ్చిన వారిని మంత్ర ముగ్ధులను చేసింది. పెదవి విప్పకపోయినా.. వారి చేతుల కదలికలే దేశం పట్ల వారికున్న గౌరవాన్ని చాటిచెప్పాయి. శారీరక లోపాలు దేశభక్తికి అడ్డుకాదని నిరూపించాయి.
