కప్పు వేడి వేడి కాఫీ నీళ్లు గొంతు తడపనిదే చాలా మందికి రోజు ప్రారంభం కాదు. ఈ వేడివేడి పానీయం సమయానికి అందకపోతే విలవిలలాడిపోతుంటారు
TV9 Telugu
అయితే తరచూ ‘కాఫీ’ తాగడం వల్ల మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతుందట. అధికంగా కాఫీ తాగితే అది మెదడులోని ‘గ్రే మ్యాటర్’ పరిమాణాన్ని తగ్గించే అవకాశం ఉందని, ఫలితంగా ఒత్తిడి నుంచి మెదడు కోలుకోవడం కష్టమవుతుందట
TV9 Telugu
అంతేకాకుండా కెఫీన్ ప్రభావం సుమారు 12 గంటల వరకు ఉండి, గాఢ నిద్రకు ఆటంకం కలిగిస్తుంద నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటువంటి స్థితిలో మెదడుకు కావాల్సిన విశ్రాంతి దొరకక క్రమంగా ‘బ్రెయిన్ ఫాగ్’ సమస్యకు దారితీస్తుంది
TV9 Telugu
ఆహారంలోని కాల్షియం, ఐరన్ వంటి ముఖ్యమైన ఖనిజాలు శరీరానికి అందకుండా చేయడంలో కాఫీ ‘పోషకాల దొంగ’గా మారుతుంది
TV9 Telugu
కాఫీలోని కెఫీన్, టానిన్లు పేగుల్లో పోషకాల శోషణను అడ్డుకుంటాయని, ఫలితంగా ఎముకల సాంద్రత తగ్గిపోవడం, రక్తహీనత వంటి సమస్యలు తలెత్తుతాయి
TV9 Telugu
అలాగే ఖాళీ కడుపుతో కాఫీ తాగడం వల్ల గ్యాస్ట్రిక్ యాసిడ్ ఉత్పత్తి పెరిగి, కడుపు లోపలి పొరలు దెబ్బతినే అవకాశం ఉంది. ఇది జీర్ణక్రియపై దీర్ఘకాలికంగా ప్రతికూల ప్రభావం చూపుతుంది
TV9 Telugu
అతిగా కాఫీ తాగడం వల్ల శరీరంలో ‘కార్టిసాల్’ అనే ఒత్తిడి హార్మోన్ స్థాయిలు పెరుగుతాయి. మొటిమలు రావడం, చర్మం తన బిగుతును కోల్పోయి వృద్ధాప్య ఛాయలు కనిపించడం, హార్మోన్ల అసమతుల్యత, గుండె దడ లాంటి లక్షణాలు కనిపిస్తాయి
TV9 Telugu
రోజుకు నాలుగు కప్పుల కంటే ఎక్కువ కాఫీ తాగితే బరువు కూడా పెరుగుతారు. అందుకే కాఫీని పరిమితంగా తీసుకుంటేనే ఆరోగ్యకరమని నిపుణులు సూచిస్తున్నారు