AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Wheat Vs jowar Roti: గోధుమ Vs జొన్న రోటీ బరువు తగ్గడానికి, ఆరోగ్యానికి ఏది బెస్ట్!

best roti for weight loss: మన భారతీయ సాంప్రదాయ వంటకాళ్లలో రొట్టెలు ఎంతో ప్రసిద్ధి గాంచినవి.. మన తాతల కాలం నుంచి అందరూ వాటినే ఎక్కవగా ఆహారంగా తీసుకునే వాళ్లు. అయితే ఇంతకు మందు కేవలం జొన్నలు, రాగులు వంటి దాన్యాలతో చేసే రొట్టెలు ఎక్కువగా తినేవారు. కానీ ప్రస్తుతం అందరూ గోదుమ రొట్టెలను తినడం అలవాటు చేసుకున్నారు. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారికి, జొన్న రొట్టే లేదా గోదుమ రొట్టే రెండింటిలో ఏ ఉత్తమమైనదో ఇప్పుడు తెలుసుకుందాం.

Wheat Vs jowar Roti:  గోధుమ Vs జొన్న రోటీ బరువు తగ్గడానికి, ఆరోగ్యానికి ఏది బెస్ట్!
Jowar Roti Vs Wheat Roti
Anand T
|

Updated on: Jan 27, 2026 | 3:14 PM

Share

సాధారణంగా మనదేశంలోని ప్రతి గ్రామంలో జనాలు ఎక్కువగా తినేది రొట్టెలే. వీటిలో జొన్న, రాగులు వంటి మిల్లెట్స్ రోటీలతో పాటు గోధుమ రోటీలు కూడా ఉన్నాయి. కొంతమంది గోదుమ రొట్టెలు తినడానికి ఇష్టపడితే మరికొందరు జొన్న రొట్టెలు తింటారు. అయితే ఇక్కడ చాలా మందికి ఉన్న డౌట్ ఏమిటంటే బరువుతగ్గడానికి లేదా ఆరోగ్యంగా ఉండేందుకు రెండింటిలో ఏది బెస్ట్ అని. నిపుణుల ప్రకారం.. గోధుమ రొట్టె చాలా తేలికైనది ఇది త్వరగా జీర్ణం అవుతుంది. జొన్న రొట్టెలో ఫైబర్, ప్రోటీన్, ఇనుము పుష్కలంగా ఉంటాయి, ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది అలాగే తక్షణ శక్తిని అందిస్తుంది. కాబట్టి మీ డెయిలీ తినడానికి ఏ రోటీ మంచిది, ఎందుకు మంచిదో మనం తెలుసుకుందాం

గోదుమ వర్సెల్ జొన్న రొట్టెలోని పోషకాల పరంగా చూసుకుంటే..

ఫైబర్ : ఒక జొన్న రోట్టెలొ గోధుమ రొట్టె కంటే ఎక్కువ ఫైబర్ ఉంటుంది. గోధుమ రోట్టెలో దాదాపు 2.5 గ్రాముల ఫైబర్ ఉంటుంది, అయితే జొన్న రొట్టెలో దాదాపు 3.2 గ్రాములు ఉంటాయి. అధిక ఫైబర్ కంటెంట్ కడుపుని ఎక్కువసేపు నిండుగా ఉంచడానికి, ఆహారాన్ని నెమ్మదిగా జీర్ణం చేయడానికి సహాయపడుతుంది. ఇది రక్తంలో చక్కెర వేగంగా పెరగకుండా నిరోధిస్తుంది.

ప్రోటీన్ : ఒక జొన్న రొట్టెలో దాదాపు 3.3 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది, గోధుమ రొట్టెలో దాదాపు 2.6 గ్రాములు ఉంటాయి. అంటే మిల్లెట్ రొట్టెలో కొంచెం ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. కణాల నష్టాన్ని సరిచేయడానికి, కండరాలను బలోపేతం చేయడానికి, ఎముకలను అభివృద్ధి చేయడానికి ప్రోటీన్ అవసరం.

ఐరన్: జొన్న రొట్టెలో ఇనుము కూడా పుష్కలంగా ఉంటుంది . గోధుమ రొట్టెలో 1.1 మి.గ్రా.తో పోలిస్తే, ఒక జొన్న రొట్టెలొ దాదాపు 2.1 మి.గ్రా. ఇనుము ఉంటుంది. ఇనుము రక్తహీనతను నివారిస్తుంది, శరీరం అంతటా ఆక్సిజన్‌ను రవాణా చేయడంలో సహాయపడుతుంది, అలసటను తగ్గిస్తుంది.

ఏది తక్కువ కార్బోహైడ్రేట్లను కలిగి ఉంటుంది?

ఒక గోధుమ రొట్టెలో దాదాపు 15.7 గ్రాముల కార్బోహైడ్రేట్లు ఉంటాయి, అదే ఒక జొన్నరొట్టెలో దాదాపు 19.1 గ్రాముల కార్బోహైడ్రేట్లు ఉంటాయి. తక్కువ కార్బ్ ఆహారం అనుసరించేవారికి లేదా వారి కార్బోహైడ్రేట్లను తగ్గించుకోవాలనుకునే వారికి, గోధుమ రొట్టెలు మంచి ఎంపిక, అయితే మీరు గోధుమ రొట్టెను ఏడాది పొడవునా తినవచ్చు. కానీ జొన్న రొట్టే వెచ్చని స్వభావం కారణంగా వేసవిలో తక్కువగా తినాలని సిఫార్సు చేస్తారు. అందుకే శీతాకాలంలో జొన్న రొట్టెలను ఎక్కువగా తింటారు.

రెండింటిలో ఏది బెస్ట్

చిరు ధాన్యాలు, గోధుమ రోటీలు రెండూ ఆరోగ్యకరమైనవే. అందువల్ల, మీ అవసరాలు, వాతావరణం, మీ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, వాటిని మీ ఆహారంలో ప్రత్యామ్నాయంగా చేర్చుకోవడం ఉత్తమం, తద్వారా మీ శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు లభిస్తాయి.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.