శ్రీశైలం టోల్ గేట్ వద్ద నిర్వహించిన వాహన తనిఖీల్లో మహారాష్ట్రకు చెందిన కారులో అనుమానాస్పదంగా తరలిస్తున్న రూ.30 లక్షల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సరైన ఆధారాలు చూపించలేకపోవడంతో ఈ నగదును దేవస్థానం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ పోలీసులకు అప్పగించారు.