TGSRTC Tourism: అదిరిపోయే గుడ్ న్యూస్: కేవలం రూ. 3,500కే గోవా టూర్.. TGSRTC బంపర్ ఆఫర్!
పర్యాటక ప్రియులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) తీపి కబురు అందించింది. ఫిబ్రవరి రెండో వారంలో వచ్చే వరుస సెలవులను దృష్టిలో ఉంచుకుని, సామాన్యులకు సైతం అందుబాటులో ఉండేలా అత్యంత తక్కువ ధరకే గోవా వివిధ చారిత్రక ప్రాంతాల సందర్శన ప్యాకేజీలను ప్రకటించింది. ప్రైవేట్ వాహనాల్లో వేల రూపాయలు ఖర్చు చేసే పని లేకుండా, సురక్షితమైన లగ్జరీ బస్సుల్లో ఈ యాత్రను పూర్తి చేసే వెసులుబాటును కల్పించింది.

కేవలం విహారయాత్రలే కాకుండా, ఆధ్యాత్మిక యాత్రలు చేయాలనుకునే భక్తుల కోసం కూడా ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీలను సిద్ధం చేసింది. గోవాలోని బీచ్‌లు, హంపీలోని యునెస్కో వారసత్వ కట్టడాలు మరియు మహారాష్ట్రలోని ప్రముఖ శక్తిపీఠాలను కవర్ చేస్తూ ఈ టూర్ షెడ్యూల్‌ను రూపొందించారు. ప్రభుత్వ రవాణా సంస్థ పర్యవేక్షణలో సాగే ఈ ప్రయాణం కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లే వారికి ఎంతో సౌకర్యవంతంగా ఉండనుంది. ఈ ప్యాకేజీల ధరలు బుకింగ్ వివరాలు ఇప్పుడు చూద్దాం.
TGSRTC టూర్ ప్యాకేజీల వివరాలు:
గోవా – హంపీ – తుల్జాపూర్ యాత్ర (రూ. 3,500): ఈ ప్యాకేజీలో భాగంగా 3 రాత్రులు, 4 రోజుల పాటు పర్యటన సాగుతుంది. గోవా అందాలను చూడటంతో పాటు, హంపీ చారిత్రక ప్రాశస్త్యాన్ని తిలకించవచ్చు. అలాగే తుల్జాపూర్ భవాని అమ్మవారి దర్శనం కూడా ఇందులో భాగమే.
ఆధ్యాత్మిక యాత్ర (రూ. 3,000): మహారాష్ట్ర కర్ణాటకలోని ప్రముఖ క్షేత్రాలైన పండరీపూర్ (విఠల రుక్మిణి), గానుగాపూర్ (దత్తాత్రేయ స్వామి), కొల్హాపూర్ (మహాలక్ష్మి అమ్మవారు) తుల్జాపూర్ భవాని మాత ఆలయాలను ఈ ప్యాకేజీ ద్వారా దర్శించుకోవచ్చు.
బుకింగ్ సంప్రదింపులు:
ఫిబ్రవరి నెలలో రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున, ఆసక్తి గల పర్యాటకులు TGSRTC అధికారిక వెబ్‌సైట్ ద్వారా ముందస్తుగా టికెట్లు రిజర్వ్ చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం ఈ క్రింది హెల్ప్‌లైన్ నంబర్లను సంప్రదించవచ్చు:
ఫోన్ నంబర్లు: 9391072283, 9063401072.
