
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గాయం విషయంలో ఆందోళన చెందుతోన్న క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. చీల మండ గాయంతో బాధపడుతున్న పాండ్యా వీలైనంత త్వరగా బరిలోకి దిగనున్నడని, సెమీస్‌లోపే అతను జట్టుతో కలుస్తాడని నేషనల్ మీడియా పేర్కొంది. ప్రస్తుతం బెంగళూరులోని ఎన్‌సీఏలో చికిత్స తీసుకుంటోన్న పాండ్యా మరో రెండు రోజుల్లో ట్రైనింగ్ మొదలు పెట్టే అవకాశమున్నట్లు తెలిసింది. ఇంజెక్షన్లతో పాండ్యాను త్వరగా కోలుకునేలా చేయవచ్చు. అయితే వరల్డ్ కప్‌లో భారత్ సెమీస్ బెర్తును ఖరారు చేసుకుంది. కాబట్టి పాండ్యా సహజంగానే కోలుకునేలా ట్రీట్మెంట్ ఇస్తున్నాం. ఈ వారాంతంలోనే అతను తన ట్రైనింగ్ను ప్రారంభిస్తాడు’ అని నేషనల్ మీడియా పేర్కొంది. దీంతో టీమిండియా ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. కాగా బంగ్లా దేశ్ తో జరిగిన మ్యాచ్‌లో బౌలింగ్ చేస్తూ గాయ పడ్డాడు పాండ్యా. గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో న్యూజిలాండ్‌తో మ్యాచ్‌కు దూరమయ్యాడు. అతని స్థానంలో మహ్మద్ షమీ, సూర్య కుమార్ యాదవ్ జట్టులోకి వచ్చారు. ఆదివారం (అక్టోబర్ 29) న ఇంగ్లండ్ తో మ్యాచ్‌లో బరిలోకి దిగుతాడని వార్తలు వచ్చాయి. అయితే టీమిండియా దాదాపు సెమీస్ చేరడంతో పాండ్యా విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సెమీస్ మ్యాచ్‌లకు చాలా సమయం ఉండడంతో అతను పూర్తిగా కోలుకుని ఫిట్‌నెస్ సాధించేవరకు ఆడనివ్వకపోవడమే మంచిదంటున్నారు. అయితే నాకౌట్ మ్యాచ్‌లకు పాండ్యా కచ్చితంగా అందుబాటులోకి వస్తాడని తెలుస్తోంది.
కాగా ప్రపంచకప్-2023లో హార్దిక్ పాండ్యా బ్యాట్‌తో రాణించడంతో పాటు కీలక సమయాల్లో వికెట్లు తీస్తున్నాడు. దీంతో సెమీస్ లోపు అతని విషయంలో ఎలాంటి పొరపాట్లు చేయకూడదని టీమిండియా మేనేజ్‌మెంట్ భావిస్తోంది. ఇక భారత్ తన తర్వాతి మ్యాచ్‌లో ఇంగ్లండ్ తో తలపడనుంది. ఆదివారం లక్నో వేదికగా జరిగే ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే అక్కడకు చేరుకుంది భారత జట్టు. ఇవాళ్టి నుంచి ప్రాక్టీస్ ప్రారంభించనుంది. మరోవైపు ఇప్పటికే టోర్నీ నుంచి ఇంగ్లండ్ జట్టు దాదాపు నిష్క్రమించింది. అయితే ఇంగ్లిష్ టీమ్‌పై ఎలాంటి అంచనాలు లేకపోవడంతో ఆ జట్టు ఆటగాళ్లు స్వేచ్ఛగా ఆడే అవకాశముంది. కాబట్టి ఇంగ్లండ్ మ్యాచ్ విషయంలో భారత జట్టు అప్రమత్తంగా ఉండాలని క్రికెట్ నిపుణులు సూచిస్తున్నారు.
The BCCI had an option to play Hardik with injections, but decided to let him heal naturally.#Hardikpandya #pandya #Cricketnews #cricketgyan pic.twitter.com/cEG4KrETJ8
— Cricket Gyan (@cricketgyann) October 27, 2023
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..