AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ICC World Cup 2023: వరల్డ్‌ కప్‌ తర్వాత హెడ్‌ కోచ్‌గా తప్పుకోనున్న రాహుల్‌ ద్రవిడ్‌.. కారణమిదే?

స్వదేశంలో జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ టోర్నమెంట్‌లో టీమిండియా అదరగొడుతోంది. వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో టాప్‌ ప్లేస్‌తో పాటు సెమీస్‌ బెర్తును దాదాపు ఖరారు చేసుకుంది. ఇలా ప్రతిష్ఠాత్మక ప్రపంచకప్‌లో టీమిండియా అద్భుత ప్రదర్శన చేస్తున్న క్రమంలో ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అదేంటంటే.. భారత జట్టు కోచ్‌గా ఉన్న రాహుల్ ద్రవిడ్ క్రికెట్ ప్రపంచకప్ తర్వాత తన పదవికి రాజీనామా చేసే అవకాశం ఉందట.

ICC World Cup 2023: వరల్డ్‌ కప్‌ తర్వాత హెడ్‌ కోచ్‌గా తప్పుకోనున్న రాహుల్‌ ద్రవిడ్‌.. కారణమిదే?
Rahul Dravid
Basha Shek
|

Updated on: Oct 27, 2023 | 1:20 PM

Share

స్వదేశంలో జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ టోర్నమెంట్‌లో టీమిండియా అదరగొడుతోంది. వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో టాప్‌ ప్లేస్‌తో పాటు సెమీస్‌ బెర్తును దాదాపు ఖరారు చేసుకుంది. ఇలా ప్రతిష్ఠాత్మక ప్రపంచకప్‌లో టీమిండియా అద్భుత ప్రదర్శన చేస్తున్న క్రమంలో ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అదేంటంటే.. భారత జట్టు కోచ్‌గా ఉన్న రాహుల్ ద్రవిడ్ క్రికెట్ ప్రపంచకప్ తర్వాత తన పదవికి రాజీనామా చేసే అవకాశం ఉందట. ద్రవిడ్ కోచ్ కాంట్రాక్ట్ నవంబర్‌లో ముగుస్తుంది. అందుకే తన పదవి నుంచి ద్రవిడ్‌ తప్పుకోనే అవకాశాలు ఉన్నాయట. అయితే ప్రపంచకప్ లో భారత్‌ ప్రయాణంపైనే ద్రవిడ్ భవిష్యత్తు కూడా ఆధారపడి ఉందని చెప్పొచ్చు. ఒకవేళ భారత్ ప్రపంచకప్ గెలవడంలో విఫలమైతే, ద్రవిడ్ కోచ్ పదవి నుంచి తప్పుకుంటాడని తెలుస్తోంది. ఎందుకంటే ద్రవిడ్ హయాంలో టీమ్ ఇండియా ఏ ఐసీసీ ఈవెంట్‌ను గెలవలేకపోయింది. గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ ప్రయాణం సెమీఫైనల్‌లోనే ముగిసింది. ఆ తర్వాత జరిగిన ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భారత్ పరాజయం పాలైంది. ఇప్పుడు ప్రపంచకప్‌లోనూ ద్రవిడ్‌ ఓడిపోతే ద్రవిడ్‌ తన పదవి నుంచి తప్పుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట

ఇదిలా ఉంటే 51 ఏళ్ల ద్రవిడ్ భారత జట్టు నుంచి వైదొలిగి ఐపీఎల్‌ జట్లకు కోచ్‌గా మారే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా కోచ్ పదవీకాలం పొడిగింపు లేదా కొత్త కోచ్ గురించి రాహుల్‌తో ఇప్పటివరకు ఎలాంటి చర్చలు జరగలేదని బీసీసీఐ సీనియర్‌ అధికారి ఒకరు చెప్పుకొచ్చారు. ‘ ప్రస్తుతం ప్రపంచకప్‌పైనే మా అందరి దృష్టి ఉంది. ఇప్పటి వరకు రాహుల్‌ కోచ్‌గా తప్పుకోవడం, కొనసాగించడంపై మాకు ఎలాంటి సూచనలు రాలేదు’ అని ఆయన చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే రవిశాస్త్రి తర్వాత భారత జట్టు కోచ్‌ పగ్గాలు చేపట్టారు రాహుల్‌ ద్రవిడ్‌. అయితే మిస్టర్‌ డిపెండబుల్‌ నాయకత్వంలో భారత క్రికెట్ జట్టు మిశ్రమ ఫలితాలను అందుకుంది. స్వదేశం, విదేశాలలో ద్వైపాక్షిక సిరీస్‌లలో ఆధిపత్యం చెలాయించినప్పటికీ, ప్రధాన టోర్నమెంట్‌లలో ట్రోఫీని గెలుచుకోవడంలో టీమిండియా విఫలమైంది. ఓవరాల్ హెడ్ కోచ్‌గా ద్రవిడ్ రెండేళ్ల కాంట్రాక్ట్ నవంబర్‌లో ముగియనుంది. దీని తర్వాత, భారత ప్రధాన కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్ లేదా ఆశిష్ నెహ్రా అవకాశం పొందవచ్చని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

ట్రెక్కింగ్ లో టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..