ICC Womens Rankings: ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ఒక స్థానం కోల్పోయిన మిథాలీ రాజ్; మెరుగుపడిన గోస్వామి ర్యాంక్
టీమిండియా మహిళల వన్డే కెప్టెన్ మిథాలి రాజ్ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ఒక ర్యాంక్ కోల్పోయింది. తాజాగా ప్రకటించిన ర్యాంకుల్లో రెండో స్థానానికి పడిపోయింది.
ICC Womens Rankings: టీమిండియా మహిళల వన్డే కెప్టెన్ మిథాలి రాజ్ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ఒక ర్యాంక్ కోల్పోయింది. తాజాగా ప్రకటించిన ర్యాంకుల్లో రెండో స్థానానికి పడిపోయింది. విండీస్ సారథి స్టెఫానీ టేలర్ నాలుగు స్థానాలు ఎగబాకి మొదటి స్థానంలో నిలవడంతోపాటు ఆల్‌రౌండర్ల జాబితాలోనూ తొలి స్థానానికి దూసుకెళ్లింది. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ కెప్టెన్ స్టెఫానీ సెంచరీతో దుమ్ములేపడమే కాకుండా బౌలింగ్‌లోనూ 3/29 ఆకట్టుకుంది. అలాగే టీం విజయంలో కీలక పాత్ర పోషించింది. ఈ క్రమంలోనే ఆమె వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ మిథాలీ రాజ్‌ను అధిగమించింది. అలాగే ఆల్‌రౌండర్ల జాబితాలో ఆస్ట్రేలియా ప్లేయర్ ఎలిసిపెర్రీని దాటేసింది.
మరోవైపు ఈ వెస్టిండీస్ కెప్టెన్ బౌలింగ్‌లోనూ మూడు స్థానాలు ఎగబాకి 16వ ర్యాంక్ దక్కించుకుంది. ఇక టీమిండియా వెటరన్ పేసర్ జూలన్ గోస్వామి ఐదో ర్యాంక్ సాధించింది. ఆల్‌రౌండర్ల జాబితాలో దీప్తి శర్మ అదే ర్యాంక్‌తో కొనసాగుతోంది.
? Batter ? All-rounder@windiescricket star Stafanie Taylor sizzles in the latest @MRFWorldwide ICC Women’s ODI Rankings ? pic.twitter.com/OlcuWfEuvV
— ICC (@ICC) July 13, 2021
Also Read:
Viral Photo: నిన్ను చూడలేక పోతున్నాం బాబూ… నీ గెటప్ మార్చు: టీమిండియా పేసర్‌పై యువరాజ్ ట్రోల్స్
The Hundred: ‘ద హండ్రెడ్’.. క్రికెట్‌లో సరికొత్త ఫార్మాట్ ఎంట్రీ.. రూల్స్ ఏంటో తెలుసా!
Sourav Ganguly: సౌరభ్ గంగూలీనే బెస్ట్ కెప్టెన్.. సచిన్ వికెట్‌కే నా తొలిప్రాధాన్యత: షోయబ్ అక్తర్
Sourav Ganguly: లార్డ్స్ విజయానికి 19 ఏళ్లు.. చొక్కా విప్పి గిరగిరా తిప్పిన గంగూలీ..!