T20 World Cup 2022, IND vs PAK: భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్ కోసం టిక్కెట్ బుకింగ్ షురూ.. రేట్లు ఎలా ఉన్నాయంటే?
India vs Pakistan: ఆస్ట్రేలియాలో అక్టోబర్ 16 నుంచి నవంబర్ 13 వరకు జరగనున్న టీ20 క్రికెట్ ప్రపంచ కప్ టిక్కెట్ల విక్రయం ప్రారంభమైంది. ఈ టిక్కెట్లను ఐసీసీ వెబ్‌సైట్ నుంచి బుక్ చేసుకోవచ్చు.
India vs Pakistan: అక్టోబర్ 16 నుంచి నవంబర్ 13 వరకు ఆస్ట్రేలియా(Australia)లో జరగనున్న టీ20 ప్రపంచ కప్(T20 World Cup 2022) టిక్కెట్ల విక్రయం ప్రారంభమైంది. ఈ టిక్కెట్లు ‘t20 worldcup.com‘లో అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఫైనల్‌తో సహా 45 మ్యాచ్‌ల టిక్కెట్లను కొనుగోలు చేయవచ్చు. పిల్లలకు మొదటి రౌండ్, సూపర్ 12 దశలకు $5 డాలర్లు(సుమారు రూ.374), పెద్దలకు టిక్కెట్లు $20డాలర్లు( సుమారు రూ. 1495) ఉంటుందని ఐసీసీ (ICC) ఒక ప్రకటనలో తెలిపింది.
మొదటిసారిగా, పురుషుల టీ20 ప్రపంచ కప్ ఆస్ట్రేలియాలో జరగనుంది. దీని మ్యాచ్‌లు అడిలైడ్, బ్రిస్బేన్, గీలాంగ్, హోబర్ట్, మెల్‌బోర్న్, పెర్త్, సిడ్నీలలో జరుగుతాయి. ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల కెప్టెన్ ఆరోన్ ఫించ్ మాట్లాడుతూ, “ఐసీసీ టీ 20 ప్రపంచ కప్ అద్భుతంగా ఉంటుంది. ప్రేక్షకుల ముందు టైటిల్‌ను నిలబెట్టుకునే అవకాశం రావడం మాకు గర్వకారణంగా ఉంటుంది’ అని తెలిపాడు.
2015 వన్డే క్రికెట్ ప్రపంచకప్‌తో పాటు గతేడాది మహిళల టీ20 ప్రపంచకప్‌లో స్వంత ప్రేక్షకుల ప్రాముఖ్యత వెల్లడైంది. దేశం మొత్తం మమ్మల్ని ప్రోత్సహిస్తున్నప్పుడు, మేం దానిని మరో చిరస్మరణీయ ప్రపంచకప్‌గా మారుస్తామని ఫించ్ పేర్కొన్నాడు.
టీ20 ప్రపంచ కప్ 2022లో అక్టోబర్ 23న భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీని తర్వాత అక్టోబర్ 30న పెర్త్‌లో దక్షిణాఫ్రికాతో టీమిండియా మ్యాచ్ ఆడనుంది. నవంబర్ 2న భారత్, బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ జరగనుంది.
IPL 2022 Auction: జట్టు పేరును ప్రకటించిన సీవీసీ క్యాపిటల్స్.. అహ్మదాబాద్ ఫ్రాంచైజీ ఇకపై..