Watch Video: టీమిండియా చరిత్రలో అద్భుతం.. భారత బౌలర్ దెబ్బకు తోకముడిచిన పాక్.. 23 ఏళ్లైనా నేటికీ ఎంతో ప్రత్యేకం
Anil Kumble: 1999 ఢిల్లీ టెస్ట్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను టీమిండియా ఘోరంగా ఓడించింది. ఈ మ్యాచ్‌లో అనిల్ కుంబ్లే అద్భుతంగా బౌలింగ్ చేసి ఆకట్టుకున్నాడు.
India vs Pakistan: మాజీ భారత బౌలర్ అనిల్ కుంబ్లే(Anil Kumble) తన కెరీర్‌లో అనేక చారిత్రక రికార్డులను నమోదు చేసిన సంగతి తెలిసిందే. టీమిండియా(Team India) దిగ్గజ ఆటగాళ్లలో ఒకడిగా పేరుగాంచిన అనిల్ కుంబ్లే.. ఆస్ట్రేలియా, వెస్టిండీస్, దక్షిణాఫ్రికాతో సహా అనేక పెద్ద జట్లపై తన అత్యుత్తమ బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. అయితే పాకిస్తాన్(Ind vs Pak)పై ఆడిన ఓ మ్యాచ్ అనిల్ కుంబ్లే కెరీర్‌లోనే ఎంతో ప్రత్యేకంగా నిలిచింది. 23 ఏళ్ల క్రితం ఇదే రోజున కుంబ్లే పాకిస్థాన్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు పడగొట్టాడు. ఈ మేరకు బీసీసీఐ ఓ వీడియోను ట్వీట్ చేసింది.
1999లో భారత్‌లో పాకిస్థాన్ టీం పర్యటించింది. ఇక్కడ ఇరు జట్ల మధ్య టెస్టు సిరీస్ జరిగింది. ఈ సిరీస్‌లోని రెండో మ్యాచ్ ఢిల్లీలో ఫిబ్రవరి 4 నుంచి 7 వరకు జరిగింది. భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 252 పరుగులకు ఆలౌట్ కాగా, రెండో ఇన్నింగ్స్‌లో 339 పరుగులు చేసింది. అయితే పాక్ తన తొలి ఇన్నింగ్స్‌లో 172 పరుగులకే కుప్పకూలింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో 207 పరుగులకే ఆలౌటైంది.
తొలి ఇన్నింగ్స్‌లో కుంబ్లే 4 వికెట్లు తీశాడు. మహ్మద్ యూసుఫ్, ఇంజమామ్-ఉల్-హక్ వంటి ఆటగాళ్లను ఔట్ చేశాడు. కాగా, రెండో ఇన్నింగ్స్‌లో దూకుడు ప్రదర్శించాడు. ఇందులో పాక్‌కు చెందిన 10 మంది ఆటగాళ్లను పెవిలియన్ చేర్చి సత్తా చాటాడు. ఎజాజ్ అహ్మద్, మహ్మద్ యూసుఫ్, సక్లైన్ ముస్తాక్‌లను సున్నాకే కుంబ్లే పెవిలియన్ చేర్చడం విశేషం.
ఈ టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో అనిల్ కుంబ్లే 26.3 ఓవర్లు బౌలింగ్ చేసి 74 పరుగులిచ్చి 10 వికెట్లు పడగొట్టాడు. ఈ ఇన్నింగ్స్‌లో కుంబ్లే 9 మెయిడిన్ ఓవర్లు కూడా వేశాడు. ఈ మ్యాచ్‌లో భారత జట్టు 212 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
?️ #OnThisDay in 1999#TeamIndia spin legend @anilkumble1074 set the stage on fire and became the first Indian to take all the 10 wickets in a Test innings. ? ?
Let’s relive that sensational performance ? ? pic.twitter.com/qZW7zvB2mf
— BCCI (@BCCI) February 7, 2022
Also Read: IPL 2022 Auction: జట్టు పేరును ప్రకటించిన సీవీసీ క్యాపిటల్స్.. అహ్మదాబాద్ ఫ్రాంచైజీ ఇకపై..