IPL 2022 Auction: జట్టు పేరును ప్రకటించిన సీవీసీ క్యాపిటల్స్.. అహ్మదాబాద్ ఫ్రాంచైజీ ఇకపై..
IPL-2022లో ఈసారి ఎనిమిది జట్లకు బదులుగా 10 జట్లు పాల్గొంటున్న సంగతి తెలిసిందే. లక్నో, అహ్మదాబాద్ రెండు కొత్త జట్లు ఈ ఏడాది నుంచి బరిలోకి దిగనున్నాయి.
ఐపీఎల్-2022(IPL 2022) లో రెండు కొత్త జట్లు ఆడనున్న సంగతి తెలిసిందే. ఈ జట్లలో ఒకటి లక్నో సూపర్‌జెయింట్స్ కాగా మరో జట్టు అహ్మదాబాద్ ఫ్రాంచైజీకి చెందినది. సోషల్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం, అహ్మదాబాద్ ఫ్రాంచైజీ(Ahmedabad Franchise) సోమవారం తన జట్టు పేరును ప్రకటించింది. అహ్మదాబాద్ టైటాన్స్(Ahmedabad Titans)గా పేరు పెట్టింది. అహ్మదాబాద్ జట్టుకు హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌గా నియమించగా, ఈ జట్టులో శుభ్‌మన్ గిల్‌ను కూడా చేర్చుకుంది. ఆశిష్ నెహ్రా, గ్యారీ కిర్‌స్టన్‌లు కోచింగ్ సిబ్బందిలో చేరారు.
హార్దిక్, గిల్‌తోపాటు అహ్మదాబాద్ జట్టు ఆఫ్ఘనిస్తాన్ లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌ను చేర్చుకుంది. రషీద్ ఇంతకుముందు వరకు సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడాడు. 2016లో టైటిల్‌ను గెలుచుకున్న జట్టులో భాగంగా ఉన్నాడు. రషీద్ కోసం ఈ కొత్త టీమ్ రూ.15 కోట్లు వెచ్చించింది. గిల్ కోసం అహ్మదాబాద్ రూ. 8 కోట్లు కేటాయించింది. గతంలో పాండ్యా ముంబై ఇండియన్స్, గిల్ కేకేఆర్ తరఫున ఆడేవారు.
గ్రీన్ సిగ్నల్ పొందడంలో ఎన్నో అడ్డంకులు.. అయితే ఈ టీమ్ బీసీసీఐ నుంచి గ్రీన్ సిగ్నల్ పొందడంలో చాలా అడ్డంకులు ఎదుర్కొంది.ఈ టీమ్ సీవీసీ క్యాపిటల్స్ యాజమాన్యంలో ఉంది. విదేశాల్లోని బెట్టింగ్ కంపెనీలతో సంబంధాలపై పెద్ద చర్చ జరిగింది. బీసీసీఐ కూడా దీనిపై విచారణకు ఆదేశించి, పూర్తిగా సంతృప్తి చెందిన తర్వాతే ఈ జట్టుకు తుది ఆమోదం తెలిపింది.
పర్సులో ఎంత డబ్బు ఉందంటే? ఈ బృందం తన పర్సు నుంచి రూ. 38 కోట్లు ఖర్చు చేసింది. మెగా వేలంలో రూ. 52 కోట్లతో బరిలోకి దిగనుంది. ప్రధాన కోచ్ నెహ్రా, మెంటార్ కిర్‌స్టెన్‌తో పాటు, మాజీ ఇంగ్లండ్ ఓపెనర్ విక్రమ్ సోలంకీ కూడా కోచింగ్ స్టాఫ్‌లో జట్టులో చేరారు. ముగ్గురూ కలిసి వేలంలో జట్టును సిద్ధం చేయనున్నారు. ఈ జట్టు గుజరాత్‌కు చెందిన రెండో జట్టు. గతంలో స్పాట్ ఫిక్సింగ్ కేసులో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ నిషేధానికి గురైనప్పుడు గుజరాత్ లయన్స్ అనే జట్టు ఐపీఎల్‌లోకి ప్రవేశించింది. ఈ జట్టు 2015, 2016 అంటే రెండు సంవత్సరాల పాటు ఐపీఎల్ ఆడింది. ఈ జట్టుకు సురేష్ రైనా కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈ జట్టులో దినేష్ కార్తీక్, డెవాన్ బ్రావో వంటి ఆటగాళ్లు ఉన్నారు.