Lata Mangeshkar: లతా మంగేష్కర్‌కు క్రికెట్‌తో విడదీయరాని అనుబంధం.. సచిన్ రిటైర్మెంట్ అప్పుడు ఆమె ఏమన్నరంటే.
Lata Mangeshkar: కోట్లాది మంది అభిమానులను విషాదంలోకి నెట్టెస్తూ దివికేగారు గాన కోకిల లతా మంగేష్కర్. 30వలేకిపైగా పాటలతో దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న లతా ఆదివారం తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే..
Lata Mangeshkar: కోట్లాది మంది అభిమానులను విషాదంలోకి నెట్టెస్తూ దివికేగారు గాన కోకిల లతా మంగేష్కర్. 30వలేకిపైగా పాటలతో దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న లతా ఆదివారం తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఆమె లేరన్న వార్తను అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే లతా జీవితానికి సంబంధించిన విశేషాలు తెలసుకుంటున్నారు. అయితే లతా అంటే పాట, పాట అంటే లతా అన్నంతలా మారిన నేపథ్యంలో ఆమెకు పాటతో పాటు మరో అంశంపై కూడా ఆసక్తి ఉండేదని మీకు తెలుసా.? అవును పాటే జీవితంగా బతికిన లతాకు క్రికెట్‌తో కూడా విడలేని అనుబంధం ఉంది.
లతాకు క్రికెట్‌తో ఇంతలా అనుబంధం ఏర్పడడానికి రాజ్ సింగ్ కూడా కారణమని చెప్పవచ్చు. లతా మంగేష్కర్ సోదరుడు హృదయనాథ్‌కు క్రికెటర్ రాజ్‌సింగ్ దుంగార్పూర్ మంచి స్నేహితుడు. రాజ్‌సింగ్‌తో లతాకు పరిచయం ఏర్పాడానికి ఇదే కారణం. మంచి స్నేహితులుగా మారిన లతా, రాజ్‌సింగ్ వివాహం చేసుకుందమనే ఆలోచన కూడా చెసినట్లు బాలీవుడ్ వర్గాల్లో అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే రాజ్‌సింగ్ కుటంబంలో వివాహానికి అడ్డుచెప్పడంతో ఇద్దరూ జీవితంలో వివాహం చేసుకోలేరని కొందరు చెబుతుంటారు. దీంతో ఇద్దరూ చివరి వరకు మంచి స్నేహితులుగానే మిగిలిపోయారు. రాజ్‌సింగ్ అప్పట్లో బీసీసీఐకి ప్రెసిండ్‌గా వ్యవహరించారు. దీంతో లతాకు క్రికెట్‌పై మక్కువ ఏర్పడింది.
1983లో కపిల్ దేవ్ సారథ్యంలో టీమిండియా వెస్ట్‌ఇండిస్‌ను ఓడించి తొలి ప్రపంచ కప్‌ను అందుకున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌ను లతా మంగేష్కర్ నేరుగా గ్రౌండ్‌లో వీక్షించారు. భారత్ అనూహ్య విజయం సాధించడంపట్ల అప్పట్లో ఆమె మాట్లాడుతూ.. ‘నేను లార్డ్స్‌లో ఫైనల్‌ని చూశాను, రెండుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన వెస్టిండీస్‌ను ఓడించి ప్రపంచకప్‌ను గెలుచుకున్నామని నమ్మలేకపోతున్నాను’ అని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా భారత్ విజయానికి చిహ్నంగా ఒక ప్రత్యేక పాటను ఆలపించారు లతా.
అంతేకాకుండా టీమిండియా వరల్డ్ కప్ అందుకున్న సందర్భంగా లతా వారికి ఏదైన బహుమతి ఇవ్వాలని అనుకుంది. అందుకుగాను ఢిల్లీలో కచెరీలో నిర్వహించారు. ఈ కచెరీలో భాగంగా వచ్చిన మొత్తాన్ని లతా క్రికెటర్లందరికీ తలా రూ. లక్ష అందించారు. క్రికెట్ అన్నా, క్రికెటర్లు అన్నా లతాకు ఎంత అభిమానమో చెప్పడానికి ఇది మరో మంచి ఉదాహరణగా చెప్పవచ్చు. ఇక లతాకు ఇష్టమైన క్రికెటర్లలో సచిన్ టెండూల్కర్ ముందు వరుసలో ఉంటారని చెప్పాలి. సచిన్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన సందర్భంలో లతా పలు వ్యాఖ్యలు చేశారు.
‘అందరు క్రికెటర్లు మంచి వారు, కానీ సచిన్ నాకు ఫేవరేట్. సచిన్ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించారన్న వార్త వినగానే బాధేసింది. కానీ కాలక్రమేణా ఆ విషయాన్ని మరిచిపోయాను. ఎంత గొప్ప ఆటగాళ్లు అయినా శాశ్వతంగా ఆడలేరు. చివరికి సచిన్ అయినా’ అని చెప్పుకొచ్చారు. లతా క్రికెట్‌పై చూపిన అభిమానానికి గాను టీమిండియా కూడా లతా మరణం పట్ల తమదైన శైలిలో నివాళులు అర్పించారు. తాజాగా ఆదివారం జరిగిన వన్డే మ్యాచ్‌లో టీమిండియా ప్లేయర్స్ అంతా నలుపు రంగు బ్యాడ్జ్ ధరించి మ్యాచ్ ఆడారు. ఇలా లతాకు ప్లేయర్స్ నివాళులు అర్పించారు.
Also Read: JNU VC: జేఎన్‌యూ వీసీగా మరోసారి తెలుగు వారికి అవకాశం.. తొలి మహిళా వీసీగా శాంతిశ్రీ ధూళిపూడి.
JNU VC: జేఎన్‌యూ వీసీగా మరోసారి తెలుగు వారికి అవకాశం.. తొలి మహిళా వీసీగా శాంతిశ్రీ ధూళిపూడి.