ICC T20 Rankings: పాక్ ఓపెనర్ దెబ్బకు దిగజారిన కోహ్లీ ప్లేస్.. అదే బాటలో కేఎల్ రాహుల్ కూడా..!
టీ20 ప్రపంచ కప్‌లో పాకిస్తాన్‌తో భారత్ ఓడిపోవడంతో ఓవైపు రోజుకో వివాదం వెలుగుచూస్తూనే ఉంది. అయితే మరో విషయంలోనూ కోహ్లీసేనకు దెబ్బ తగిలింది.
ICC Batter Rankings: టీ20 ప్రపంచ కప్‌లో పాకిస్తాన్‌తో భారత్ ఓడిపోవడంతో ఓవైపు రోజుకో వివాదం వెలుగుచూస్తూనే ఉంది. అయితే ఈ మ్యాచు దెబ్బకు మరో విషయంలోనూ కోహ్లీసేనకు దెబ్బ తగిలింది. నేడు(బుధవారం) ఐసీసీ విడుదల చేసిన టీ20 ర్యాకింగ్స్‌లో భారత ఆటగాళ్లు దిగజారిపోయారు. భారత సారథి విరాట్ కోహ్లీ 4వ స్థానం నుంచి కిందకు పడిపోయాడు. ప్రస్తుతం 5వ స్థానంలో నిలిచాడు. అలాగే టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ రెండు స్థానాలు దిగజారి 8వ స్థానానికి చేరుకున్నాడు.
అయితే పాక్ మ్యాచులో కింగ్ కోహ్లీ 49 బంతుల్లో 57 పరుగులు చేయడంతో 725 రేటింగ్ పాయింట్లు సాధించాడు. అలాగే రాహుల్ (3 పరుగులు) 684 రేటింగ్ పాయింట్లు సాధించాడు. దీంతో భారత్ 7 వికెట్ల నష్టానికి కేవలం 151 పరుగులు మాత్రమే చేసింది. అనంతరం పాకిస్తాన్ మరో 13 బంతులు మిగిలి ఉండగానే భారత్ ఉంచిన టార్గెట్‌ను ఛేదించి, 10 వికెట్ల తేడాతే విజయం సాధించింది.
ఈ మ్యాచులో పాక్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ 79 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అలాగే మంగళవారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచులో 33 పరుగులు చేయడంతో టీ20 ర్యాకింగ్స్్లో మూడు స్థానాలు ఎగబాకి, అతడి కెరీర్ బెస్ట్ ర్యాకింగ్ 4వ స్థానంలో నిలిచాడు. అలాగే ఆస్ట్రేలియా, వెస్టిండీస్ టీంలపై వరుసగా 40, 52 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ ఐడెన్ మాక్రం తన కెరీర్ బెస్ట్ ర్యాంకింగ్‌కు చేరుకున్నాడు. మాక్రం ఎనిమిది స్థానాలు ఎగబాకి ఏకంగా 3వ స్థానంలో నిలిచాడు. మాక్రం గత నెలలో తొమ్మిదో స్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం అతని కెరీర్‌లో 147.29 స్ట్రైక్‌రేట్‌తో దాదాపు 40 సగటుతో పరుగులు సాధించి మూడో స్థానానికి చేరుకున్నాడు. ఇంగ్లండ్‌క్ చెందిన డేవిడ్ మలన్ 831 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. పాక్ కెప్టెన్ బాబర్ అజం 820 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు.
స్కాట్లాండ్‌పై 46 పరుగులు చేసి ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన రహ్మానుల్లా గుర్బాజ్ తొమ్మిది స్థానాలు ఎగబాకి 12వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. బంగ్లాదేశ్ ఓపెనర్ మహ్మద్ నయీం శ్రీలంకపై 52 బంతుల్లో 62 పరుగులు చేసిన తరువాత 11 స్థానాలు ఎగబాకి 13వ స్థానానికి చేరుకున్నాడు.
అలాగే నమీబియా కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మన్ తన జట్టును సూపర్ 12లో చేర్చిన తరువాత ఉమ్మడిగా 37వస్థానంలో నిలిచాడు. బంగ్లాదేశ్ స్పిన్నర్ మహేదీ హసన్ స్థిరమైన పొదుపు బౌలింగ్‌తో బౌలర్ల జాబితాలో తన కెరీర్‌లోనే బెస్ట్ 12వ స్థానానికి చేరుకున్నాడు. పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ షాహీన్ అఫ్రిది 31 పరుగులకు మూడు వికెట్లు తీసి భారత్‌పై 10 వికెట్ల విజయాన్ని అందించడంలో కీలక పాత్ర వహించాడు. దీంతో షాహీన్ 11 స్థానాలు ఎగబాకి 12వ స్థానానికి చేరుకున్నాడు. న్యూజిలాండ్పై 22 పరుగులకు 4 వికెట్లు తీసి వరుసగా రెండో విజయాన్ని నమోదు చేయడంలో హారిస్ రౌఫ్ తన కెరీర్ బెస్ట్ 17వ స్థానానికి చేరుకున్నాడు. బంగ్లాదేశ్ స్టార్ షకీబ్ అల్ హసన్ టీ20 ప్రపంచకప్‌లో అద్భుతంగా రాణిస్తుండడంతో ఆల్ రౌండర్లలో అగ్రస్థానానికి తిరిగి చేరుకున్నాడు.
⚡ Big gains for Aiden Markram, JJ Smit
? Mohammad Rizwan rises to No.4 among batters
All you need to know about the latest rankings ? https://t.co/1sQBCW4KB0 pic.twitter.com/WfPp8XBb5I
— ICC (@ICC) October 27, 2021
Also Read: ENG vs BAN, T20 World Cup 2021: ఇంగ్లండ్ దెబ్బకు బంగ్లా టైగర్స్ విలవిల.. పరుగులు చేయలేక నానా తంటాలు