AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs NZ: పాక్‌తో బెడిసికొట్టిన వ్యూహం.. ‘ప్లాన్ బీ’తో కివీస్‌ పోరుకు సిద్ధమైన కోహ్లీసేన.. ఏం చేయనున్నారంటే?

T20 World Cup 2021: పాకిస్తాన్‌తో తొలి మ్యాచ్ ఆడిన కోహ్లీసేన ప్లాన్‌ ఏతో ముందుకు సాదింది. కానీ, అది ఫలించకపోవడంతో న్యూజిలాండ్‌తో ప్లాన్‌బీతో ముందుకు వెళ్లనుంది.

IND vs NZ: పాక్‌తో బెడిసికొట్టిన వ్యూహం.. 'ప్లాన్ బీ'తో కివీస్‌ పోరుకు సిద్ధమైన కోహ్లీసేన.. ఏం చేయనున్నారంటే?
ఒకవేళ గ్రూప్-బీలో ఉన్న ఆఫ్గనిస్తాన్, స్కాట్‌ల్యాండ్, నమీబియాలను టీమిండియా, పాకిస్తాన్, న్యూజిలాండ్ ఓడిస్తే.. అప్పుడు ఒక్కో టీంకు 6 పాయింట్లు వస్తాయి.
Venkata Chari
|

Updated on: Oct 27, 2021 | 4:40 PM

Share

T20 World Cup 2021, IND vs NZ: మంగళవారం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచులో న్యూజిలాండ్‌ ఓటమి తర్వాత భారత శిబిరంలో కొంత ఊరట లభించింది. ప్రస్తుతం భారత్ దృష్టి న్యూజిలాండ్‌‌తో జరిగే ఈ ఆదివారం జరగనున్న మ్యాచ్‌పైనే ఉంది. నెట్ రన్ రేట్‌లో బాగా వెనుకబడిన భారత్‌‌పై ప్రస్తుతం అలాంటి ఒత్తిడి లేదు. ఐసీసీ వంటి ‘మల్టీ టీమ్ ఈవెంట్స్’లో భారత్ ప్రదర్శనతో పాటు ఇతర జట్ల ప్రదర్శనపై కూడా ఆధారపడుతోంది. అందుకు తగ్గట్టుగానే జట్టు వ్యూహం మార్చుకోవాల్సి వస్తుంది. అయితే న్యూజిలాండ్‌పై స్ట్రైక్ రొటేట్ అనే వ్యూహంతో రంగంలోకి దిగాలని భారత్ జట్టు ప్లాన్ చేస్తుంది. అంటే దీని అర్థం బ్యాట్స్‌మెన్ పెద్ద షాట్‌లు ఆడకుండా వికెట్ల మధ్య పరుగులు తీస్తూ స్కోరుబోర్డును పెంచేందుకు ప్రయత్నిస్తారమన్నమాట.

టీ20 ప్రపంచకప్‌లో వెస్టిండీస్ జట్టు డిఫెండింగ్ ఛాంపియన్‌గా నిలిచింది. అంతకు ముందు 2012లో టీ20 ప్రపంచకప్‌ను కూడా గెలుచుకుంది. ఈ టైటిల్‌ను రెండుసార్లు గెలుచుకున్న ఏకైక జట్టు వెస్టిండీస్. అయితే తొలి మ్యాచ్‌లోనే విండీస్ కేవలం 55 పరుగులకే ఆలౌటైంది. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో దుబాయ్‌లోని పిచ్‌కు బలైంది. అయితే దీని తర్వాత అదే పిచ్‌పై భారత్‌-పాక్‌ల మధ్య మ్యాచ్‌ జరిగింది. ఇందులో ఇరు జట్లు కలిసి దాదాపు 300 పరుగులు చేశాయి. వెస్టిండీస్ తదుపరి మ్యాచ్ దక్షిణాఫ్రికా జట్టుతో జరిగింది. టోర్నీలో నిలవాలంటే విండీస్ టీంకు విజయం అవసరం. కానీ, కరీబియన్ ఆటగాళ్లు స్ట్రైక్ రొటేట్ చేయడం కంటే స్ట్రైక్ రేట్ పైనే ఎక్కువ శ్రద్ధ పెట్టారు. దీంతో ఆ మ్యాచులో మరోసారి ఘోర పరాజయం పాలైంది.

వెస్టిండీస్ జట్టు నేర్పిన పాఠాలు.. వెస్టిండీస్‌ టీం దక్షిణాఫ్రికా ముందు 144 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. మ్యాచ్ ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా 10 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. వెస్టిండీస్‌ బ్యాటింగ్‌ను పరిశీలిస్తే ఈ విషయం మరింత స్పష్టమవుతుంది. నికోలస్ పూరన్ 172 స్ట్రైక్ రేట్ వద్ద 12 పరుగులు చేశాడు. క్రిస్ గేల్ 100 స్ట్రైక్ రేట్ వద్ద 12 పరుగులు చేశాడు. కీరన్ పొలార్డ్ 130 స్ట్రైక్ రేట్ వద్ద 26 పరుగులు, ఆండ్రీ రస్సెల్ 125 స్ట్రైక్ రేట్ వద్ద 5 పరుగులు, డ్వేన్ బ్రావో 160 స్ట్రైక్ రేట్ వద్ద 8 పరుగులు చేశాడు. అంటే, ఆరుగురు బ్యాట్స్‌మెన్స్ 100 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో పరుగులు చేశారు. అందరూ భారీ షాట్లు ఆడేందుకు ప్రయత్నించారు. కానీ, ఎవరూ క్రీజులో కొనసాగేందుకు ప్రయత్నించలేదు. స్ట్రైక్ రొటేట్ చేస్తూ పరుగులు సాధించారు. 56 బంతుల్లో పరుగులేమీ చేయలేదంటేనే అర్థమవుతోంది. 9 ఓవర్లకు పైగా క్రీజులో ఉన్నా భారీ షాట్లు ఆడే ప్రయత్నం ఫలించలేదు. కాగా, ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన దక్షిణాఫ్రికా జట్టు 34 డాట్ బాల్స్ ఆడింది.

మ్యాచ్ వ్యూహాన్ని చూసి నిర్ణయం.. అసలైన, ప్రత్యర్థి జట్టు మంచి బౌలింగ్, పిచ్, లేదా మరేదైనా కారణంగా పెద్ద షాట్లు కొట్టలేకపోతే రెండు పరుగులు చేయడం తెలివైన పని. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు ఓపెనర్ తొలి రెండు ఓవర్లలోనే పెవిలియన్‌కు చేరుకున్నారు. విరాట్ కోహ్లీ కేవలం 116 స్ట్రైక్ రేట్ వద్ద పరుగులు చేశాడు. కానీ, కోహ్లీ 57 పరుగుల కారణంగా, భారత జట్టు గౌరవప్రదమైన స్కోరును చేరుకుంది. కాకపోతే చాలా మంది బ్యాట్స్‌మెన్ మిడిల్ ఆర్డర్‌లో ఏరియల్ షాట్లు ఆడారు. ఆఖరి ఓవర్లో భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ వంటి బౌలర్లు క్రీజులో నిలవడం కూడా దీని ఫలితమే.

Also Read: ENG vs BAN, T20 World Cup 2021: ఇంగ్లండ్ దెబ్బకు బంగ్లా టైగర్స్ విలవిల.. పరుగులు చేయలేక నానా తంటాలు

Ind Vs Pak: హర్భజన్ సింగ్, మహ్మద్ అమీర్ మధ్య ట్విట్టర్ వార్.. పాత వీడియోలు పోస్టు చేస్తున్న మాజీ ఆటగాళ్లు..