AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistan: పాకిస్థాన్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన ఐసీసీ.. మరోసారి అక్కడ మొండిచేయేగా..!

ICC WTC Points Table Update: బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో ఓటమి చవిచూసిన పాకిస్థాన్ జట్టుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. స్లో ఓవర్ రేట్ కారణంగా ఆ జట్టుకు భారీ జరిమానాతో పాటు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో ఏకంగా 8 పాయింట్ల కోత విధించింది. దీంతో పాక్ ఫైనల్ అవకాశాలు మరింత సంక్లిష్టంగా మారాయి.

Pakistan: పాకిస్థాన్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన ఐసీసీ.. మరోసారి అక్కడ మొండిచేయేగా..!
Icc Wtc Points Table Update
Venkata Chari
|

Updated on: May 15, 2026 | 5:56 PM

Share

ICC WTC Points Table Update: పాకిస్థాన్ వర్సెస్ బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన ఉత్కంఠభరితమైన మొదటి టెస్ట్ మ్యాచ్‌లో ఆతిథ్య పాకిస్థాన్ జట్టు నిర్ణీత సమయంలో వేయాల్సిన ఓవర్ల కంటే ఎనిమిది ఓవర్లు తక్కువగా వేసినట్లు ఐసీసీ నిర్ధారించింది. ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం, నిర్ణీత సమయం కంటే ఆలస్యంగా వేసే ప్రతి ఓవర్‌కు ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో ఐదు శాతం జరిమానా విధిస్తారు. ఈ లెక్కన పాక్ ఆటగాళ్లందరికీ వారి మ్యాచ్ ఫీజులో 40 శాతం కోత పడింది.

పాయింట్ల పట్టికలో పాతాళానికి..

కేవలం జరిమానాతోనే ఈ శిక్ష ముగియలేదు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ నిబంధనల ప్రకారం (ఆర్టికల్ 16.11.2), తక్కువగా వేసిన ప్రతి ఓవర్‌కు ఒక్కో పాయింట్ చొప్పున కోత విధిస్తారు. దీనివల్ల పాకిస్థాన్ ఖాతాలోని ఎనిమిది విలువైన పాయింట్లను ఐసీసీ తొలగించింది. ఈ భారీ కోత తర్వాత పాకిస్థాన్ కేవలం నాలుగు పాయింట్లతో పట్టికలో ఎనిమిదో స్థానానికి పడిపోయింది. వెస్టిండీస్ కంటే కేవలం ఒక మెట్టు పైన ఉండి, తదుపరి దశకు చేరుకునే క్రమంలో తీవ్ర ఇబ్బందుల్లో కూరుకుపోయింది.

నేరాన్ని అంగీకరించిన కెప్టెన్ షాన్ మసూద్..

మ్యాచ్ అనంతరం ఫీల్డ్ అంపైర్లు రిచర్డ్ కెటిల్‌బరో, కుమార్ ధర్మసేన, ఇతర అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా ఐసీసీ రిఫరీ జెఫ్ క్రో ఈ నిర్ణయం తీసుకున్నారు. పాకిస్థాన్ కెప్టెన్ షాన్ మసూద్ తన జట్టు చేసిన తప్పిదాన్ని అంగీకరించడంతో ఎటువంటి తదుపరి విచారణ అవసరం లేకుండానే ఈ శిక్షను ఖరారు చేశారు.

బంగ్లాదేశ్ చారిత్రాత్మక విజయం..

ఇక మ్యాచ్ విషయానికి వస్తే, బంగ్లాదేశ్ బౌలర్ నహిద్ రాణా అద్భుత ప్రదర్శనతో పాకిస్థాన్‌ను రెండో ఇన్నింగ్స్‌లో కట్టడి చేసి, 5 వికెట్లు పడగొట్టాడు. ఫలితంగా బంగ్లాదేశ్ 104 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి చరిత్ర సృష్టించింది. ఒకవైపు ఓటమి, మరోవైపు ఐసీసీ పాయింట్ల కోతతో పాక్ క్రికెట్ అభిమానులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us