డకౌట్ స్టార్‌కు లక్కీ ఛాన్స్.. ఆ ముగ్గురికి నో ప్లేస్.. టీమిండియా వన్డే వరల్డ్‌కప్ జట్టు ఇదే..
Team India ODI World Cup 2023 Squad: అనుకున్నదే నిజమైంది.. సంచలనాలేమి లేకుండా.. బీసీసీఐ సెలెక్టర్లు టీమిండియా వన్డే వరల్డ్‌కప్ జట్టును ఎంపిక చేశారు. ఆసియా కప్‌కు ఎంపిక చేసిన ప్రాబబుల్స్‌లోనే ప్రపంచకప్ జట్టును కూడా ఎంపిక చేయడం గమనార్హం. ఐసీసీ నిబంధనల ప్రకారం.. వన్డే వరల్డ్‌కప్‌లో పాల్గొనబోయే భారత జట్టును ఎంపిక చేసే..

అనుకున్నదే నిజమైంది.. సంచలనాలేమి లేకుండా.. బీసీసీఐ సెలెక్టర్లు టీమిండియా వన్డే వరల్డ్‌కప్ జట్టును ఎంపిక చేశారు. ఆసియా కప్‌కు ఎంపిక చేసిన ప్రాబబుల్స్‌లోనే ప్రపంచకప్ జట్టును కూడా ఎంపిక చేయడం గమనార్హం. వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ సంజూ శాంసన్, హైదరాబాదీ ప్లేయర్ తిలక్ వర్మతో పాటు పేసర్ ప్రసిద్ద్ కృష్ణ, ఆఫ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్, వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌లకు వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కలేదు. అనూహ్యంగా ఫిట్‌నెస్ కారణంగా ఆసియా కప్ మొదటి రెండు మ్యాచ్‌లకు దూరమైన కెఎల్ రాహుల్ మాత్రం 15 మంది వరల్డ్ కప్ సభ్యుల్లో చోటు దక్కించుకోవడం విశేషం. ఐసీసీ నిబంధనల ప్రకారం.. వన్డే వరల్డ్‌కప్‌లో పాల్గొనబోయే భారత జట్టును ఎంపిక చేసే గడువు సెప్టెంబర్ 5గా ఉంది. ఇందుకోసం బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్.. శ్రీలంకలో కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రావిడ్‌లతో సమావేశమై.. మార్పులు, చేర్పులు గురించి చర్చించాడు. ప్లేయర్ల పేర్లు ఫైనలైజ్ చేసి.. తాజాగా ప్రకటించాడు.
ఇక భారత వన్డే వరల్డ్‌కప్ జట్టు విషయానికొస్తే.. ముంబై బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌కు ప్రపంచకప్ టీంలో చోటు దక్కించుకోగా.. ఇషాన్ కిషన్.. కెఎల్ రాహుల్‌కు బ్యాకప్ వికెట్ కీపర్‌గా వ్యవహరించనున్నాడు. ఓపెనింగ్ బాధ్యతలను ఎప్పటిలానే కెప్టెన్ రోహిత్ శర్మ, యువ బ్యాట్స్‌మెన్ శుభ్‌మాన్ గిల్ చేపట్టనున్నారు. ఇక మిడిలార్డర్ భారాన్ని విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్‌లు మోయనున్నారు. కెఎల్ రాహుల్ వికెట్ కీపర్ కాగా.. ఆల్‌రౌండర్లుగా హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ ఎంపికయ్యారు. అలాగే బ్యాటింగ్ లైనప్ బలంగా ఉండేందుకు శార్దూల్ ఠాకూర్‌ను ఎంపిక చేశారు సెలెక్టర్లు. స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్.. పేస్ విభాగాన్ని జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, మహమ్మద్ షమీ చూసుకోనున్నారు.
వన్డే వరల్డ్ కప్‌కు భారత జట్టు ఇదే:
రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మాన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, కెఎల్ రాహుల్(వికెట్ కీపర్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), హార్ధిక్ పాండ్యా(వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రిత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, మహమ్మద్ షమీ
Squad: Rohit Sharma (Captain), Shubman Gill, Virat Kohli, Shreyas Iyer, Ishan Kishan, KL Rahul, Hardik Pandya (Vice-captain), Suryakumar Yadav, Ravindra Jadeja, Axar Patel, Shardul Thakur, Jasprit Bumrah, Mohd. Shami, Mohd. Siraj, Kuldeep Yadav#TeamIndia | #CWC23
— BCCI (@BCCI) September 5, 2023
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..