AFG vs SL Playing 11: శ్రీలంకకు డూ ఆర్ డై మ్యాచ్.. టాస్ గెలిచిన షనక సేన.. సూపర్ 4 చేరాలంటే గెలవాల్సిందే..
Afghanistan vs Sri Lanka Playing 11: ఆఫ్ఘనిస్థాన్, శ్రీలంక మధ్య ఇప్పటి వరకు 10 వన్డేల్లో తలపడ్డాయి. శ్రీలంక 6, ఆఫ్ఘనిస్థాన్ 3 మ్యాచ్‌లు గెలిచాయి. ఒక్క మ్యాచ్ ఫలితం లేదు. 2014 ఆసియా కప్‌లో ఆఫ్ఘనిస్థాన్ తొలిసారి పాల్గొంది. ఆసియా కప్‌లో వన్డే ఫార్మాట్‌లో వీరిద్దరి మధ్య 2 మ్యాచ్‌లు జరిగాయి. ఒకదానిలో ఆఫ్ఘనిస్థాన్ గెలుపొందగా, మరొకటి శ్రీలంక గెలిచింది.

Afghanistan vs Sri Lanka Playing 11: లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో ఆసియా కప్‌లో చివరి లీగ్ మ్యాచ్ ఆఫ్ఘనిస్థాన్, శ్రీలంక మధ్య జరుగుతోంది. తొలుత టాస్ గెలిచిన శ్రీలంక బ్యాటింగ్ ఎంచుకుంది. మధ్యాహ్నం 3:00 గంటల నుంచి మ్యాచ్ జరగనుంది. గ్రూప్-బిలో సూపర్-4 రేసు ఉత్కంఠగా మారింది. ఆఫ్ఘనిస్తాన్‌ను భారీ తేడాతో ఓడించి బంగ్లాదేశ్ సూపర్-4కు అర్హత సాధించింది. ఇప్పుడు గ్రూప్-బిలో ఒకే జట్టు మిగిలి ఉంది. దీని కోసం శ్రీలంక, ఆఫ్ఘనిస్థాన్‌తో పోటీ పడనుంది. ఆసియా కప్‌లో శ్రీలంకకు ఇది రెండో మ్యాచ్.
తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించింది. కాగా, అఫ్గానిస్థాన్ జట్టు తన తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోయింది.




ఈ మ్యాచ్‌లో శ్రీలంక గెలిస్తే, అఫ్గానిస్థాన్‌పై వరుసగా మూడో వన్డే విజయం శ్రీలంకకు దక్కుతుంది. రెండు జట్లు చివరిసారిగా ఈ ఏడాది జూన్‌లో ODI ఫార్మాట్‌లో తలపడ్డాయి. శ్రీలంక మూడు మ్యాచ్‌ల ODI సిరీస్‌ను 2-1తో గెలుచుకుంది.
శ్రీలంక తన చివరి 11 వన్డే మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే శ్రీలంక వరుసగా 12 విజయాలు అందుకుంటుంది. మరోవైపు ఆఫ్ఘనిస్థాన్ తన చివరి ఐదు వన్డేల్లో ఓడిపోయింది.
టాస్ గెలిచిన లంక..
View this post on Instagram
ఆఫ్ఘనిస్థాన్, శ్రీలంక మధ్య ఇప్పటి వరకు 10 వన్డేల్లో తలపడ్డాయి. శ్రీలంక 6, ఆఫ్ఘనిస్థాన్ 3 మ్యాచ్‌లు గెలిచాయి. ఒక్క మ్యాచ్ ఫలితం లేదు. 2014 ఆసియా కప్‌లో ఆఫ్ఘనిస్థాన్ తొలిసారి పాల్గొంది. ఆసియా కప్‌లో వన్డే ఫార్మాట్‌లో ఇరుజట్ల మధ్య 2 మ్యాచ్‌లు జరిగాయి. ఒకదానిలో ఆఫ్ఘనిస్థాన్ గెలుపొందగా, మరొకటి శ్రీలంక గెలిచింది.
ఇరు జట్లు:
View this post on Instagram
ఆఫ్ఘనిస్తాన్ (ప్లేయింగ్ XI): రహ్మానుల్లా గుర్బాజ్(w), ఇబ్రహీం జద్రాన్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ(c), నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ, గుల్బాదిన్ నాయబ్, కరీం జనత్, రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రహ్మాన్, ఫజల్హాక్ ఫరూఖీ
శ్రీలంక (ప్లేయింగ్ XI): పాతుమ్ నిస్సాంక, దిముత్ కరుణరత్నే, కుసల్ మెండిస్(w), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, దసున్ షనక(సి), దునిత్ వెల్లలాగే, మహేశ్ తీక్షణ, కసున్ రజిత, మతీషా పతిరనా.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




