World Cup 2023: వన్డే ప్రపంచ కప్ అంపైర్లు వీరే.. లిస్టులో భారత్ నుంచి ఒక్కరే.. ఎవరంటే?
ఇది కాకుండా నలుగురు అంపైర్లు ICC ఎమర్జింగ్ అంపైర్ ప్యానెల్‌తో సంబంధం కలిగి ఉన్నారు. ఇందులో షరాఫుద్దౌలా ఇబ్నే షాహిద్ (బంగ్లాదేశ్), పాల్ విల్సన్ (ఆస్ట్రేలియా), అలెక్స్ వార్ఫ్ (ఇంగ్లండ్), క్రిస్ బ్రౌన్ (న్యూజిలాండ్) ఉన్నారు. ఇక మ్యాచ్ రిఫరీ గురించి మాట్లాడితే, ఇందులో జెఫ్ క్రో (న్యూజిలాండ్), ఆండీ పైక్రాఫ్ట్ (జింబాబ్వే), రిచీ రిచర్డ్‌సన్ (వెస్టిండీస్), జవగల్ శ్రీనాథ్ (భారతదేశం) ఉన్నారు. ఈ నలుగురూ మాజీ అంతర్జాతీయ క్రికెటర్లే.
ICC World Cup 2023 Umpires: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ప్రపంచ కప్ 2023 కోసం అంపైర్లను ప్రకటించింది. ప్రస్తుతానికి లీగ్ దశ మ్యాచ్‌లకు మాత్రమే అధికారిక ప్రకటన వెలువడింది. సెమీ-ఫైనల్, ఫైనల్ మ్యాచ్‌ల గురించి తర్వాత ప్రకటిస్తారు. ప్రపంచ కప్ 2023 అక్టోబర్ 5 నుంచి ప్రారంభం కానుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్, చివరిసారి ఫైనలిస్ట్ న్యూజిలాండ్ మధ్య అహ్మదాబాద్‌లో తొలి మ్యాచ్ జరగనుంది. తొలి సెమీఫైనల్ మ్యాచ్ ముంబైలో, రెండో సెమీఫైనల్ కోల్‌కతాలో, ఫైనల్ మ్యాచ్ నవంబర్ 19న అహ్మదాబాద్‌లో జరగనుంది. అక్టోబర్ 14న అహ్మదాబాద్‌లో భారత్, పాకిస్థాన్ మధ్య హై ఓల్టేజీ మ్యాచ్ జరగనుంది.
ప్రపంచ కప్ 2023 కోసం మ్యాచ్ అంపైర్లు వీరే..
16 మంది అంపైర్లు, నలుగురు మ్యాచ్ రిఫరీలను ఐసీసీ ప్రకటించింది. ఏ అంపైర్‌లను ఎంపిక చేశారో ఇప్పుడు చూద్దాం..
క్రిస్ గాఫ్నీ (న్యూజిలాండ్), కుమార్ ధర్మసేన (శ్రీలంక), మరైస్ ఎరాస్మస్ (దక్షిణాఫ్రికా), మైఖేల్ గోఫ్ (ఇంగ్లండ్), నితిన్ మీనన్ (భారత్), పాల్ రీఫిల్ (ఆస్ట్రేలియా), రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్ (ఇంగ్లండ్), రిచర్డ్ కెటిల్‌బరో (ఇంగ్లండ్), రాడ్ టక్కర్ (ఆస్ట్రేలియా), జో విల్సన్ (వెస్టిండీస్), అహ్సన్ రజా (పాకిస్థాన్), అడ్రియన్ హోల్డ్‌స్టాక్ (దక్షిణాఫ్రికా) ఈ లిస్టులో ఉన్నారు.
ఇది కాకుండా నలుగురు అంపైర్లు ICC ఎమర్జింగ్ అంపైర్ ప్యానెల్‌తో సంబంధం కలిగి ఉన్నారు. ఇందులో షరాఫుద్దౌలా ఇబ్నే షాహిద్ (బంగ్లాదేశ్), పాల్ విల్సన్ (ఆస్ట్రేలియా), అలెక్స్ వార్ఫ్ (ఇంగ్లండ్), క్రిస్ బ్రౌన్ (న్యూజిలాండ్) ఉన్నారు. ఇక మ్యాచ్ రిఫరీ గురించి మాట్లాడితే, ఇందులో జెఫ్ క్రో (న్యూజిలాండ్), ఆండీ పైక్రాఫ్ట్ (జింబాబ్వే), రిచీ రిచర్డ్‌సన్ (వెస్టిండీస్), జవగల్ శ్రీనాథ్ (భారతదేశం) ఉన్నారు. ఈ నలుగురూ మాజీ అంతర్జాతీయ క్రికెటర్లే.
ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ల మధ్య తొలి మ్యాచ్‌కు అధికారులను కూడా ప్రకటించారు. ఫీల్డ్ అంపైర్లుగా నితిన్ మీనన్, కుమార్ ధర్మసేన వ్యవహరిస్తారు. టీవీ అంపైర్‌గా పాల్ విల్సన్, నాలుగో అంపైర్‌గా షరాఫుద్దౌలా ఇబ్నే వ్యవహరిస్తారు. ఆండీ పైక్రాఫ్ట్ మ్యాచ్ రిఫరీగా వ్యవహరిస్తారు.
అంపైర్ల లిస్ట్ ఇదే..
JUST IN: Match officials for #CWC23 announced 👇
— ICC Cricket World Cup (@cricketworldcup) September 8, 2023
ప్రపంచకప్‌నకు మరో 27 రోజులు మిగిలి ఉంది. అందుకే ప్రస్తుతం అన్ని జట్లు తమ సన్నాహాల్లో బిజీగా ఉన్నాయి.
వన్డే ప్రపంచ కప్ బరిలో నిలిచే భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (కీపర్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, అక్షర్ పటేల్, ఇషాన్ కిషన్ (కీపర్), సూర్యకుమార్ యాదవ్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..