AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

World Cup 2023: వన్డేల్లో తోపు ప్లేయర్లు వీరే.. డ్రీమ్ ODI ప్లేయింగ్ XIలో టాప్ 5ని ప్రకటించిన సెహ్వాగ్..

Virender Sehwag: భారత క్రికెట్ జట్టు వెటరన్ బ్యాట్స్‌మెన్‌లలో ఒకరైన వీరేంద్ర సెహ్వాగ్ మూడు ఫార్మాట్‌లలో మంచి ప్రదర్శన చేశాడు. సెహ్వాగ్ తన వన్డే కెరీర్‌లో 251 మ్యాచ్‌ల్లో 15 సెంచరీలు, 38 హాఫ్ సెంచరీల సాయంతో 8273 పరుగులు చేశాడు. వన్డేల్లో అత్యధిక స్కోరు (219) సాధించిన ప్రపంచ రికార్డును కూడా కలిగి ఉన్నాడు. ఆ తర్వాత రోహిత్ శర్మ దానిని బద్దలు కొట్టాడు. సెహ్వాగ్ కూడా 6 సార్లు ODIలలో తొంభైల్లో ఔటైన బాధితుడిగా మారాడు. ఒకసారి అతను 99 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

World Cup 2023: వన్డేల్లో తోపు ప్లేయర్లు వీరే.. డ్రీమ్ ODI ప్లేయింగ్ XIలో టాప్ 5ని ప్రకటించిన సెహ్వాగ్..
Sehwag Dream ODI XIImage Credit source: ICC
Venkata Chari
|

Updated on: Sep 08, 2023 | 6:20 PM

Share

Virender Sehwag: భారత క్రికెట్ జట్టు దిగ్గజ తుఫాన్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తన కలల ODI XIలో ముగ్గురు భారత ఆటగాళ్లను ఎంపిక చేసుకున్నాడు. అలాగే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ టీంల నుంచి ఒక్కో ఆటగాడిని ఎంపిక చేశాడు. వీరేంద్ర సెహ్వాగ్ భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, వెటరన్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లి, ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాలను తన డ్రీమ్ వన్డే XIలో మొదటి ఐదుగురు ఆటగాళ్లలో ఎంపిక చేశాడు. గత దశాబ్దంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి అద్భుత ప్రదర్శన చేసి చాలా పరుగులు చేశారు. వన్డేల్లో రోహిత్ శర్మ మూడు డబుల్ సెంచరీలు సాధించగా, సెంచరీల పరంగా విరాట్ కోహ్లీ చాలా ముందున్నాడు. జస్ప్రీత్ బుమ్రా గురించి చెప్పాలంటే, అతను తన బౌలింగ్‌తో ఎన్నో విజయాలు సాధించాడు.

డేవిడ్ వార్నర్, గ్లెన్ ఫిలిప్స్‌ను ఎంపిక చేసిన వీరేంద్ర సెహ్వాగ్..

దీంతో పాటు ఆస్ట్రేలియా దిగ్గజ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్, న్యూజిలాండ్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ గ్లెన్ ఫిలిప్స్‌లను కూడా వీరేంద్ర సెహ్వాగ్ ఎంపిక చేశాడు. మిడిల్ ఆర్డర్‌లో గ్లెన్ ఫిలిప్స్ అద్భుతమైన ఇన్నింగ్స్‌లకు పేరుగాంచాడు. ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా తరపున వార్నర్ చాలా పరుగులు చేశాడు. అతను 18 మ్యాచ్‌ల్లో 62 సగటుతో 992 పరుగులు చేశాడు. ఈ కాలంలో నాలుగు సెంచరీలు చేశాడు.

ఇవి కూడా చదవండి

భారత క్రికెట్‌లో డేంజరస్ ప్లేయర్..

భారత క్రికెట్ జట్టు వెటరన్ బ్యాట్స్‌మెన్‌లలో ఒకరైన వీరేంద్ర సెహ్వాగ్ మూడు ఫార్మాట్‌లలో మంచి ప్రదర్శన చేశాడు. సెహ్వాగ్ తన వన్డే కెరీర్‌లో 251 మ్యాచ్‌ల్లో 15 సెంచరీలు, 38 హాఫ్ సెంచరీల సాయంతో 8273 పరుగులు చేశాడు. వన్డేల్లో అత్యధిక స్కోరు (219) సాధించిన ప్రపంచ రికార్డును కూడా కలిగి ఉన్నాడు. ఆ తర్వాత రోహిత్ శర్మ దానిని బద్దలు కొట్టాడు. సెహ్వాగ్ కూడా 6 సార్లు ODIలలో తొంభైల్లో ఔటైన బాధితుడిగా మారాడు. ఒకసారి అతను 99 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

వీరేంద్ర సెహ్వాగ్ ప్రకటించిన డ్రీమ్ వన్డే ప్లేయింగ్ XIలో ఐదురుగు ఆటగాళ్లు..

View this post on Instagram

A post shared by ICC (@icc)

వన్డే ప్రపంచ కప్ బరిలో నిలిచే భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (కీపర్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, అక్షర్ పటేల్, ఇషాన్ కిషన్ (కీపర్), సూర్యకుమార్ యాదవ్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..