కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చి.. మ్యాచ్ విన్నర్‌గా నిలిచాడు.. ఇది క్రికెట్ చరిత్రలోనే రెండోసారి.!

తుది జట్టులో చోటు దక్కలేదు.. అస్సలు ఆడడని అందరూ ఊహించారు. కానీ ఎవ్వరూ అనుకోలేదు.. కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దిగాడు. మ్యాచ్ చేతుల్లో నుంచి జారిపోయిందని అనుకున్నలోపు.. ప్రత్యర్ధులను పడగొట్టి.. చివరికి జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. క్రికెట్ చరిత్రలోనే ఇది రెండోసారి..

కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చి.. మ్యాచ్ విన్నర్‌గా నిలిచాడు.. ఇది క్రికెట్ చరిత్రలోనే రెండోసారి.!
Australia Vs South Africa
Follow us
Ravi Kiran

|

Updated on: Sep 08, 2023 | 5:11 PM

తుది జట్టులో చోటు దక్కలేదు.. అస్సలు ఆడడని అందరూ ఊహించారు. కానీ ఎవ్వరూ అనుకోలేదు.. కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దిగాడు. మ్యాచ్ చేతుల్లో నుంచి జారిపోయిందని అనుకున్నలోపు.. ప్రత్యర్ధులను పడగొట్టి.. చివరికి జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. క్రికెట్ చరిత్రలోనే ఇది రెండోసారి.. ఆ ఆటగాడు అద్భుతం సృష్టించింది. ఇంతకీ అతడెవరో కాదు.. ఆస్ట్రేలియా యువ సెన్సేషన్ మార్నస్ లబూషేన్. దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న ఐదు వన్డేల సిరీస్‌లో ఆస్ట్రేలియా శుభారంభాన్ని చేసింది. బుధవారం జరిగిన తొలి వన్డేలో 3 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 49 ఓవర్లకు 222 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టు కెప్టెన్ టెంబా బావుమా(114) అదిరిపోయే సెంచరీతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మరోవైపు బౌలర్ మార్కో జానెసన్‌(32) రాణించాడు. వీరిద్దరూ మినహా.. మిగిలిన బ్యాటర్లు ఎవ్వరూ కూడా సరైన పార్టనర్‌షిప్ అందించకపోవడంతో.. సఫారీలు తక్కువ స్కోర్‌కే పరిమితమయ్యారు. అటు ఆసీస్ బౌలర్లలో హజిల్‌వుడ్ 3 వికెట్లు.. స్టోయినిస్ రెండు వికెట్లు.. అబాట్, అగర్, జంపా, గ్రీన్ తలో వికెట్ పడగొట్టారు.

ఇక 223 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టు 74 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. అయితే ఈ సమయంలో కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చాడు మార్నస్ లబూషేన్ 93 బంతుల్లో 80 పరుగులు చేసి.. చివరి వరకు అజేయంగా నిలిచి.. జట్టుకు విజయాన్ని అందించాడు. తొలుత ఈ మ్యాచ్‌లో లబూషేన్‌ను.. తుది జట్టులోకి తీసుకోలేదు ఆస్ట్రేలియా మేనేజ్‌మెంట్. కానీ కామెరాన్ గ్రీన్ తలకు గాయం కావడంతో.. అతడి ప్లేస్‌లో ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగాడు లబూషేన్. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని.. ఆల్‌రౌండర్ ఆస్టన్ అగర్(44)తో కలిసి కీలకమైన సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పొడంతో పాటు.. అజేయంగా 80 పరుగులు చేశాడు. చివరికి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డుగా నిలిచాడు. ఇక ప్రోటీస్ బౌలర్లలో గెరాల్డ్, రబాడ చెరో రెండు వికెట్లు, ఎంగిడి, మహారాజా, జానెసన్ తలో వికెట్ పడగొట్టారు. కాగా, ఐదు వన్డేల సిరీస్‌లో 1-0తో ఆస్ట్రేలియా ఆధిక్యం సాధించింది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే సెప్టెంబర్‌ 9న జరగనుంది. అలాగే లబూషేన్.. సబ్‌స్టిట్యూట్‌గా ఇలా రావడం రెండోసారి. మొదటిసారి స్టీవ్ స్మిత్ స్థానంలో వచ్చి.. యాషెస్ సిరీస్‌లో అర్ధ సెంచరీ సాధించాడు.

ఆస్ట్రేలియా వన్డే వరల్డ్ కప్ 2023 స్క్యాడ్ ఇదే..

మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం..