- Telugu News Photo Gallery Cricket photos Rohit Sharma want to break west indies star chris gayle record of most sixes in international cricket
Rohit Sharma: గేల్ రికార్డ్‌ను బ్రేక్ చేయాలని ఉంది.. మనసులో మాట బయటపెట్టిన హిట్‌మ్యాన్.. అదేంటో తెలుసా?
Rohit Sharma-Chris Gayle: టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రస్తుత కాలంలోని గొప్ప బ్యాట్స్‌మెన్‌లలో ఒకడిగా పేరుగాంచాడు. తన అద్భుతమైన బ్యాటింగ్‌తో అనేక రికార్డులను సృష్టించాడు. కానీ, రోహిత్ దృష్టిలో ఉన్న రికార్డు మీకు తెలుసా? ఈ ప్రత్యేకమైన రికార్డును బద్దలు కొట్టడానికి తన శాయశక్తులా ప్రయత్నిస్తాడు. కుదిరితే ఆసియా కప్ 2023లోనే లేదా ప్రపంచకప్ 2023లో ఈ రికార్డ్‌ను బ్రేక్ చేసేస్తాడు.
Updated on: Sep 08, 2023 | 4:55 PM

Asia Cup 2023: రోహిత్ శర్మ ప్రస్తుత కాలంలో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌గా పేరుగాంచిన సంగతి తెలిసిందే. అతని క్లాస్, టైమింగ్‌తో అభిమానులను అలరిస్తుంటాడు. రోహిత్ శర్మ బ్యాటింగ్‌ను అందరూ ఇష్టపడతారనడంలో ఎలాంటి సందేహం లేదు. రోహిత్ తన బ్యాటింగ్‌తో ఎన్నో రికార్డులు సృష్టించాడు. వన్డే క్రికెట్‌లో 3 డబుల్ సెంచరీలు చేసిన ఏకైక బ్యాట్స్‌మెన్‌గా హిట్‌మ్యాన్ నిలిచాడు. రికార్డులపై శ్రద్ధ పెట్టనని రోహిత్ చెబుతున్నా.. ప్రస్తుతం వెస్టిండీస్ తుఫాన్ బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్ పేరిట ఉన్న అపూర్వ రికార్డును బద్దలు కొట్టాలన్నది అతని కోరికగా పేర్కొన్నాడు.

అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం క్రిస్ గేల్ రికార్డు సృష్టించాడు. గేల్ 483 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో మొత్తం 553 సిక్సర్లను కలిగి ఉన్నాడు. ఇక టీమిండియా సారథి రోహిత్ శర్మ గురించి మాట్లాడితే 446 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 539 సిక్సర్లు బాదేశాడు. ఈ క్రమంలో గేల్ రికార్డును బద్దలు కొట్టాలంటే రోహిత్ మరో 14 సిక్సర్లు బాదితే చాలన్నమాట.

ఇప్పటికే టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌ల్లో రోహిత్ శర్మ విండీస్ దిగ్గజాన్ని వెనక్కి నెట్టాడు. ఇక్కడ రోహిత్ సిక్సర్లు కొట్టడంలో నంబర్-1 స్థానంలో నిలిచాడు. 148 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచుల్లో 182 సిక్సర్లు రోహిత్ పేరిట ఉన్నాయి. ఈ విషయంలో న్యూజిలాండ్‌కు చెందిన మార్టిన్ గప్టిల్ రెండో స్థానంలో ఉన్నాడు. అతని పేరిట 173 సిక్సర్లు ఉండగా, గేల్ 103 మ్యాచ్‌ల్లో 125 సిక్సర్లు కలిగి ఉన్నాడు.

రోహిత్ ఇటీవల సీనియర్ జర్నలిస్ట్ విమల్ కుమార్‌కు ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో అతను క్రిస్ గేల్ సిక్సర్ల రికార్డును బద్దలు కొట్టాలనుకుంటున్నట్లు తెలిపాడు. దీనికి రోహిత్ మొదట నవ్వుతూ, అదే జరిగితే ఇదో అద్వితీయ రికార్డు అవుతుందని చెప్పుకొచ్చాడు. గేల్ రికార్డును బద్దలు కొడతానని తన జీవితంలో ఎప్పుడూ అనుకోలేదంటూ చెప్పుకొచ్చాడు. అలా చెబుతూ రోహిత్ తన కండల వైపు చూస్తూ నవ్వడం మొదలుపెట్టాడు.

ఆ తర్వాత హిట్‌మ్యాన్ అనే పేరు ఎందుకు వచ్చిందనే ప్రశ్నపై మాట్లాడుతూ.. ఇది ప్రజలనే అడగాలని అన్నాడు. అయితే దీనిపై మీరు ఏమనుకుంటున్నారని అడిగినప్పుడు, తాను కండలు తిరిగిన ఆటగాడిని కాదని, బంతిని బలంగా కొట్టడానికి ఇష్టపడతాడని భారత కెప్టెన్ చెప్పుకొచ్చాడు. చిన్నప్పటి నుంచి బంతిని కింద నుంచి కొట్టడం, గాలిలో షాట్లు ఆడడం నేర్చుకున్నట్లు తెలిపాడు. క్రికెట్‌కు సంబంధించిన ప్రాథమిక అంశాలు ఇవేనంటూ ముగించాడు.




