T20 World Cup: ప్రైజ్ మనీని ప్రకటించిన ఐసీసీ.. విజేతకు ఎంత అందనున్నాయో తెలుసా?
అక్టోబరు 17నుంచి మ్యాచులు మొదలు కానున్నాయి. యూఏఈ, ఒమన్ వేదికల్లో ఈ మెగా ఈవెంట్ జరగనుంది. అయితే తాజాగా ట్రోఫీ విజేతకు ఇచ్చే ప్రైజ్ మనీని ఆదివారం నాడు ఐసీసీ వెల్లడించింది.
T20 World Cup: క్రికెట్ ప్రపంచ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న టోర్నీకి సమయం ఆసన్నమైంది. వచ్చే ఆదివారం నుంచి మొదలుకాబోయే టీ20 వరల్డ్ కప్ మెగా టోర్నీకి అంతా సిద్ధమైంది. అక్టోబరు 17నుంచి మ్యాచులు మొదలు కానున్నాయి. యూఏఈ, ఒమన్ వేదికల్లో ఈ మెగా ఈవెంట్ జరగనుంది. అయితే తాజాగా ట్రోఫీ విజేతకు ఇచ్చే ప్రైజ్ మనీని ఆదివారం నాడు ఐసీసీ వెల్లడించింది. టీ20 వరల్డ్ కప్ విజేతగా నిలిచిన జట్టుకు రూ.12.02 కోట్లు, రన్నరప్‌గా నిలిచిన టీంకు రూ.6 కోట్లు అందనున్నాయి. ఇక సెమీఫైనల్లో ఓడియిన టీంలకు రూ.3 కోట్ల చొప్పున అందించనుంది. సూపర్ 12 లలో దూసుకుపోయే జట్టుకు సుమారుగా రూ .52.50 లక్షలు అందనున్నాయి. టీ20 వరల్డ్ కప్ 2021లో మొత్తం 16 జట్లు తలపడనున్న సంగతి తెలిసిందే. నవంబర్ 14 న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అయితే అందరి ఆసక్తి మాత్రం చాలాకాలం తరువాత పోటీపడుతోన్న భారత్, పాకిస్తాన్ టీంలపైనే నెలకొంది. దాయాదుల పోరు కోసం క్రికెట్ లోకం అంతా ఎదురుచూస్తోంది. ఈ మ్యాచులకు ప్రేక్షకులను కూడా అనుమతివ్వనుండడంతో స్టేడియాల్లో ప్రేక్షకుల సందడి కనిపించనుంది.
నవంబర్ 14న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ టోర్నమెంట్ కోసం ఐసీసీ 5.6 మిలియన్ల డాలర్లను కేటాయించింది. ఇందులో కొంత భాగాన్ని ప్రైజ్ మనీగా అందించనుంది. 2016 వ సంవత్సరంలోనూ సూపర్ 12 దశలో గెలిచిన ప్రతీ మ్యాచ్‌కు టీంకు బోనస్ మనీని అందించనుంది. దీనినే ఈ ఏడాకి కూడ అమలు చేస్తున్నట్లు ఐసీసీ పేర్కొంది. సూపర్ 12 దశలో పోటీపడే జట్లలో ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, ఇండియా, న్యూజిలాండ్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ ఇప్పటికే ఖరారు చేసిన సంగతి తెలిసిందే.
మొదటి రౌండ్‌లో ఓడిపోయిన జట్లకు సుమారు రూ. 30 లక్షలు అందనున్నాయి. కాగా బంగ్లాదేశ్, ఐర్లాండ్, నమీబియా, నెదర్లాండ్స్, ఒమన్, పాపువా న్యూ గినియా, స్కాట్లాండ్, శ్రీలంక జట్లు మొదటి రౌండ్‌లో పోటీపడుతున్నాయి. ఇందులో గెలిచిన నాలుగు టీంలు సూపర్ 12 లోకి అర్హత సాధిస్తాయి. అలాగే టీ20 వరల్డ్ కప్‌లో జరిగి ప్రతీ మ్యాచులో రెండు డ్రింక్స్ విరామాలు ఉంటాయి. ఇవి 2నిమిషాల 30 సెకన్ల పాటు ఉండనున్నాయి. ఇది ప్రతీ ఇన్నింగ్స్ మధ్యలో తీసుకుంటారు.
నన్ను వాళ్లు అడగలేదు.. అందుకే ఆ వీడియోలో నేను లేను: ఓ అభిమాని ప్రశ్నకు డేవిడ్ వార్నర్ సమాధానం