AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chris Gayle: నేనింకా రిటైర్మెంట్ ప్రకటించలేదు.. ఎందుకు అలా చేశానంటే..

టీ20 వరల్డ్ కప్‎లో శనివారం అబుదాబిలో ఆస్ట్రేలియాతో జరిగిన సూపర్ 12 పోరులో వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్ గార్డ్ ఆఫ్ హానర్ అందుకున్నాడు. దీంతో అతడు రిటైర్మెంట్ తీసుకున్నాడని ఊహాగానాలు వచ్చాయి. దీనిపై స్పందించిన గేల్ తానింకా రిటైర్‌ కాలేదని..

Chris Gayle: నేనింకా రిటైర్మెంట్ ప్రకటించలేదు.. ఎందుకు అలా చేశానంటే..
Gayle
Srinivas Chekkilla
|

Updated on: Nov 07, 2021 | 5:28 PM

Share

టీ20 వరల్డ్ కప్‎లో శనివారం అబుదాబిలో ఆస్ట్రేలియాతో జరిగిన సూపర్ 12 పోరులో వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్ గార్డ్ ఆఫ్ హానర్ అందుకున్నాడు. దీంతో అతడు రిటైర్మెంట్ తీసుకున్నాడని ఊహాగానాలు వచ్చాయి. దీనిపై స్పందించిన గేల్ తానింకా రిటైర్‌ కాలేదని, మరో T20 ప్రపంచ కప్ ఆడాలనుకుంటున్నాడని చెప్పాడు. స్వదేశంలో సొంత ప్రేక్షకుల సమక్షంలోనే క్రికెట్‌కు గుడ్‌బై చెబుతానని తెలిపాడు. ఈ మ్యాచ్‎లో గేల్ 9 బంతుల్లో 15 పరుగులు చేశాడు. గేల్ డ్రెస్సింగ్ రూమ్‌కి తిరిగి వెళుతున్నప్పుడు వేదిక వద్ద ఉన్న అభిమానులకు తన బ్యాట్‌ను పైకెత్తాడు. తన సంతకం చేసిన టీ-షర్టులు, గ్లౌజులను గుంపుపైకి విసిరాడు. అతను ఆరోన్ ఫించ్ & కో నుంటి గౌరవ వందనాన్ని కూడా అందుకున్నాడు.

“నేను గత ప్రపంచకప్‌ను ఆస్వాదించడానికి ప్రయత్నిస్తున్నాను. ఇది నాకు చాలా నిరాశపరిచిన ప్రపంచకప్. ఇది బహుశా నా చెత్త ప్రపంచకప్. ఇది నా కెరీర్‌లో బ్యాకెండ్‌లో రావడం విచారకరం. కానీ నేను చెప్పినట్లు, వెస్టిండీస్ క్రికెట్‌లో ఇంకా చాలా మంది గొప్ప ప్రతిభ ఆటగాళ్లు ఉన్నారు” అని గేల్ తెలిపాడు. “నేను ఎలాంటి రిటైర్‌మెంట్‌ను ప్రకటించలేదు. నా దేశ ప్రేక్షకుల ముందు జమైకాలో ఒక మ్యాచ్ గెలిచి రిటైర్మెంట్ తీసుకుంటాను. నేను మరో ప్రపంచకప్ ఆడాలనుకుంటున్నాను” అని పేర్కొన్నాడు. గేల్ 453 టీ20 మ్యాచ్‌ల్లో 36.44 సగటుతో 14,321 పరుగులు చేశాడు. 2006లో టీ20ల్లో అరంగేట్రం చేసిన గేల్ 1,899 పరుగులు, రెండు సెంచరీలు చేశాడు. అతను వెస్టిండీస్ తరఫున 103 టెస్టులు ఆడి 7214 పరుగులు చేశాడు. 301 వన్డేల్లో 10,480 పరుగులు సాధించాడు.

ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‎లో వెస్టిండీస్ 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. 158 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ 16.2 ఓవర్లలో రెండు వికెట్ల కోల్పోయి విజయం సాధించింది. ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఈ మ్యాచ్‎లో చెలరేగాడు. 56 బంతుల్లో 89(9 ఫోర్లు, 4 సిక్స్‎లు) పరుగులతో నాటౌట్‎గా నిలిచి ఒంటి చేతితో జట్టును గెలిపించాడు. అతనికి తోడు మిచెల్ మార్ష్ కూడా రాణించాడు. మార్ష్ 32 బంతుల్లో53 (5 ఫోర్లు, 2 సిక్స్‎లు ) పరుగులు చేశాడు. ఆరోన్ ఫించ్ 9 పరుగులు చేశాడు. వెస్టిండీస్ బౌలర్లలో గేల్, హోసెయిన్ ఒక్కో వికెట్ తీశారు.

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 20 ఓవర్లకు ఏడు వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసింది. చివర్లో పోలార్డ్ రసెల్ స్కోర్ బోర్డును ఉరకలెత్తించారు. పోలార్డ్ 31 బంతుల్లో44(నాలుగు ఫోర్లు, ఒక సిక్స్) పరుగులు చేసి వెనుదిగాడు. రసెల్ 7 బంతుల్లో 18(ఒక ఫోర్, రెండు సిక్స్‎లు) పరుగులు చేసిన నాటౌట్‎గా నిలిచాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో హేజిల్​వుడ్ 4 వికెట్లు తీయగా, స్టార్క్, కమ్మిన్స్, జంపా ఒక్కో వికెట్ తీశారు.

Read Also.. Ashish Nehra: ఫాస్ట్ బౌలర్ కెప్టెన్‎గా ఉండరాదని రూల్ బుక్‌లో ఎక్కడా రాయలేదు.. ఆశిశ్ నెహ్రా..