NZ vs AFG Match Result: సెమీస్ చేరిన న్యూజిలాండ్.. కోహ్లీసేనకు నిరాశే మిగిల్చిన ఆఫ్ఘనిస్తాన్..!

NZ vs AFG: న్యూజిలాండ్‌ విజయంతో భారత్‌ సెమీఫైనల్‌ ఆశలకు తెరపడింది. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ 18.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి టార్గెట్ చేరుకుని ఘన విజయం సాధించింది.

NZ vs AFG Match Result: సెమీస్ చేరిన న్యూజిలాండ్.. కోహ్లీసేనకు నిరాశే మిగిల్చిన ఆఫ్ఘనిస్తాన్..!
T20 World Cup 2021, Nz Vs Afg
Follow us
Venkata Chari

|

Updated on: Nov 07, 2021 | 6:51 PM

T20 World Cup 2021, AFG vs NZ Match Result: టీ20 ప్రపంచకప్‌లో సూపర్‌ 12 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌, ఆఫ్ఘనిస్థాన్‌ జట్లు తలపడిన సంగతి తెలిసిందే. న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్థాన్‌తో పాటు భారత్‌కు కూడా ఈ మ్యాచ్ చాలా కీలకంగా మారడంతో అంతా ఎంతో ఆసక్తిని చూపించారు. కానీ, అంచనాలు తప్పి, ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచులో న్యూజిలాండ్ జట్టు ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్‌ విజయంతో భారత్‌ సెమీఫైనల్‌ ఆశలకు తెరపడింది. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ కేవలం 18.1 ఓవర్లలో కేవలం 2 వికెట్లు కోల్పోయి టార్గెట్ చేరుకుని ఘన విజయం సాధించింది. అయితే నెట్ రనే రేట్ అవసరం లేకుండానే విలియమ్సన్ సేన సెమీఫైనల్ చేరింది. ఓపెనర్ డారిల్ మిచెల్ 17 పరుగులు చేసి ముజీబ్ బౌలింగ్‌తో పవర్ ప్లేలోపే పెవిలియన్ చేరాడు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన విలియమ్సన్‌తో కలిసి మార్టిన్ గప్టిల్ న్యూజిలాండ్‌ను విజయతీరాలకు చేర్చేందుకు సహాయపడ్డాడు. అయితే గప్టిల్ 28 పరుగులకు ఔటయ్యాక, క్రీజులోకి వచ్చిన డేవాన్ కాన్వే(36), విలియమ్సన్(40) మిగతా పని పూర్తి చేశారు. దీంతో రేపు జరగనున్న భారత్ వర్సెస్ నమీబియా మ్యాచ్‌కు ఏమాత్రం ఆసక్తి లేకుండా పోయింది. ఇక చివరి మ్యాచులో విజయం సాధించి టోర్నీ నుంచి నిష్క్రమించాలని కోహ్లీసేన భావిస్తోంది.

అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆఫ్ఘనిస్తాన్ ఏ మాత్రం కలిసి రాలేదు. వరుసగా వికెట్లు కోల్పోతూ కష్టాల్లో మునిగిపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 8వికెట్లు కోల్పోయి కేవలం 124 పరుగులు చేసింది. ఇందులో నజీబుల్లా జద్రాన్ 73 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగతా బ్యాట్స్‌మెన్స్‌లో కేవలం ఇద్దరే రెండెంకల స్కోర్ దాటారు. మిగతా బ్యాట్స్‌మెన్స్ అంతా కేవలం సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. హజ్రతుల్లా జజాయ్ 2, మహ్మద్ షాజాద్ 4, గుర్బాజ్ 6, గుల్బాదిన్ 15, నబీ 14, కరీం జనత్ 2, రషీద్ ఖాన్ 3 పరుగులకే పరిమితమయ్యారు. ముజీబ్ 0 నాటౌట్‌‌గా నిలిచాడు. ఇక న్యూజిలాండ్ బౌలర్లలో టిమ్ సౌతీ 2, ట్రెంట్ బౌల్ట్ 3, మిల్నే, నీషమ్, సోధి తలో వికెట్ పడగొట్టారు.

మార్టిన్ గప్టిల్ వికెట్‌తో ఆఫ్ఘనిస్తాన్ స్టార్ బౌలర్ రషీద్ ఖాన్ టీ20ల్లో 40 వికెట్ల క్లబ్‌లో చేరాడు. 553 డ్వేన్ బ్రావో 425 సునీల్ నరైన్ 420 ఇమ్రాన్ తాహిర్ 400 రషీద్ ఖాన్ 398 షకీబ్ అల్ హసన్ రషీద్ టీ20 అరంగేట్రం చేసినప్పటి నుంచి మరే ఇతర బౌలర్ కూడా ఈ ఫార్మాట్‌లో 300 వికెట్లు కూడా తీయలేదు.

సెమీస్ చేరిన టీంలు: సూపర్ 12లో మ్యాచులు ముగిసినట్లే. దీంతో సెమీస్‌లో తలపడే జట్లేవే తెలిసిపోయింది. గ్రూప్ 1 నుంచి ఇంగ్లండ్, ఆస్ట్రేలియా సెమీస్ చేరగా, ఇక గ్రూపు 2 నుంచి న్యూజిలాండ్, పాకిస్తాన్ టీంలు సెమీస్ పోరులో నిలిచాయి.

న్యూజిలాండ్ (ప్లేయింగ్ XI): మార్టిన్ గప్టిల్, డారిల్ మిచెల్, కేన్ విలియమ్సన్(కెప్టెన్), డెవాన్ కాన్వే(కీపర్), గ్లెన్ ఫిలిప్స్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్, ఆడమ్ మిల్నే, టిమ్ సౌతీ, ఇష్ సోధి, ట్రెంట్ బౌల్ట్

ఆఫ్ఘనిస్తాన్ (ప్లేయింగ్ XI): హజ్రతుల్లా జజాయ్, మహ్మద్ షాజాద్(w), రహ్మానుల్లా గుర్బాజ్, నజీబుల్లా జద్రాన్, గుల్బాదిన్ నాయబ్, మహ్మద్ నబీ(సి), కరీం జనత్, రషీద్ ఖాన్, నవీన్-ఉల్-హక్, హమీద్ హసన్, ముజీబ్ ఉర్ రహ్మాన్

Also Read: Chris Gayle: నేనింకా రిటైర్మెంట్ ప్రకటించలేదు.. ఎందుకు అలా చేశానంటే..

T20 World Cup 2021: 2007 నుంచి 2016 వరకు ఒక్కటే.. టీ20 ప్రపంచకప్‌ 2021లో మాత్రం మూడు.. ఆ ‘హ్యాట్రిక్’ బౌలర్లు ఎవరో తెలుసా?