Hyderabad Sunrisers: సన్‎రైజర్స్ హైదరాబాద్ కథ ముగిసినట్టేనా..!

ఐపీఎల్-2021లో సన్‎రైజర్స్ హైదరాబాద్.. పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. ఈ సిజన్‎లో హైదరాబాద్ జట్టు పూర్తిగా విఫలమవుతోంది.

Hyderabad Sunrisers: సన్‎రైజర్స్ హైదరాబాద్ కథ ముగిసినట్టేనా..!
Hyderabad Sunrisers
Follow us

|

Updated on: Sep 26, 2021 | 4:55 PM

ఐపీఎల్-2021లో సన్‎రైజర్స్ హైదరాబాద్.. పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. ఈ సిజన్‎లో హైదరాబాద్ జట్టు పూర్తిగా విఫలమవుతోంది. ఐపీఎల్-2021 రెండో దశలో ఆడిన రెండు మ్యాచ్‎ల్లో ఓడిపోయింది. నిన్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్‎తో జరిగిన మ్యాచ్‎లో హైదరాబాద్ ఓటమిపాలయింది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‎కు దిగిన హైదరాబాద్ 20 ఓవర్లకు ఏడు వికెట్ల నష్టానికి 120 పరుగులు చేసింది. దీంతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. సెప్టెంబర్ 22న ఢిల్లీ క్యాపిటల్స్‎తో జరిగిన మ్యాచ్‎లో 8 వికెట్ల తేడాతో హైదరాబాద్ ఓడిపోయింది. ఆ మ్యాచ్‎లో మొదటగా బ్యాటింగ్ చేసిన సన్‎రైజర్స్ 134 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‎కు దిగిన ఢిల్లీ 17. 5 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేధించింది.

ఐపీఎల్-2021 మొదటి దశలో ఏడు మ్యాచ్‎లు ఆడిన హైదరాబాద్ ఒక్క మ్యాచ్‎లోనే విజయం సాధించింది. గత ఏప్రిల్ 21న కింగ్స్ ఎలెవన్ పంజాబ్‎తో జరిగిన మ్యాచ్‎లో సన్‎రైజర్స్ తొమ్మిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదటగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ 19.4 ఓవర్లలో అలౌటై 120 పరుగులు చేసింది. తర్వాత బ్యాంటింగ్‎కు దిగిన హైదరాబాద్ 18.5 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని ఛేధించింది. మొత్తంగా తొమ్మిది మ్యాచ్‎లు ఆడిన సన్‎రైజర్స్ కేవలం ఒకే ఒక మ్యాచ్‎ విజయం సాధించింది. హైదరాబాద్ జట్టుకు మొదటి నుంచి బౌలర్లే బలం.. అందుకే ప్రత్యర్థులను తక్కువ పరుగులకు అలౌట్ చేస్తుంది. కానీ లక్ష్యాఛేధనలో మాత్రం సన్‎రైజర్స్ తడబడుతోంది. హిట్టర్స్ లేక హైదరాబాద్ ఇబ్బంది పడుతోంది. మొదటి దశలో అందుబాటులో ఉన్న బెయిర్‎స్టో రెండో దశలో అందుబాటులో లేకపోవటంతో సన్‎రైజర్స్‎కు నష్టం కలిగించే అంశమే. మొత్తానికైతే ఐపీఎల్-2021లో సన్‎రైజర్స్ కథ దాదాపు ముగిసినట్టేనని క్రీడానిపుణులు చెబుతున్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి: Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు మద్దతుగా మరో యంగ్ హీరో ట్వీట్.. ఇది తన బాధ్యత అన్న యాక్టర్

Hyderabad City Police: హైదరాబాద్ పోలీసుల అదిరిపోయే మీమ్.. చూస్తే వావ్ అనాల్సిందే..

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ