AUSW vs INDW: ఆస్ట్రేలియా వరుస విజయాలకు బ్రేకులు వేసిన భారత్.. చివరి వన్డేలో ఘన విజయం
వన్డే సిరీస్‌లో చివరి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భారత్ 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మూడు వన్డేల సిరీస్‌లో మాత్రం 1-2 తేడాతో కోల్పోయింది.
AUSW vs INDW: ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన భారత మహిళా క్రికెట్ జట్టు వన్డే సిరీస్‌ను విజయంతో ముగించింది. అయితే 1-2 ఓడిపోయింది. దీంతో 3 వన్డేల సిరీస్‌ను దక్కించుకోలేక పోయింది. సీరిస్ ఓడినా.. ఓ గొప్ప పని చేసింది. గత 26 వన్డేల నుంచి ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టు విజయ పరంపరను బద్దలు కొట్టింది. ఆస్ట్రేలియా జట్టు వాళ్ల దేశంలో చివరి వన్డేలో ఓడించింది. అయితే రాబోయే టీ20, టెస్టు సిరీస్‌లో భారత ఆటగాళ్లు విశ్వాసం పెంచుకోవాల్సి ఉంటుంది.
వన్డే సిరీస్‌లో మొదటి రెండు మ్యాచ్‌లు ఓడిపోయిన భారత జట్టు, మూడో వన్డేలో మొదట బౌలింగ్ చేసింది. ముందుగా ఆడిన ఆతిథ్య జట్టు 9 వికెట్లకు 264 పరుగులు చేసింది. భారత్ విజయానికి 265 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా పేలవంగా ఆరంభించింది. వెటరన్ ఫాస్ట్ బౌలర్ జూలన్ గోస్వామి.. రస్సెల్, లెన్నింగ్ వికెట్లను ముందుగానే పడగొట్టింది. 100 పరుగుల వ్యవధిలో, అలిస్సా హీలీ, ఎల్లిస్ పెర్రీ వంటి బ్యాట్స్‌మెన్ల వికెట్లను కోల్పోవడంతో ఆసీస్ కష్టాల్లో పడింది. అనంతరం మునే, గార్డనర్ కలిసి ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ను చక్కదిద్దేందుకు ప్రయత్నించారు. అయితే వీరిన స్నేహ్ రానా విడదీసింది. 52 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మునేను బౌల్డ చేసింది. ఆ తరువాత గార్డనర్ కూడా 67 పరుగుల వద్ద పూజా బాధితురాలిగా మారింది. లోయర్ ఆర్డర్‌లో మెక్‌గ్రాత్ 32 బంతుల్లో 47 పరుగులు చేసింది. జులన్ గోస్వామి భారత్ తరపున అత్యంత పొదుపై బౌలర్‌గా మారింది.
చివరి వన్డేలో భారత్ 2 వికెట్ల తేడాతో విజయం.. స్మృతి మంధాన త్వరగా ఔటైనా.. ఆరంభ వికెట్‌కు భాగస్వామ్యం 50 పరుగులు దాటింది. ఆమె తర్వాత వచ్చిన యస్తికా భాటియా, షెఫాలీతో మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. ఇద్దరి మధ్య రెండో వికెట్‌కు 101 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఇది భారత విజయాన్ని మరింత దగ్గర చేసింది. 56 పరుగులు చేసిన షెఫాలీ ఔట్ కావడంతో ఈ భాగస్వామ్యం విడిపోయింది. ఆ తరువాత యాస్తికా భాటియా 69 బంతుల్లో 64 పరుగులు చేసింది. అనంతరం దీప్తి శర్మ, స్నేహ్ రానా కలిసి భారత్‌ను విజయ తీరాలకు చేర్చారు. దీప్తి 30 బంతుల్లో 31 పరుగులు చేయగా, స్నేహ్ రాణా 27 బంతుల్లో 30 పరుగులు చేసింది.
భారత్ విజయానికి చివరి 4 బంతుల్లో 3 పరుగులు కావాలి. ఆ సమయంలో జులన్ గోస్వామి ఒక ఫోర్ కొట్టడంతో 3 బంతులు మిగిలి ఉండగానే 2 వికెట్ల తేడాతో గెలిచింది. 3 వికెట్లు తీసిన జులన్ గోస్వామి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచింది.
Also Read: CSK vs KKR Live Score, IPL 2021: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోల్‌కతా నైట్‌రైడర్స్
IPL 2021: తొలి ఆరు ఓవర్లలో ఒక్క బౌండరీ కూడా కొట్టని రాజస్తాన్ రాయల్స్