Hyderabad City Police: హైదరాబాద్ పోలీసుల అదిరిపోయే మీమ్.. చూస్తే వావ్ అనాల్సిందే..

ఈ రోజుల్లో యువతకు మంచి చెబితే పట్టించుకోవడం మానేశారు. ఇలానే చెబుతారని లైట్ తీసుకుంటున్నారు. ముఖ్యంగా పోలీసులు చెబితే ఏ మాత్రం పట్టించుకోవడం లేదు.

Hyderabad City Police: హైదరాబాద్ పోలీసుల అదిరిపోయే మీమ్.. చూస్తే వావ్ అనాల్సిందే..
Meme On Cyber Crimes
Follow us
Phani CH

|

Updated on: Sep 26, 2021 | 4:52 PM

ఈ రోజుల్లో యువతకు మంచి చెబితే పట్టించుకోవడం మానేశారు. ఇలానే చెబుతారని లైట్ తీసుకుంటున్నారు. ముఖ్యంగా పోలీసులు చెబితే ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ఇలా చెబితే వినడంలేదని భావించిన పోలీసులు కొత్తగా ట్రై చేశారు. అవగాహన కల్పించడంలో తెలంగాణ పోలీసుల రూటే సపరేటు అంటూ చేసి చూపిస్తున్నారు. సోషల్ మీడియాలో దూసుకెళ్లే విధంగా పోస్ట్ చేస్తున్నారు. సుత్తి లేకుండా సూటిగా.. ట్రెండీగా.. క్యాచీగా.. టీజింగ్‎గా​ ఉంటూనే.. వాళ్లు చెప్పాలనుకున్న విషయాన్ని స్పష్టంగా చెప్పడానికి.. నేటి తరం యువతకు సందేశాన్ని ఇవ్వడానికి ట్విటర్‎​ను వినియోగిస్తున్నారు. యువతను ఆకట్టుకునేలా.. వారికి అర్థమయ్యేలా మీమ్స్ పోస్టు చేస్తూ విషయమేంటో చెప్పేస్తున్నారు. ఇప్పటికే ఇలా చాలా మీమ్స్‎తో ప్రజల్లో ట్రాఫిక్​, ఇతర విషయాలపై అవగాహన కల్పించారు.

గత కొద్ది రోజులుగా సోషల్‌ మీడియా జపం చేస్తున్న పదం ‘‘సుఖీభవ.. సుఖీభవ.’’ ఏ మీమ్‌ చూసినా ఇదే మాట అందరి నోట వినిపిస్తుంది. ఓ ‘టీ’ యాడ్‌లో బామ్మ ఒకరికి టీ ఇచ్చినందుకు గానూ ఆశీర్వదిస్తూ చెప్పే మాటే ‘సుఖీభవ’. కట్‌ చేస్తే ఆ టీ పొడి యాడ్‌ను రీక్రీయేట్‌ చేశారు. గణేశ్‌ నిమజ్జనం రోజు ‘‘అయ్యోయ్యో.. వద్దమ్మా సుఖీభవ! సుఖీభవ!’’ అంటూ చిందులేయడం కాస్తా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అప్పటి నుంచి దీని మీద లెక్కలేనన్ని మీమ్స్‌, వీడియోస్‌ పుట్టుకొచ్చాయి. ఇదీ ప్రజల్లోకి బాగా వెళ్తుందని గమనించిన హైదరాబాద్ సిటీ పోలీసులు అదిరిపోయే మీమ్స్ తయారు చేశారు. సైబర్‌ మోసాలకు పాల్పడే వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలని సుఖీభవ స్టైల్‌లో హెచ్చరిస్తూ ఓ మీమ్‌ను ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం ఇది నెట్టింట్‌ వైరల్‌గా మారింది. ఎలాంటి అనుమానాస్పద లింక్‌లను క్లిక్‌ చేయొద్దని తెలంగాణ పోలీస్‌- సైబర్‌ క్రైమ్‌ అవగాహన కల్పిస్తూ సాధారణంగా ట్వీట్‌ చేసినప్పటికీ ఇదే విషయాన్ని హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ టీమ్‌ ‘సుఖీభవ’తో వైరల్‌ అయ్యేలా చేసింది.

మరిన్ని ఇక్కడ చూడండి: Telangana Weather: రేపు, ఎల్లుండి తెలంగాణలో భారీ వర్షాలు.. రెడ్ అలెర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ..

Liger: పూరి జగన్నాథ్ పుట్టిన రోజు నాడు లైగర్ నుంచి బిగ్ అప్‎డేట్

మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?