Hyderabad City Police: ఇలా కూడా వాడొచ్చా? రోహిత్‌, డీకే ఫొటోలతో హైదరాబాద్‌ పోలీసుల వైరల్‌ ట్వీట్‌

|

Sep 27, 2022 | 2:53 PM

Hyderabad City Police: రోడ్డు ప్రమాదాలను అరికట్టడం, ట్రాఫిక్‌ నిబంధనలు, సైబర్‌ నేరాలు.. ఇలా పలు అంశాలపై ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు హైదరాబాద్‌ పోలీసులు. సోషల్‌ మీడియా ద్వారా సలహాలు, సూచనలు ఇస్తూ నగరవాసుల్లో చైతన్యం నింపుతున్నారు.

Hyderabad City Police: ఇలా కూడా వాడొచ్చా? రోహిత్‌, డీకే ఫొటోలతో హైదరాబాద్‌ పోలీసుల వైరల్‌ ట్వీట్‌
Rohit Sharma Dinesh Karthi
Follow us on

IND vs AUS: రోడ్డు ప్రమాదాలను అరికట్టడం, ట్రాఫిక్‌ నిబంధనలు, సైబర్‌ నేరాలు.. ఇలా పలు అంశాలపై ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు హైదరాబాద్‌ పోలీసులు. సోషల్‌ మీడియా ద్వారా సలహాలు, సూచనలు ఇస్తూ నగరవాసుల్లో చైతన్యం నింపుతున్నారు. ప్రజలకు సులభంగా, మరింత సృజనాత్మకంగా అర్థమవ్వడానికి వీలుగా సినిమా డైలాగులు, పాటలు, పోస్టర్లు, ఫొటోలు, వీడియోల సహాయంతో మీమ్స్‌ ఉపయోగిస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌ సిటీ పోలీసులు క్రికెటర్ల ఫొటోలను కూడా వాడుకున్నారు. ట్రాఫిక్‌ నియమాలపై అవగాహన కల్పించేందుకు ఓ ట్రెండింగ్‌ పోస్ట్‌తో మన ముందుకు వచ్చారు. అదేంటంటే.. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 మ్యాచ్‌ సందర్భంగా టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, ఫినిషర్‌ దినేష్‌ కార్తీక్‌ మధ్య కొన్ని సరదా సంఘటనలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు వీరిద్దరి ఫొటోలనే హైదరాబాద్‌ సిటీ పోలీసులు సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ప్రయాణాల్లో హెల్మెట్‌ ధరించాల్సిన ప్రాముఖ్యతపై క్రియేటివిటీగా అవగాహన కల్పించారు.

కాగా టీమిండియా, ఆసీస్ మధ్య మొహాలి వేదికగా జరిగిన మ్యాచ్‌లో రోహిత్‌ మైదానంలో కార్తీక్‌పై కాస్త ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా స్టీవ్ స్మిత్ ఔట్‌కు సంబంధించి డీకేకు వ్యవహరించిన తీరు చర్చనీయాంశమైంది. అదేంటంటే..ఉమేశ్ యాదవ్ బౌలింగ్ లో స్మిత్ క్యాచ్ ను అందుకున్న కార్తీక్.. ఔట్‌ కోసం అప్పీల్ చేయలేదు. అదే సమయంలో ఉమేశ్ తో పాటు రోహిత్, ఇతర ఆటగాళ్లు దానిని ఔట్ కోసం అప్పీల్ చేశారు. అంపైర్ ఔట్‌ ఇవ్వకపోవడంతో రోహిత్ దానిపై రివ్యూ కోరాడు. రివ్యూలో బంతి.. స్మిత్ బ్యాట్ ను ముద్దాడుతూ వెళ్లి డీకే చేతుల్లో పడింది. కాగా.. రివ్యూ కోరే సమయంలో రోహిత్ కార్తీక్ దగ్గరికెళ్లి ‘నువ్వెందుకు అప్పీల్ చేయలేదు’ అన్నంత కోపంతో అతని ముఖాన్ని పట్టుకుని నలిపేసే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత రివ్యూలో ఔట్‌ అని తేలాక కార్తీక్ హెల్మెట్ పై ముద్దు పెట్టాడు. ఈ రెండు ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. హైదరాబాద్‌ సిటీ పోలీసులు కూడా ఈ రెండు ఫొటోలను జత చేస్తూ ఓ సరదా మీమ్స్ రూపొందించారు. మొదటి ఫోటోలో రోహిత్.. కార్తీక్ ముఖాన్ని నలిపేసేదాన్ని పెట్టి ‘హెల్మెట్ పెట్టుకోనప్పుడు..’ అని, రెండో ఫోటోలో ‘హెల్మెట్ పెట్టుకున్నప్పుడు’ అని రాసి ఉన్న మీమ్ ను హైదరాబాద్ సిటీ పోలీస్ ట్విటర్ ఖాతాలో పోస్టు చేశారు. ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ప్రయాణికులు హెల్మెట్‌ ధరిస్తే ఎలా ఉంటుందో, పాటించకుంటే ఎలా ఉంటుందో ఈ ఫొటోల ద్వారా సృజనాత్మకంగా వివరించారు. హెల్మెట్‌ ధరించకుంటే ప్రాణాలకు ప్రమాదమని, అదే హెల్మెట్‌ ధరిస్తే అందరూ ఆనందంగా ఉండవచ్చనే అనే కోణంలో ఈ పోస్ట్‌ షేర్‌ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..