IPL 2023: వరల్డ్‌కప్‌లో తుస్సుమనిపించాడు.. కట్ చేస్తే.. 7 బంతుల్లో 40 పరుగులు బాదేశాడు.. ఎవరంటే?
దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లో దేశీయ ఆటగాళ్లు దుమ్ములేపుతున్నారు. ఐపీఎల్ వేలంలో సన్‌రైజర్స్ కొనుగోలు చేసిన..
దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లో దేశీయ ఆటగాళ్లు దుమ్ములేపుతున్నారు. ఐపీఎల్ వేలంలో సన్‌రైజర్స్ కొనుగోలు చేసిన హెన్రిచ్ క్లాసన్ తాజాగా జరిగిన పార్ల్ రాయల్స్ మ్యాచ్‌లో తుఫాన్ ఇన్నింగ్స్‌తో చెలరేగిపోయాడు. అతడి బ్యాటింగ్‌కు డర్బన్ సూపర్ జెయింట్స్ నిర్ణీత ఓవర్లకు భారీ స్కోర్ నమోదు చేసింది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన డర్బన్ జెయింట్స్ జట్టుకు ఓపెనర్లు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. మేయర్స్(39), ముల్దర్(42) పవర్ ప్లే ముగిసేసరికి 62 పరుగులు జోడించారు. మేయర్స్ తొలి వికెట్ రూపంలో పెవిలియన్ చేరినప్పటికీ.. డికాక్(57)తో కలిసి ముల్దర్ స్కోర్‌బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలోనే డికాక్ తన అర్ధ సెంచరీని 31 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో పూర్తి చేశాడు. అయితే ఆ తర్వాత బరిలోకి దిగిన హెన్రిచ్ క్లాసన్(50) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.
19 బంతుల్లో 1 ఫోర్, 6 సిక్సర్లతో ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కట్ చేస్తే.. డర్బన్ సూపర్ జెయింట్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లకు 4 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. కాగా, హెన్రిచ్ క్లాసన్ ఇన్నింగ్స్‌ను సన్‌రైజర్స్ ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేశారు. ఐపీఎల్ 2023లో ఇదే ఆటతీరు కొనసాగించాలని కామెంట్స్ రూపంలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.