AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SL: వన్డేల్లో భారత్‌ సరికొత్త రికార్డు.. ఆఖరి మ్యాచ్‌లో తేలిపోయిన లంకేయులు.. సిరీస్‌ క్లీన్‌స్వీప్‌

విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్ సెంచరీలకు తోడు మహ్మద్ సిరాజ్ నిప్పులు చెరగడంతో లంకతో ఆదివారం జరిగిన మూడో వన్డేలో భారత జట్టు ఘన విజయం సాధించింది. ఆల్‌రౌండ్‌ ఫెర్మామెన్స్‌తో అదరగొట్టి ఏకంగా 317 పరుగుల తేడాతో రికార్డు విజయం సాధించింది.

IND vs SL: వన్డేల్లో భారత్‌ సరికొత్త రికార్డు.. ఆఖరి మ్యాచ్‌లో తేలిపోయిన లంకేయులు.. సిరీస్‌ క్లీన్‌స్వీప్‌
Team India
Basha Shek
|

Updated on: Jan 15, 2023 | 8:19 PM

Share

విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్ సెంచరీలకు తోడు మహ్మద్ సిరాజ్ నిప్పులు చెరగడంతో లంకతో ఆదివారం జరిగిన మూడో వన్డేలో భారత జట్టు ఘన విజయం సాధించింది. ఆల్‌రౌండ్‌ ఫెర్మామెన్స్‌తో అదరగొట్టి ఏకంగా 317 పరుగుల తేడాతో రికార్డు విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా 3-0తో కైవసం చేసుకుంది. అంతకుముందు టీ20 సిరీస్‌ను కూడా భారత జట్టు కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. తిరువనంతపురం వేదికగా జరిగిన ఆఖరి మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ ఐదు వికెట్ల నష్టానికి 390 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (166) తో పాటు ఓపెనర్‌ శుభ్‌మాన్‌ గిల్‌ (116) సెంచరీలతో చెలరేగాడు. భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన లంకేయులకు హైదరాబాదీ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ చుక్కలు చూపించాడు. నిప్పులు చెరిగే బంతులతో వరుస వికెట్లు తీశాడు. మొత్తం 6 వికెట్లు నేలకూల్చిన సిరాజ్‌ లంకను 73 పరుగులకే కుప్పకూల్చడంలో కీలక పాత్ర పోషించాడు. కాగా వన్డే చరిత్రలో పరుగుల పరంగా భారత జట్టు కు ఇదే అతిపెద్ద విజయం. కాగా ఈ సిరీస్ లో రెండు సెంచరీలతో రాణించిన విరాట్ కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ తో పాటు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ పురస్కారాలు లభించాయి.

నిప్పులు చెరిగిన సిరాజ్..

391 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన లంకేయులు ఆరంభం నుంచే ఒత్తిడికి లోనయ్యారు. సిరాజ్‌ ధాటికి వరుసగా పెవిలియన్‌కు చేరుకున్నారు. రెండో ఓవర్ ఐదో బంతికి అవిష్క ఫెర్నాండో (1)ను పెవిలియన్ పంపిన సిరాజ్‌ ఆతర్వాత కుసాల్ మెండిస్ (4)ని కూడా ఔట్‌ చేశాడు. చరిత అసలంక (1)ను ఔట్ చేయడం ద్వారా మహ్మద్ షమీ భారత్‌కు మూడో వికెట్‌ను అందజేశాడు. ఆతర్వాత నువానిందు ఫెర్నాండో (19), హసరంగా(1), చమిక కరుణరత్నే ఔట్‌ చేసి లంకను కోలుకోలేని దెబ్బ తీశాడు. ఆతర్వాత కుల్దీప్‌ యాదవ్‌ శ్రీలంక కెప్టెన్ దసున్ షనకను పెవిలియన్ పంపాడు. జెఫ్రీ వాండర్సే స్థానంలో కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన దునిత్ వెలలేగా షమీ బంతికి బలయ్యాడు. ఆతర్వాత కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో లహిరు కుమార (9)ను ఔట్ చేయగా,గాయంతో అసేన్ బండార బ్యాటింగ్‌కు బయటకు రాలేదు. దీంతో 22 ఓవర్లలో 73 పరుగులకే ఆలౌటైంది పర్యాటక జట్టు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..