Hardik Pandya: కేంద్రమంత్రి అమిత్‌షాను కలిసిన స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా.. జైషా కూడా..

ముంబై ఇండియన్స్‌కు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత హార్దిక్ పాండ్యా ఇలాంటి ఈవెంట్‌లో కనిపించడం ఇదే తొలిసారి.గాయం నుంచి కోలుకుంటోన్న హార్దిక్ పాండ్యా IPL 2024లో రీ ఎంట్రీ ఇవ్వనున్నాడని తెలుస్తోంది. ఇందుకోసం నెట్స్‌లో కఠోరంగా ప్రాక్టీస్‌ చేస్తున్నాడు. దీనికి సంబంధించిన విజువల్స్, ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.

Hardik Pandya: కేంద్రమంత్రి అమిత్‌షాను కలిసిన స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా.. జైషా కూడా..
Hardik Pandya, Amitshah
Follow us

|

Updated on: Feb 13, 2024 | 12:24 PM

గాయం నుంచి కోలుకుంటున్న హార్దిక్ పాండ్యా కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. అమిత్ షా కుమారుడు, బీసీసీఐ కార్యదర్శి జై షా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ ముగ్గురూ కలిసి గాంధీనగర్ లోక్‌సభ ప్రీమియర్ లీగ్ అంటే GLPLను ప్రారంభించారు. ప్రధాని నరేంద్ర మోదీ మార్గదర్శకత్వంలో దేశవ్యాప్తంగా ‘పార్లమెంటేరియన్ స్పోర్ట్స్ కాంపిటీషన్’ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే గాంధీనగర్ లోక్‌సభ ప్రీమియర్ లీగ్ అంటే GLPL కూడా ప్రారంభం కానుంది. ఈ టోర్నమెంట్ 7 అసెంబ్లీ సెగ్మెంట్ల మధ్య జరుగుతుంది. ప్రభుత్వం నిర్వహిస్తోన్న ఈ మెగా టోర్నీకి హార్దిక్ పాండ్యా మద్దతు తెలిపారు. ముంబై ఇండియన్స్‌కు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత హార్దిక్ పాండ్యా ఇలాంటి ఈవెంట్‌లో కనిపించడం ఇదే తొలిసారి.గాయం నుంచి కోలుకుంటోన్న హార్దిక్ పాండ్యా IPL 2024లో రీ ఎంట్రీ ఇవ్వనున్నాడని తెలుస్తోంది. ఇందుకోసం నెట్స్‌లో కఠోరంగా ప్రాక్టీస్‌ చేస్తున్నాడు. దీనికి సంబంధించిన విజువల్స్, ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

2023 ప్రపంచకప్ సందర్భంగా హార్దిక్ పాండ్యా గాయపడ్డాడు. అప్పటి నుంచి టీమిండియాకు దూరంగా ఉన్నాడు. పుణెలో బంగ్లాదేశ్‌తో జరిగిన ప్రపంచకప్ మ్యాచ్‌లో అతను గాయపడ్డాడు. అప్పటి నుంచి తిరిగి జట్టులోకి రావడం సాధ్యం కాలేదు. అయితే, ప్రతిదీ అనుకున్నట్లుగానే కొనసాగితే, పాండ్యా త్వరలో IPL 2024లో ఆడటం కనిపిస్తుంది. హార్దిక్ పాండ్యా అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటి వరకు 86 వన్డేలు, 92 టీ20లు, 11 టెస్టులు ఆడాడు, ఐపీఎల్‌లో 123 మ్యాచ్‌లు ఆడాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 3500 కంటే ఎక్కువ పరుగులు, 150 ప్లస్ వికెట్లు ఉన్నాయి. ఐపీఎల్‌లో 2309 పరుగులు చేయడమే కాకుండా ఇప్పటి వరకు 53 వికెట్లు తీశాడు.

జీపీఎల్ ప్రారంభోత్సవంలో అమిత్ షా, హార్దిక్, జైషా..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్