AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hardik Pandya : కోహ్లీ రికార్డు సమం చేసిన హార్దిక్.. టీ20 వరల్డ్ కప్‌లో పాండ్యా సరికొత్త చరిత్ర

Hardik Pandya : టీ20 ప్రపంచకప్ 2026లో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ప్రకంపనలు సృష్టిస్తున్నాడు. నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో అటు బ్యాట్‌తో, ఇటు బంతితో విశ్వరూపం చూపించిన హార్దిక్.. ఏకంగా టీమిండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ పదేళ్ల నాటి అరుదైన రికార్డును సమం చేశాడు.

Hardik Pandya : కోహ్లీ రికార్డు సమం చేసిన హార్దిక్.. టీ20 వరల్డ్ కప్‌లో పాండ్యా సరికొత్త చరిత్ర
Hardik Pandya Virat Kohli
Rakesh
|

Updated on: Feb 13, 2026 | 6:23 AM

Share

Hardik Pandya : టీ20 ప్రపంచకప్ 2026లో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ప్రకంపనలు సృష్టిస్తున్నాడు. నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో అటు బ్యాట్‌తో, ఇటు బంతితో విశ్వరూపం చూపించిన హార్దిక్.. ఏకంగా టీమిండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ పదేళ్ల నాటి అరుదైన రికార్డును సమం చేశాడు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన ఈ పోరులో హార్దిక్ వన్‌మ్యాన్ షోతో నమీబియాను చిత్తు చేశాడు. అమెరికాతో జరిగిన మొదటి మ్యాచ్‌లో కేవలం 5 పరుగులకే అవుట్ అయి నిరాశపరిచిన హార్దిక్ పాండ్యా, రెండో మ్యాచ్‌లో తన అసలు సిసలు ఆల్‌రౌండ్ సత్తా ఏంటో చూపించాడు. మొదట బ్యాటింగ్ లో దిగిన హార్దిక్, కేవలం 28 బంతుల్లో 52 పరుగులు చేసి స్టేడియాన్ని హోరెత్తించాడు. ఇందులో 4 భారీ సిక్సర్లు, 4 ఫోర్లు ఉన్నాయి. అనంతరం బౌలింగ్ లోనూ తన పదునైన బంతులతో నమీబియా బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. తన కోటా చివరి ఓవర్లో వరుసగా రెండు వికెట్లు తీసి ప్రత్యర్థిని కుప్పకూల్చాడు. మొత్తం 21 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.

ఈ అద్భుత ప్రదర్శనతో హార్దిక్ పాండ్యా ఒక అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఒకే మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ (50+), కనీసం ఒక వికెట్ తీసిన ఘనతను రెండుసార్లు సాధించిన రెండో భారతీయుడిగా హార్దిక్ నిలిచాడు. ఇంతకుముందు ఈ రికార్డు కేవలం విరాట్ కోహ్లీ పేరిట మాత్రమే ఉండేది. విరాట్ 2012లో పాకిస్థాన్‌పై (78 పరుగులు, 1 వికెట్), 2016లో వెస్టిండీస్‌పై (89 పరుగులు, 1 వికెట్) ఈ ఘనత సాధించాడు. హార్దిక్ 2024లో బంగ్లాదేశ్‌పై (50 పరుగులు, 1 వికెట్), ఇప్పుడు 2026లో నమీబియాపై (52 పరుగులు, 2 వికెట్లు) ఈ ఘనతను సమం చేశాడు.

సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో బరిలోకి దిగిన భారత జట్టుకు హార్దిక్ ఫామ్ లోకి రావడం పెద్ద ఊరటనిస్తోంది. గత ప్రపంచకప్‌లో భారత్ విజేతగా నిలవడంలో హార్దిక్ పాత్ర కీలకం. ఇప్పుడు మరోసారి డిఫెండింగ్ ఛాంపియన్‌గా టైటిల్‌ను నిలబెట్టుకోవాలంటే హార్దిక్ ఆల్‌రౌండ్ షో జట్టుకు చాలా అవసరం. ఈ విజయంతో సూపర్-8లో భారత్ స్థానం దాదాపు ఖాయమైపోయింది. గ్రూప్-ఏ లో టాపర్‌గా నిలిచిన టీమిండియా, తన తదుపరి పోరులో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను ఢీకొనేందుకు సిద్ధమవుతోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..
ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్
పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్
గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!
గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో
శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!
శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!
గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..
గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..
ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి
ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి
సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో
సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో
14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు
14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు