విడాకులకే సిద్ధమయ్యారు.. వారిద్దరి మధ్య జరిగింది ఇదే: హార్దిక్, నటాషాల క్లోజ్ ఫ్రెండ్ కీలక వ్యాఖ్యలు..

Hardik Pandya and Natasa Stankovic Divorce Rumours Big Update: గత కొన్ని రోజులుగా హార్దిక్, నటాషా మధ్య విడాకుల పుకార్లు తెగ వినిపిస్తున్నాయి. ఇటీవల హార్దిక్ పాండ్యా అద్భుత ప్రదర్శన చేసి టీ20 ప్రపంచకప్‌ను భారత్‌కు అందించినప్పుడు, నటాషా స్టాంకోవిచ్ దానిపై స్పందించలేదు. ఆమె సోషల్ మీడియాలో ఎలాంటి పోస్ట్‌ను పంచుకోలేదు లేదా టి 20 ప్రపంచ కప్ కోసం వెస్టిండీస్ లేదా యుఎస్‌ఎకు ఆమె వెళ్లలేదు.

విడాకులకే సిద్ధమయ్యారు.. వారిద్దరి మధ్య జరిగింది ఇదే: హార్దిక్, నటాషాల క్లోజ్ ఫ్రెండ్ కీలక వ్యాఖ్యలు..
Hardik Pandya And Natasa Stankovic Divorce
Follow us

|

Updated on: Jul 09, 2024 | 3:47 PM

Hardik Pandya and Natasa Stankovic Divorce Rumours Big Update: భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా, అతని భార్య నటాషా స్టాంకోవిచ్ మధ్య గత కొన్ని రోజులుగా విభేదాలు నడుస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు దీనికి సంబంధించి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. నివేదికల ప్రకారం, హార్దిక్, నటాషాల మధ్య విభేదాలు వీడటం లేదని, ఇద్దరూ సరిదిద్దుకోవడంలో లేదంటూ, వీరిద్దరి కామన్ ఫ్రెండ్ ఈ కీలక విషయాన్ని బయటపెట్టాడు.

గత కొన్ని రోజులుగా హార్దిక్, నటాషా మధ్య విడాకుల పుకార్లు తెగ వినిపిస్తున్నాయి. ఇటీవల హార్దిక్ పాండ్యా అద్భుత ప్రదర్శన చేసి టీ20 ప్రపంచకప్‌ను భారత్‌కు అందించినప్పుడు, నటాషా స్టాంకోవిచ్ దానిపై స్పందించలేదు. ఆమె సోషల్ మీడియాలో ఎలాంటి పోస్ట్‌ను పంచుకోలేదు లేదా టి 20 ప్రపంచ కప్ కోసం వెస్టిండీస్ లేదా యుఎస్‌ఎకు ఆమె వెళ్లలేదు. ప్రపంచ కప్ ట్రోఫీని గెలిచిన తర్వాత హార్దిక్ పాండ్యా ఇంటికి తిరిగి వచ్చినప్పుడు కూడా, నటాషాతో అతని ఫొటో కనిపించలేదు. హార్దిక్ తన కొడుకుతో ఉన్న ఫొటోను పంచుకున్నాడు. కానీ, అతని భార్యతో ఒక్క వీడియో లేదా ఫొటో కూడా కనిపించలేదు. అనంత్ అంబానీ వివాహ వేడుకకు హార్దిక్ పాండ్యా ఒంటరిగా వెళ్లాడు.

“హార్దిక్, నటాషాలు ఒకరినొకరు అర్థం చేసుకునే మూడ్‌లో లేరు”

దీంతో హార్దిక్, నటాషా మధ్య బాగా లేదని అభిమానులు భావిస్తున్నారు. టైమ్స్ నౌ ప్రకారం, హార్దిక్, నటాషా ప్యాచ్ అప్ మూడ్‌లో లేరని, బ్రేక్ అప్‌కే వారు సిద్ధంగా ఉన్నట్లు వారిద్దరి సన్నిహితుడు చెప్పాడు. నివేదికల ప్రకారం, హార్దిక్ చేసిన కొన్ని తప్పులకు నటాషా కోపంగా ఉందంట. వాటిని సరిదిద్దుకోవడానికి హార్దిక్ ఇష్టపడడం లేదంట. భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదంటూ వాళ్ల ఫ్రెండ్ చెప్పినట్లు తెలుస్తోంది.

హార్దిక్ పాండ్యా ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను పంచుకున్న సంగతి తెలిసిందే. ఈ వీడియోలో, అతను ODI ప్రపంచ కప్‌లో గాయపడటం నుంచి IPL లో ఫ్లాప్ కావడం, ఆ తర్వాత బలమైన పునరాగమనం చేయడం, T20 ప్రపంచ కప్ 2024 ట్రోఫీని గెలుచుకోవడం వరకు ఫొటోలను పంచుకున్నాడు. దీనిపై అభిమానులు చాలా పాజిటివ్‌గా స్పందిస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..