Video: పాక్ ప్లేయర్‌తో షేక్ హ్యాండ్.. టీమిండియా మాజీ ప్లేయర్‌ను ఏకిపారేస్తోన్న నెటిజన్స్
నవంబర్ 19న అబుదాబిలోని జాయెద్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో, హర్భజన్ నేతృత్వంలోని స్టాలియన్స్ జట్టు 'నార్తర్న్ వారియర్స్' చేతిలో 4 పరుగుల తేడాతో ఓడిపోయింది. పాకిస్థాన్ బౌలర్ దహానీ 2 ఓవర్లలో 10 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు.

Harbhajan Singh Handshake with Shahnawaz Dahani: అబుదాబి టీ10 లీగ్‌లో ఆస్పిన్ స్టాలియన్స్ జట్టుకు కెప్టెన్‌గా ఉన్న భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్, మ్యాచ్ అనంతరం పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ షానవాజ్ దహానీతో కరచాలనం (handshake) చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అబుదాబి T10 లీగ్ 2025లో మూడో మ్యాచ్ ముగిసిన తర్వాత, భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ పాకిస్థాన్ బౌలర్ షానవాజ్ దహానీతో కరచాలనం (షేక్ హ్యాండ్) చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఈ టోర్నమెంట్‌లో హర్భజన్ ప్రస్తుతం ‘ఆస్పిన్ స్టాలియన్స్’ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. అయితే, ఆయన చేసిన ఈ పని ఇప్పుడు వివాదానికి దారితీసింది.
ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన పహల్గామ్ దాడి కారణంగా భారత్, పాకిస్థాన్ మధ్య నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో హర్భజన్ చర్యపై ఆన్‌లైన్‌లో విమర్శలు వస్తున్నాయి. ఆ ఘటన తర్వాత నుంచి భారత పురుషుల, మహిళల జట్లు పాకిస్థాన్‌తో మ్యాచ్‌లు ఆడినప్పుడు కరచాలనం చేయడానికి దూరంగా ఉంటున్నాయి. ఆసియా కప్, మహిళల వరల్డ్ కప్, ఇటీవల జరిగిన ఇండియా-ఏ మ్యాచ్‌లలో కూడా భారత జట్లు పాకిస్థాన్ ఆటగాళ్లతో కరచాలనం చేయలేదు.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, గతంలో ‘వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్’లో పాకిస్థాన్‌తో ఆడటానికి హర్భజన్, ఇతర మాజీ క్రికెటర్లు నిరాకరించారు. “రక్తం, చెమట కలిసి ఉండలేవు” అని అప్పట్లో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
Harbhajan Singh handshake with Shahnawaz Dahani. Ab kahan gai patriotism indians ki. #AbuDhabiT10 @iihtishamm pic.twitter.com/4ZFfgP2ld3
— Ather (@Atherr_official) November 19, 2025
నవంబర్ 19న అబుదాబిలోని జాయెద్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో, హర్భజన్ నేతృత్వంలోని స్టాలియన్స్ జట్టు ‘నార్తర్న్ వారియర్స్’ చేతిలో 4 పరుగుల తేడాతో ఓడిపోయింది. పాకిస్థాన్ బౌలర్ దహానీ 2 ఓవర్లలో 10 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
