Video: ఇది చరిత్రలో నిలిచిపోయే హ్యాట్రిక్ భయ్యా.. మాజీ కేకేఆర్ ప్లేయర్ చిన్న కథ రాయలేగా

Gus Atkinson Hat-trick: ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ గుస్ అట్కిన్సన్ న్యూజిలాండ్‌పై అద్భుతాలు చేశాడు. టెస్టు క్రికెట్‌లో తొలి హ్యాట్రిక్‌ సాధించాడు. గతంలో కూడా టెస్టుల్లో హ్యాట్రిక్‌ సాధించాడు. కానీ, గుస్ అట్కిన్సన్ కథ వేరేలా ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు.

Video: ఇది చరిత్రలో నిలిచిపోయే హ్యాట్రిక్ భయ్యా.. మాజీ కేకేఆర్ ప్లేయర్ చిన్న కథ రాయలేగా
Gus Atkinson Hat Trick
Follow us
Venkata Chari

|

Updated on: Dec 07, 2024 | 11:17 AM

England vs New Zealand: టెస్ట్ క్రికెట్‌లో హ్యాట్రిక్‌ల గురించి వినే ఉంటారు. ఇప్పటి వరకు 44 మంది బౌలర్లు హ్యాట్రిక్ సాధించారు. వీరిలో 2 సార్లు టెస్ట్ హ్యాట్రిక్ సాధించిన బౌలర్లు ముగ్గురు ఉన్నారు. అంటే, ఓవరాల్‌గా టెస్టు క్రికెట్‌లో 47 హ్యాట్రిక్‌ల కథలు నమోదయ్యాయి. ఆ కథలలో ఒకటి 26 ఏళ్ల ఇంగ్లండ్ బౌలర్ గుస్ అట్కిన్సన్ హ్యాట్రిక్‌ కూడా ఉంది. అయితే, ఇది మిగిలిన వాటికి భిన్నంగా ఉంటుంది. వెల్లింగ్టన్‌లోని బేసిన్ రిజర్వ్‌లో న్యూజిలాండ్‌తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో 6 అడుగుల 2 అంగుళాల పొడవున్న ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ హ్యాట్రిక్ సాధించాడు. గస్ అట్కిన్సన్ తన టెస్ట్ కెరీర్‌లో మొదటి హ్యాట్రిక్ సాధించిన మైదానం ఇదే కావడం విశేషం.

బేసిన్ రిజర్వ్‌లో హ్యాట్రిక్ సాధించిన ప్రపంచ తొలి బౌలర్..

వెల్లింగ్టన్ టెస్టులో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 3 వరుస బంతుల్లో చివరి 3 వికెట్లు పడగొట్టడం ద్వారా గస్ అట్కిన్సన్ తన టెస్ట్ హ్యాట్రిక్ సాధించాడు. దీంతో, బేసిన్ రిజర్వ్‌లో టెస్టు హ్యాట్రిక్ చేసిన ప్రపంచంలోనే తొలి బౌలర్‌గా నిలిచాడు. అతను 7 సంవత్సరాల తర్వాత హ్యాట్రిక్ వికెట్లు తీసిన ఇంగ్లాండ్ మొదటి ఫాస్ట్ బౌలర్‌గా మారాడు. టెస్టుల్లో హ్యాట్రిక్ సాధించిన 14వ ఇంగ్లండ్ బౌలర్ గస్ అట్కిన్సన్.

ఇవి కూడా చదవండి

గస్ అట్కిన్సన్ హ్యాట్రిక్..

గుస్ అట్కిన్సన్ తన హ్యాట్రిక్‌లో ఏ న్యూజిలాండ్ ఆటగాళ్లను లక్ష్యంగా చేసుకున్నాడో ఇప్పుడు చూద్దాం. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 35వ ఓవర్‌లో అతను ఈ హ్యాట్రిక్ స్క్రిప్ట్‌ను రాశాడు. ఈ ఓవర్ మూడో బంతికి న్యూజిలాండ్‌కు చెందిన నాథన్ స్మిత్‌ను అట్కిన్సన్ అవుట్ చేశాడు. ఆ తర్వాత నాలుగో బంతికి మాట్ హెన్రీని అవుట్ చేసి, ఐదో బంతికి టిమ్ సౌథీ వికెట్ పడగొట్టి హ్యాట్రిక్ పూర్తి చేయడమే కాకుండా కివీ జట్టు తొలి ఇన్నింగ్స్‌ను ముగించాడు.

అట్కిన్‌సన్ హ్యాట్రిక్‌తో ఇంగ్లండ్‌కు భారీ ఆధిక్యం..

న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో గస్ అట్కిన్సన్ 8.5 ఓవర్లలో 31 పరుగులిచ్చి హ్యాట్రిక్‌తో 4 వికెట్లు పడగొట్టాడు. ఈ ప్రదర్శన కారణంగా న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ 125 పరుగులకే పరిమితమవగా, ఇంగ్లండ్ కూడా 155 పరుగుల బలమైన ఆధిక్యంలో నిలిచింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..