
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పుణ్యమా అనీ ఇటీవల టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. మన పనులు కూడా సులభమవుతున్నాయి. ముఖ్యంగా ఇటీవల ఇల్యూషన్ టూల్ పేరు బాగా వినిపిస్తోంది. ఇటీవల ప్రముఖ వీఎఫ్‌ఎక్స్ సూపర్‌వైజర్ శ్రీనివాస్ మోహన్ ఓ ఫొటోను నెట్టింట షేర్ చేశారు. ఆస్కార్ వేడుకల్లో ‘ఆర్‌ఆర్‌ఆర్’ ప్రమోషన్స్ సమయంలో వైరల్‌గా మారిన జూనియర్ ఎన్టీఆర్ ఫొటోను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇల్యూజన్ టూల్ సహాయంతో సరి కొత్తగా చూపించారు. ఆకాశం, సముద్రం, బోట్లు ఉన్న ఫొటోలను తీక్షణంగా చూస్తే తారక్ కనిపిస్తాడు. నెట్టింట వైరల్‌గా మారిన ఈ ఫొటో అభిమానులను కూడా బాగా ఆకట్టుకుంది. దీంతో మిగతా హీరోల అభిమానులు కూడా రెడీ అయ్యారు. తమ హీరోల ఫొటోలను ఇలాగే రూపొందించి నెట్టింట షేర్ చేస్తున్నాడు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గన్స్‌తో సిద్ధం చేయగా, మహేశ్ బాబు ఫ్యాన్స్ అగ్నిపర్వతాలతో ఏఐ మాయ చేశారు. ఇక ప్రభాస్ ఫ్యాన్స్ అయితే మరో అడుగు ముందుకేసి డైనోసర్‌ను ఫొటో చేయడానికి వాడుకున్నారు. ఇక చాలామంది నెటిజన్లు కూడా తమ అభిమాన క్రికెటర్ల ఫొటోలను ఇలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో ఎంతో అందంగా రూపొందిస్తున్నారు. ఇవి కూడా నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. పై ఫొటో కూడా అలాంటిదే. దీనిని చూస్తే పచ్చని చెట్లు, కొండరాళ్లు, నీళ్లు, అలాగే పడవ కనిపిస్తాయి. కానీ తీక్షణంగా వీటిని కలిపి చూస్తే అందులో ఒక స్టార్ క్రికెటర్ నవ్వుతూ కనిపిస్తాడు. మరి అతనెవరో గుర్తుపట్టారా? కొంచెం కష్టంగా ఉందా? అయితే మీకో క్లూ.. అతను భారత క్రికెట్ జట్టు కెప్టెన్ కూడా.. ఈ పాటికే చాలామంది మెదళ్లలో సమాధానం మెదిలే ఉంటుంది.
పై ఫొటోలో ఉన్న క్రికెటర్ మరెవరో కాదు.. టీమిండియా కెప్టెన్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ. ప్రస్తుతం ఈ ఫొటో నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటోంది. కాగా ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు దృష్టంతా రాబోయే ప్రపంచకప్ టోర్నీ మీదే ఉంది. రోహిత్ శర్మ టీమిండియాను ముందుండి నడిపించనున్నాడు. అక్టోబర్ 5న ప్రపంచకప్ మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. భారత్ తమ మొదటి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. చెన్నై చిదంబంరం స్టేడియం వేదికగా అక్టోబర్ 8న ఈ మ్యాచ్ జరగనుంది. ఆ తర్వాత అక్టోబర్ 14న పాకిస్తాన్‌తో అమీతుమీ తేల్చుకోనుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..