Team India: అమాయకంగా కనిపిస్తోన్న ఈ కుర్రాడిని గుర్తు పట్టారా? క్రికెట్‌లో రికార్డుల రారాజు.. బౌలర్లకు హడలే

|

Apr 30, 2024 | 6:50 PM

పై ఫొటోలో తలపై టోపీతో అమాయకంగా కనిపిస్తోన్న కుర్రాడిని గుర్తు పట్టారా? ఇప్పుడు అతను ఓ స్టార్ క్రికెటర్. టీమిండియాకు ఎన్నో ఏళ్లుగా సేవలందిస్తున్నాడు. టీ20, వన్డే, టెస్ట్‌ అయినా ఫార్మాట్ తో పని లేకుండా మెరుపువేగంతో బ్యాటింగ్‌ చేయడం అతని స్టైల్. అందుకే అతను క్రీజులోకి వస్తున్నాడంటే బౌలర్లకు హడల్.

Team India: అమాయకంగా కనిపిస్తోన్న ఈ కుర్రాడిని గుర్తు పట్టారా? క్రికెట్‌లో రికార్డుల రారాజు.. బౌలర్లకు హడలే
Team India
Follow us on

పై ఫొటోలో తలపై టోపీతో అమాయకంగా కనిపిస్తోన్న కుర్రాడిని గుర్తు పట్టారా? ఇప్పుడు అతను ఓ స్టార్ క్రికెటర్. టీమిండియాకు ఎన్నో ఏళ్లుగా సేవలందిస్తున్నాడు. టీ20, వన్డే, టెస్ట్‌ అయినా ఫార్మాట్ తో పని లేకుండా మెరుపువేగంతో బ్యాటింగ్‌ చేయడం అతని స్టైల్. అందుకే అతను క్రీజులోకి వస్తున్నాడంటే బౌలర్లకు హడల్. ఇక రికార్డులకైతే కొదవే లేదు. వన్డేల్లో అత్యధిక స్కోరుతో పాటు మూడు సార్లు డబుల్ సెంచరీలు చేసిన ఏకైక క్రికెటర్. అతని సామర్థ్యంపై నమ్మకం ఉంచే బీసీసీఐ కూడా మూడు ఫార్మాట్లలోనూ అతనిని టీమిండియా సారథిగా బాధ్యతలు అప్పగించింది. ఇలా బ్యాటర్ గానూ, కెప్టెన్‌గానూ భారత జట్టుకు అద్భుత విజయాలు అందిస్తోన్న ఈ స్టార్‌ క్రికెటర్‌ మరెవరో కాదు.. మన హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ. మంగళ వారం (ఏప్రిల్ 30) టీమిండియా కెప్టెన్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా పలువురు క్రికెటర్లు, అభిమానులు, నెటిజన్లు రోహిత్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. త్వరలోనే జరగనున్న టీ20 ప్రపంచ కప్ తో పాటు భవిష్యత్ లో భారత జట్టుకు మరెన్నో అద్భుత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

ప్రపంచకప్ సాధనే లక్ష్యంగా..

రోహిత్ బర్త్ డే సందర్భంగా అతని తల్లి పూర్ణిమ సోషల్ మీడియాలో ఒక అరుదైన ఫొటోను షేర్ చేసింది. తన కుమారుడు జూనియర్ క్రికెట్ ఆడుతున్నప్పటి ఫొటోను పంచుకున్న ఆమె బర్త్ డే విషెస్ తెలిపింది. ప్రస్తుతం ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. క్యూట్ రోహిత్ ను చూసి అతని ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. హిట్ మ్యాన్ కు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. కాగా ప్రస్తుతం దేశమంతా ఐపీఎల్ ఫీవర్ నడుస్తోంది. అలాగే ఈ ధనా ధన్ టోర్నీ ముగిసిన వెంటనే ప్రతిష్ఠాత్మక టీ 20 ప్రపంచకప్ ప్రారంభంకానుంది. సుమారు 11 ఏళ్లుగా ఐసీసీ కప్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తోంది. మరి రోహిత్ శర్మ భారత జట్టుకు ప్రపంచ కప్ అందిస్తాడో లేదో చూడాలి.

ఇవి కూడా చదవండి

తల్లి పూర్ణిమతో రోహిత్ శర్మ..

 

తల్లిదండ్రులతో చిన్ననాటి రోహిత్..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..