Lords Cricket Ground : రూ.5000లకే లార్ట్స్ స్టేడియం.. అవకాశం అస్సలు మిస్ చేసుకోవద్దు..25000మందికే ఛాన్స్
క్రికెట్ అభిమానులకు ఇది ఒక అద్భుతమైన అవకాశం. క్రికెట్ ప్రపంచంలో క్రికెట్ కా మక్కాగా పిలువబడే చారిత్రక లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ ముక్కను సొంతం చేసుకునే అవకాశం వచ్చింది. ఈ అరుదైన నిర్ణయాన్ని లార్డ్స్ మైదానాన్ని నిర్వహించే మేరిల్బోన్ క్రికెట్ క్లబ్ తీసుకుంది. కేవలం రూ.5,000తో ఈ చారిత్రక మైదానంలో ఒక భాగాన్ని సొంతం చేసుకోవచ్చు.

Lords Cricket Ground :క్రికెట్ ప్రపంచంలో లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌ను క్రికెట్ కా మక్కా అని పేరు. ఈ చారిత్రక మైదానం ఎన్నో అద్భుతమైన క్షణాలను చూసింది. ఇప్పుడు క్రికెట్ అభిమానులకు లార్డ్స్ మైదానంలో ఒక భాగాన్ని తమ సొంతం చేసుకునే అవకాశం లభించింది. మెరిలెబోన్ క్రికెట్ క్లబ్ ఈ అరుదైన అవకాశాన్ని కల్పిస్తోంది. లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్, క్రికెట్ చరిత్రలో అత్యంత ప్రసిద్ధి చెందిన మైదానాలలో ఒకటి. ఈ మైదానాన్ని నిర్వహించే మెరిలెబోన్ క్రికెట్ క్లబ్, ఈ ఏడాది సెప్టెంబర్‌లో పిచ్‌ను పునర్నిర్మించాలని నిర్ణయించింది. దీని కోసం పాత గడ్డిని తొలగించి, కొత్త గడ్డిని వేయనున్నారు. ఈ సందర్భంగా మెరిలెబోన్ క్రికెట్ క్లబ్ ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకుంది. క్రికెట్ అభిమానులు పాత పిచ్‌లోని గడ్డి (టరఫ్) ముక్కను కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పిస్తోంది.
లార్డ్స్ క్రికెట్ మైదానంలోని గడ్డి ముక్కను కేవలం 50 పౌండ్ల (సుమారు రూ.5000)కు కొనుగోలు చేయవచ్చు. ఈ గడ్డి ముక్క 1.2 x 0.6 మీటర్ల సైజులో ఉంటుంది. ఈ ఆఫర్ క్లబ్ సభ్యులతో పాటు సాధారణ క్రికెట్ అభిమానులకు కూడా అందుబాటులో ఉంటుంది. అయితే, ఈ గడ్డి ముక్కలు పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వాటిని సెప్టెంబర్ 29 లేదా 30, 2025న లార్డ్స్‌కు వెళ్లి స్వయంగా తీసుకోవాలి.
ఈ నిర్ణయం వెనుక ముఖ్య ఉద్దేశ్యం, ఎంసీసీ ఫౌండేషన్ కోసం నిధులు సేకరించడం, మైదానాన్ని మెరుగుపరచడం. ఈ అమ్మకం ద్వారా వచ్చే ఆదాయంలో 10% ఎంసీసీ ఫౌండేషన్‌కు వెళ్తుంది. ఈ ఫౌండేషన్ క్రికెట్ అభివృద్ధి కోసం కృషి చేస్తుంది. మిగిలిన మొత్తం మైదానం నిర్వహణకు ఉపయోగపడుతుంది. లార్డ్స్ మైదానం అనేక అద్భుతమైన మ్యాచ్‌లకు వేదికైంది. ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీలో టీమిండియా అద్భుత ప్రదర్శన చేసింది. అలాగే, 2025లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ కూడా ఇక్కడే జరిగింది. ఇప్పుడు ఈ చారిత్రక పిచ్‌లోని ఒక ముక్కను సొంతం చేసుకునే అవకాశం అభిమానులకు లభించింది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి….




