Video: అభిమాని ఫోటో రిక్వెస్ట్ ని పట్టించుకోని గిల్! అప్పుడే బలుపు చూపిస్తున్న గుజరాత్ కెప్టెన్.. వీడియో వైరల్
గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మాన్ గిల్‌కు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అయింది. అభిమాని ఫోటో అభ్యర్థనను పట్టించుకోకుండా వెళ్లిపోయిన గిల్ వ్యవహారంపై సోషల్ మీడియాలో భిన్నమైన స్పందనలు వచ్చాయి. కొంతమంది విమర్శించగా, మరికొందరు భద్రతా కారణాల్ని ప్రస్తావించారు. టెస్ట్ కెప్టెన్సీ అవకాశాలు ఉన్న గిల్ ప్రస్తుతం తన కెరీర్‌లో కీలక దశలో ఉన్నాడు.

ఇంగ్లాండ్‌లో జరగనున్న ఐదు టెస్టుల సిరీస్ కోసం భారత జట్టుకు శుభ్‌మాన్ గిల్ నాయకత్వం వహించనున్నట్లు వార్తలు వస్తుండగా, అతను సోషల్ మీడియాలో వివాదానికి లోనయ్యాడు. ఇటీవల రోహిత్ శర్మ టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడంతో, గిల్ పేరు కొత్త కెప్టెన్‌గా ప్రధానంగా వినిపిస్తోంది. అయితే, ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఇదే సమయంలో గిల్ ఐపీఎల్ 2025లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. గిల్ నాయకత్వంలో గుజరాత్ టైటాన్స్ 11 మ్యాచ్‌లలో ఎనిమిది విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. ఈ విజయాలతో అతనికి టెస్టు కెప్టెన్సీ అవకాశం వచ్చే సూచనలు ఎక్కువయ్యాయి.
ఈ నేపథ్యంలో, మే 12న గిల్ గురించి ఒక వీడియో ఆన్‌లైన్‌లో వైరల్ అయింది. ఇందులో అతను సెక్యూరిటీ, తన లగేజీని తీసుకొని నడుచుకుంటూ వెళ్తుండగా, ఒక అమ్మాయి “ప్లీజ్ సర్, ఒక్క ఫోటో” అంటూ రిక్వెస్ట్ చేయడం వినిపిస్తుంది. కానీ గిల్ ఆమె అభ్యర్థనను పూర్తిగా లెక్క చేయకుండా నేరుగా వెళ్లిపోవడం అనేకమంది అభిమానుల దృష్టిని ఆకర్షించింది. ఈ సంఘటనపై సోషల్ మీడియా వేదికగా భిన్నమైన స్పందనలు వచ్చాయి. కొంతమంది గిల్‌ను నిర్లక్ష్యంగా వ్యవహరించాడని విమర్శించగా, మరికొందరు భద్రతా కారణాలతో అతను ఆ అమ్మాయిని పట్టించుకోలేదని అభిప్రాయపడ్డారు.
ఇటీవల భారతదేశం – పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో క్రికెట్ టోర్నమెంట్లకు కఠినమైన భద్రతా చర్యలు అమలవుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో సెలబ్రిటీల చుట్టూ భద్రతా పరిమితులు కచ్చితంగా పాటించాల్సి రావడం సహజం. అయినప్పటికీ, అభిమానులు తమ అభిమాన క్రికెటర్ నుంచి ఒక ఫోటో లేదా చిన్న హావభావం ఆశించడం సాధారణం.
ఇటువంటి సంఘటనలు ఒక్కొసారి క్రికెటర్లపై ప్రజల అభిప్రాయాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉన్నప్పటికీ, శుభ్‌మాన్ గిల్ ప్రస్తుతం తన కెరీర్‌లో అత్యంత కీలక దశలో ఉన్నాడు. IPLలో అద్భుతమైన ప్రదర్శనతో పాటు, భారత టెస్టు కెప్టెన్‌గా తన బాధ్యతలను భవిష్యత్తులో ఎలా నిర్వహిస్తాడో చూడాల్సి ఉంటుంది. కాగా, అతను జూన్ మధ్యలో ప్రారంభమయ్యే ఇంగ్లాండ్ టెస్ట్ పర్యటనకు భారత జట్టుకు నాయకత్వం వహించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
ఈ ఘటనపై స్పందించిన కొంతమంది నెటిజన్లు శుభ్‌మాన్ గిల్‌కు మద్దతుగా కూడా నిలిచారు. వారు క్రికెటర్లు కూడా మనుషులే అన్న విషయాన్ని గుర్తు చేస్తూ, ప్రతి సందర్భంలో అభిమానుల అభ్యర్థనలను తక్షణమే సహకరించలేరు అని చెప్పారు. ప్రయాణ సమయంలో భద్రత, టైం కంట్రెయింట్లు, మానసిక ఒత్తిడి వంటి కారణాలు కూడా ఉండవచ్చని వ్యాఖ్యానించారు. గిల్ ప్రస్తుతం కెప్టెన్సీ బాధ్యతలతో పాటు ఆటలో నిలకడ చూపించాల్సిన దశలో ఉన్నాడు కాబట్టి, అతను తన దృష్టిని పూర్తిగా ఆటపై కేంద్రీకరించవలసిన అవసరం ఉంది. ఈ సంఘటన కంటే అతని ఆటతీరు, నాయకత్వ నైపుణ్యం భారత క్రికెట్‌కు ఎంతగానో ఉపయోగపడుతాయన్నదే కీలక విషయం.
Arrogant Shubman Gill, I have seen his indifferent behavior towards girls on the basis of their looks. Here is another example.pic.twitter.com/CBnSQl80A2
— Abhishek (@vicharabhio) May 12, 2025
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..