Virat Kohli: ఆధ్యాత్మిక సేవలో కోహ్లీ దంపతులు.. వైరల్ అవుతున్న ఫోటోలు!
ఇటీవలే టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన టీమిండియా స్టార్ ప్లేయర్ కింగ్ విరాట్ కోహ్లీ తన సతీమణి అనుష్కశర్మతో కలిసి యూపీలోని బృందావన్ దామ్‌ను సందర్శించారు. అక్కడ ఆధ్యాత్మిక గురువైన ప్రేమానంద్ మహారాజ్ కలిసిన కోహ్లీ, అనుష్క దంపతులు ఆధ్యాత్మిక గురువు నుంచి ఆశీర్వాదాలు తీసుకున్నారు. అక్కడికి వచ్చిన ఈ జంటకు ప్రేమానంద్ మహారాజ్ ఆధ్యాత్మిక బోధనలు చేశారు.

టీమిండియా స్టార్ ప్లేయర్ మాజీ కెప్టెన్ కింగ్ కోహ్లీ సోమవారం టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై చెబుతూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అయితే టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన మరుసటి రోజు కోహ్లీ తన సతీమణి అనుష్కశర్మతో కలిసి యూపీలోని బృందావన్ దామ్‌ను సందర్శించారు. అక్కడ ఆధ్యాత్మిక గురువైన ప్రేమానంద్ మహారాజ్ కలిసిన కోహ్లీ, అనుష్క దంపతులు ఆధ్యాత్మిక గురువు నుంచి ఆశీర్వాదాలు తీసుకున్నారు. అక్కడికి వచ్చిన ఈ జంటకు ప్రేమానంద్ మహారాజ్ ఆధ్యాత్మిక బోధనలు చేశారు. అయితే కోహ్లీ దంపతులు ఈ ఆశ్రమాన్ని సదర్శించడం ఇదే మొదటి సారి ఏం కాదు.. ఇంతకు ముందు కూడా చాలా సార్లు వీరు ఇక్కడికి వచ్చారు.
అయితే కోహ్లీ టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన తర్వాత వ్యక్తిగతంగా పాల్గొన్న మొదటి కార్యక్రమం ఇది. ఈ ఆధ్యాత్మిక క్షేత్రంలో సెలబ్రిటీ దంపతులను చూసిన కొందరు అభిమానులు ఈ ఫోటోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. దీంతో ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్‌గా మారాయి.
🚨Virat Kohli and Anushka Sharma in Vrindavan meet Shri Premanand Ji Maharaj
🙏 You will have to come back here, when you do not understand anything, you will have to turn towards spirituality🙏#ViratKohli𓃵 #Cricket #Blessing #AnushkaSharma pic.twitter.com/3UkoGeghVS
— Pintu Dera (@pintudera_) May 13, 2025
అయితే విరాట్ కోహ్లీ తన 14 ఏళ్ల సుదీర్ఘ టెస్ట్ క్రికెట్ ఫార్మాట్‌కు సోమవారం గుడ్‌బై చెప్పారు. అయితే 2011లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌తో కోహ్లీ టెస్ట్ క్రికెట్‌లోకి అడుగు పెట్టిన కోహ్లీ ఇప్పటి వరకు 123 మ్యాచ్‌లు ఆడాడు. అయితే కోహ్లీ టెస్టుల్లో ఇప్పటి వరకు 9,230 పరుగులు చేయగా అందులో 30 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అయితే తాజాగా టెస్ట్ క్రికెట్, గతంలో భారత్ టీ20 వరల్డ్ కప్ తర్వాత టీ20 ఫార్మట్‌లకు గుడ్‌బై చెప్పిన కోహ్లీ ప్రస్తుతం వన్డే క్రికెట్‌లో మాత్రమే కొనసాగనున్నాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..