AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Suryakumar Yadav : సూర్యకుమార్ యాదవ్‌కు అన్యాయం జరిగిందా? సెలెక్టర్ల నిర్ణయంపై భారత క్రికెట్ దిగ్గజం ఫైర్

Suryakumar Yadav : సూర్యకుమార్ యాదవ్‌ను టీ20 కెప్టెన్సీ నుంచి తొలగించడంపై సునీల్ గవాస్కర్ స్పందించారు. ఐపీఎల్ 2026 ప్రదర్శన ఆధారంగా ఈ నిర్ణయం తీసుకోవడం సరైంది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇంగ్లాండ్ సిరీస్ వరకు అవకాశం ఇచ్చి పరీక్షించాల్సిందని అభిప్రాయపడ్డారు.

Suryakumar Yadav : సూర్యకుమార్ యాదవ్‌కు అన్యాయం జరిగిందా? సెలెక్టర్ల నిర్ణయంపై భారత క్రికెట్ దిగ్గజం ఫైర్
Shubman Gill
Rakesh
|

Updated on: Jun 07, 2026 | 4:14 PM

Share

Suryakumar Yadav : టీమిండియా టీ20 కెప్టెన్సీ నుంచి సూర్యకుమార్ యాదవ్‌ను తొలగించడంపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఘాటుగా స్పందించారు. భారత జట్టును ప్రపంచ విజేతగా నిలిపిన వెంటనే, కేవలం ఐపీఎల్‌లో ప్రదర్శన బాగోలేదనే కారణంతో అతడిని కెప్టెన్సీ నుంచి తప్పించడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. ఒక ఆటగాడి భవిష్యత్తును నిర్ణయించేటప్పుడు కేవలం ఐపీఎల్ ఫామ్‌నే ప్రామాణికంగా తీసుకోవడాన్ని గవాస్కర్ తప్పుబట్టారు.

తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో గవాస్కర్ మాట్లాడుతూ.. “సూర్యకుమార్ యాదవ్‌కు అన్యాయం జరిగిందని కొందరు అంటున్నారు, అది నిజమే కావచ్చు. 2028లో టీ20 ప్రపంచ కప్, ఒలింపిక్స్ ఉన్నాయి. కనీసం రాబోయే ఇంగ్లాండ్ సిరీస్ వరకు అతడికి అవకాశం ఇచ్చి చూడాల్సింది. ఆ ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో అతడి ప్రదర్శనను చూసిన తర్వాతే సెలెక్టర్లు ఒక నిర్ణయానికి వచ్చి ఉంటే బాగుండేది” అని స్పష్టం చేశారు. ఐపీఎల్ 2026లో సూర్య సరిగ్గా ఆడకపోవడం సెలెక్టర్ల నిర్ణయానికి మరింత బలాన్ని ఇచ్చి ఉండవచ్చని ఆయన విశ్లేషించారు.

అయితే సెలెక్టర్ల ఆలోచనా విధానం మరోలా ఉండి ఉండవచ్చని కూడా గవాస్కర్ పేర్కొన్నారు. మార్పు అనేది ఇప్పుడే మొదలుపెట్టాలని వారు భావించి ఉండవచ్చని చెప్పారు. “సూర్య వయసు ఇప్పుడు 35 లేదా 36 ఏళ్లు. 2028 నాటికి అతడికి 38 ఏళ్లు వస్తాయి. ఆ సమయంలో ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ గెలవాలన్నా, వరల్డ్ కప్ నిలబెట్టుకోవాలన్నా యంగ్ కెప్టెన్ అవసరం. అందుకే శ్రేయస్ అయ్యర్ లాంటి అనుభవం ఉన్న యువ ఆటగాడిని ఎంపిక చేసి ఉండవచ్చు” అని గవాస్కర్ విశ్లేషించారు.

కెప్టెన్సీ నుంచి తప్పించినప్పటికీ, సూర్య వ్యక్తిత్వాన్ని గవాస్కర్ ఆకాశానికెత్తారు. మైదానంలో సూర్య ప్రవర్తన మహేంద్ర సింగ్ ధోనీలాగే ఎంతో ప్రశాంతంగా ఉంటుందని కొనియాడారు. “సూర్య తన ప్రశాంత స్వభావాన్ని జట్టుకు వారసత్వంగా వదిలి వెళ్తాడు. క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఒత్తిడికి లోనుకాకుండా జట్టును నడిపించడంలో అతడు ధోనీని పోలి ఉంటాడు” అని గవాస్కర్ ఇండియా టుడేతో మాట్లాడుతూ ప్రశంసించారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us