Video: ‘అబ్ తో రిటైర్ హో గయా’.. కపిల్ శర్మ షోలో రోహిత్‌పై గంభీర్ కామెంట్స్..
Kapil Sharma Show: గంభీర్ వ్యాఖ్య సరదాగా ఉన్నప్పటికీ, ఇది క్రికెట్ అభిమానుల్లో విస్తృతంగా చర్చకు దారితీసింది. సోషల్ మీడియాలో ఈ వీడియో క్లిప్ విపరీతంగా షేర్ అవుతోంది. గంభీర్, రోహిత్ మధ్య గతంలో ఉన్న విభేదాలపై కూడా ఈ వ్యాఖ్య పరోక్షంగా చర్చకు దారితీసింది.

Kapil Sharma Show: భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, ఇటీవల “ది కపిల్ శర్మ షో”లో చేసిన ఒక సరదా వ్యాఖ్య ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ షోకు గంభీర్‌తో పాటు యువ క్రికెటర్లు రిషబ్ పంత్, యుజ్వేంద్ర చాహల్ హాజరయ్యారు. ఆ సంభాషణలో గంభీర్, భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మపై చేసిన “అబ్ తో రిటైర్ హో గయా” (ఇక రిటైర్ అయిపోయాడు కదా) అనే వ్యాఖ్య నవ్వులు పూయించింది.
అసలేం ఏం జరిగింది?
కపిల్ శర్మ తనదైన శైలిలో మాట్లాడుతూ, “చాలా కుటుంబాల్లో ఒక జ్యేష్ట (పెద్దవాళ్ళు) ఉంటారు. వారు సీనియారిటీని ఉపయోగించుకుని అందరినీ ఆజ్ఞాపించేవారు. టీమ్‌లో అలాంటి ఆటగాడు ఎవరు?” అని రిషబ్ పంత్‌ను అడిగాడు. దీనికి పంత్ తడుముకోకుండా “రోహిత్ భాయ్ అలాంటోడే” అని నవ్వుతూ బదులిచ్చాడు. వెంటనే గంభీర్ కల్పించుకొని చిరునవ్వుతో “మైనే కహా, రోహిత్ కా నామ్ లేలే, అబ్ తో రిటైర్ హో గయా” (రోహిత్ పేరు చెప్పేయ్, ఇప్పుడు రిటైర్ అయ్యాడు కదా) అని అన్నాడు. ఈ వ్యాఖ్యతో పంత్, చాహల్‌తో పాటు ప్రేక్షకులు కూడా నవ్వులు పూయించారు.
గంభీర్ వ్యాఖ్యలు వైరల్..
ఈ వ్యాఖ్య సరదాగా, హాస్యభరితంగా చేసినప్పటికీ, దీని వెనుక కొన్ని అంశాలు ఉన్నాయి. ప్రస్తుతం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్టు, టీ20ఐ క్రికెట్ నుంచి వైదొలిగి, కేవలం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే ఆడుతున్నారు. ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో పర్యటిస్తున్న భారత జట్టులో కేఎల్ రాహుల్ అత్యంత అనుభవజ్ఞుడైన ఆటగాడిగా ఉన్నాడు. మిగిలిన వారంతా యువకులే. ఈ నేపథ్యంలో గంభీర్ చేసిన ఈ వ్యాఖ్య రోహిత్ శర్మ టెస్టు, టీ20ఐ క్రికెట్ నుంచి రిటైర్ అయిన విషయాన్ని సరదాగా ప్రస్తావించినట్లుగా అర్థం చేసుకోవచ్చు.
Look how happily this guy is saying “ab toh retire hogya” , and you want me to believe he isn’t behind it pic.twitter.com/jO5JlDZKdO
— Dev 🇮🇳 (@time__square) July 5, 2025
గంభీర్ వ్యాఖ్య సరదాగా ఉన్నప్పటికీ, ఇది క్రికెట్ అభిమానుల్లో విస్తృతంగా చర్చకు దారితీసింది. సోషల్ మీడియాలో ఈ వీడియో క్లిప్ విపరీతంగా షేర్ అవుతోంది. గంభీర్, రోహిత్ మధ్య గతంలో ఉన్న విభేదాలపై కూడా ఈ వ్యాఖ్య పరోక్షంగా చర్చకు దారితీసింది. అయితే, ఈ వ్యాఖ్యను సానుకూల దృక్పథంతో చూడాలి. ఇది ఆటగాళ్ల మధ్య ఉన్న స్నేహపూర్వక వాతావరణానికి, సరదా వాతావరణానికి నిదర్శనమని చాలామంది అభిప్రాయపడుతున్నారు. గంభీర్ తన సహజమైన శైలిలో, ఎలాంటి దురుద్దేశం లేకుండా చేసిన వ్యాఖ్య ఇదంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.
మొత్తంగా, కపిల్ శర్మ షోలో గౌతమ్ గంభీర్ చేసిన ఈ వ్యాఖ్య ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో ఒక హాట్ టాపిక్‌గా మారింది. ఇది ఆటగాళ్ల మధ్య సరదా సంభాషణలకు, టీమ్ డైనమిక్స్‌కు ఒక ఉదాహరణగా నిలుస్తుంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..