Gautam Gambhir: డ్రెస్సింగ్ రూమ్ వ్యాఖ్యలకు బయటకు రావద్దు.. కోచ్ గౌతమ్ గంభీర్ వార్నింగ్..
డ్రెస్సింగ్ రూమ్ పంచాయితీ. అవును, టీమిండియా డ్రెస్సింగ్‌రూమ్‌లో మాటామాటా పెరుగుతోంది. ఆ మాట డ్రెస్సింగ్ రూమ్ దాటుతోంది. ఒకవైపు ఆస్ట్రేలియాలో టీమిండియా ఘోర పరాభవాల తర్వాత గౌతమ్‌గంభీర్ స్వరం మారింది. ఆ వివరాలు ఎలా ఉన్నాయో ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి.!
టీమిండియా ఆటగాళ్లపై కోచ్ గౌతమ్ గంభీమ్ ఆగ్రహం వ్యక్తం చేయడం ఇప్పుడు హాట్‌టాపిక్ అయింది. ఇకనుంచి తాను చెప్పినట్టే ఆడాలని గంభీర్ తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది. ఇప్పటిదాకా జరిగింది చాలు అని కూడా కొందరు ఆటగాళ్లకు చెప్పినట్లు వార్తలు వచ్చాయి. సహజమైన ఆట పేరుతో కొందరు సొంత ఆట ఆడుతున్నారని సీనియర్ ప్లేయర్లను ఉద్దేశించి కోచ్ గంభీర్ చేసిన వ్యాఖ్యలు మంటలు పుట్టిస్తున్నాయి.
డ్రెస్సింగ్‌రూమ్‌లో గంభీర్ కఠిన వైఖరి, ఆయన మాట్లాడిన తీరు, సంచలనంగా మారింది. ముఖ్యంగా మెల్‌బోర్న్ టెస్టులో 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయిన తర్వాత గంభీర్ కటువుగా మాట్లాడినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. టీమ్‌ఇండియా డ్రెస్సింగ్‌రూమ్‌లో పరిస్థితులు బాగాలేవని గంభీర్- సెలక్షన్ కమిటీ దృష్టికి తెచ్చినట్లు ప్రచారం జరిగింది. అయితే గంభీర్ విజ్ఞప్తికి సెలక్షన్ కమిటీ డోన్ట్‌కేర్ అనేసినట్లు కూడా బయటకు వచ్చింది. డ్రెస్సింగ్‌రూమ్‌లో మాట్లాడిన మాటలు, లీక్ కావడంపై గంభీర్ గుస్సాగా ఉన్నారు. ఈ నేపథ్యంలో గంభీర్ ఈ వివరణ ఇచ్చారు. ఈ వివరణ కూడా ఎటాకింగ్ మోడ్‌లోకి ఉండటం విశేషం.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఐదు టెస్టు మ్యాచ్‌లు ఉన్నాయి. ఐదో టెస్ట్ రేపు సిడ్నీలో రేపు జరుగుతుంది. ఇప్పటికే 2-1 తేడాతో ఈ సిరీస్‌లో కంగారూలు ఆధిక్యంమీద ఉన్నారు. మరో టెస్ట్ డ్రా అయింది. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు డ్రెస్సింగ్‌రూమ్ వ్యవహారం చర్చనీయాంశం అయింది. కూల్‌గా ఉండే రోహిత్, కోపాన్ని కంట్రోల్ చేసుకోలేని గంభీర్ మధ్య డ్రెస్సింగ్ రూమ్ ఫైట్‌లో ఏం జరుగుతుంది?
ఈ గొడవ ఇక్కడితోనే ముగుస్తుందా లేక అగ్గి ఇప్పుడే రాజుకుందా? గౌతమ్ గంభీర్ మాట నెగ్గుతుందా? టీమిండియాలో స్టార్ ఆటగాళ్ల మన్‌కీబాత్ చెల్లుబాటు అవుతుందా..? గతంలో కోచ్- కెప్టన్ల మధ్య గొడవలు చాలా నడిచాయి.. చాపెల్-గంగూలీ, రవిశాస్త్రి-ధోనీ గొడవలు జనానికి ఇంకా బాగా గుర్తున్నాయి. ఇప్పుడు గౌతమ్‌గంభీర్-రోహిత్ శర్మ గొడవ ఎక్కడకు దారితీస్తుంది..?
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి