Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2024 Sold, Unsold Players: ఐపీఎల్ వేలంలో అమ్ముడైన, అమ్ముడుకాని ప్లేయర్లు వీరే..

IPL 2024 Auction: కోల్‌కతా నైట్ రైడర్స్ రూ. 24.75 కోట్లకు ఆస్ట్రేలియాకు చెందిన మిచెల్ స్టార్క్‌ను కొనుగోలు చేసింది. దీంతో ఐపీఎల్ వేలంలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. ప్రపంచ కప్ విజేత కెప్టెన్ పాట్ కమ్మిన్స్ రూ. 20.50 కోట్లకు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు వెళ్లి రెండవ ఉత్తమ బిడ్‌ను పొందాడు. SRH రూ. 6.80 కోట్లకు కమ్మిన్స్, 2023 ప్రపంచ కప్ ఫైనల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ట్రావిస్ హెడ్‌ని కూడా దక్కించుకుది. రూ.1.50 కోట్ల బేస్ ప్రైస్‌కి శ్రీలంక ఆల్‌రౌండర్ వనిందు హసరంగాను కూడా ఈ జట్టు కైవసం చేసుకుంది.

IPL 2024 Sold, Unsold Players: ఐపీఎల్ వేలంలో అమ్ముడైన, అమ్ముడుకాని ప్లేయర్లు వీరే..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్-17 కోసం జరుగుతున్న మినీ వేలంలో ఇద్దరు ఆటగాళ్లు రూ. 20 కోట్లకు పైగా అమ్ముడయ్యారు. అలాగే, ముగ్గురు ఆటగాళ్లకు 11+ కోట్లు వచ్చాయి. అయితే, ఇప్పటి వరకు జరిగిన వేలంలో అత్యధిక మొత్తం దక్కించుకున్న ఆటగాళ్లు ఎవరో చూద్దాం..
Follow us
Venkata Chari

|

Updated on: Dec 19, 2023 | 4:47 PM

IPL 2024 Sold, Unsold Players: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2024 వేలం డిసెంబర్ 19, మంగళవారం దుబాయ్‌లోని కోకా-కోలా ఎరీనాలో జరుగుతోంది. IPL 2024 వేలం పూల్‌లో 332 మంది ఆటగాళ్లు ఉన్నారు. అయితే, కేవలం 77 స్లాట్‌లు మాత్రమే ఖాళీగా ఉన్నాయి. మొత్తం 10 ఫ్రాంచైజీల ద్వారా 77 మంది ఆటగాళ్ల జాతకాలు మారనున్నాయి. వీరిలో 30 మంది విదేశీ ఆటగాళ్లు ఉంటారు. మొత్తం 214 మంది భారతీయ ఆటగాళ్లు, 118 మంది విదేశీ ఆటగాళ్లు – అసోసియేట్ దేశాలకు చెందిన ఇద్దరితో సహా మొత్తం 332 మంది వేలంలో పాల్గొంటున్నారు. అలాగే, ఇందులో 116 మంది క్యాప్డ్ ప్లేయర్‌లు, 214 మంది అసోసియేట్ దేశాల నుంచి ఇద్దరు అన్‌క్యాప్ ప్లేయర్లు లిస్టులో చేరారు.

కోల్‌కతా నైట్ రైడర్స్ రూ. 24.75 కోట్లకు ఆస్ట్రేలియాకు చెందిన మిచెల్ స్టార్క్‌ను కొనుగోలు చేసింది. దీంతో ఐపీఎల్ వేలంలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు.

ప్రపంచ కప్ విజేత కెప్టెన్ పాట్ కమ్మిన్స్ రూ. 20.50 కోట్లకు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు వెళ్లి రెండవ ఉత్తమ బిడ్‌ను పొందాడు.

SRH రూ. 6.80 కోట్లకు కమ్మిన్స్, 2023 ప్రపంచ కప్ ఫైనల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ట్రావిస్ హెడ్‌ని కూడా దక్కించుకుది. రూ.1.50 కోట్ల బేస్ ప్రైస్‌కి శ్రీలంక ఆల్‌రౌండర్ వనిందు హసరంగాను కూడా ఈ జట్టు కైవసం చేసుకుంది.

ఇక వెస్టిండీస్ ప్లేయర్ రోవ్‌మాన్ పావెల్‌ను సంజూ శాంసన్ నేతృత్వంలోని రాజస్థాన్ రాయల్స్ జట్టు రూ.7.40 కోట్లకు వెస్టిండీస్ బ్యాటర్‌ను దక్కించుకుంది.

చెన్నై సూపర్ కింగ్స్ రచిన్ రవీంద్రను రూ. 1.80 కోట్లకు కొనుగోలు చేసింది. అలాగే, శార్దూల్ ఠాకూర్‌ను కూడా దక్కించుకుంది.

అమ్ముడైన ప్లేయర్లు వీరే..

బ్యాటర్లు..

రోవ్‌మన్ పావెల్ – 7.40 కోట్లు – రాజస్థాన్ రాయల్స్

హ్యారీ బ్రూక్ – 4 కోట్లు – ఢిల్లీ క్యాపిటల్స్

ట్రావిస్ హెడ్ -6.80 కోట్లు – సన్ రైజర్స్ హైదరాబాద్

బౌలర్లు..

చేతన్ సకారియా – 50 లక్షలు – కోల్‌కతా నైట్ రైడర్స్

అల్జారీ జోసెఫ్ – 11.50 కోట్లు – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

ఉమేష్ యాదవ్ – 5.80 కోట్లు – గుజరాత్ టైటాన్స్

శివమ్ మావి – 6.40 కోట్లు – లక్నో సూపర్ జెయింట్స్

మిచెల్ స్టార్క్ – 24.75 కోట్లు – కోల్‌కతా నైట్ రైడర్స్

జయదేవ్ ఉనద్కత్ – 1.60 కోట్లు – సన్‌రైజర్స్ హైదరాబాద్

దిల్షాన్ మధుశంక  – 4.60 కోట్లు – ముంబై ఇండియన్స్

ఆల్ రౌండర్లు..

వనిందు హసరంగా – 1.50 కోట్లు – సన్‌రైజర్స్ హైదరాబాద్

రచిన్ రవీంద్ర – 1.80 కోట్లు – చెన్నై సూపర్ కింగ్స్

శార్దూల్ ఠాకూర్ – 4 కోట్లు – చెన్నై సూపర్ కింగ్స్

అజ్మతుల్లా ఒమర్జాయ్ – 50 లక్షలు – గుజరాత్ టైటాన్స్

పాట్ కమిన్స్ – 20.50 కోట్లు – సన్‌రైజర్స్ హైదరాబాద్

జెరాల్డ్ కోయెట్జీ – 5 కోట్లు – ముంబై ఇండియన్స్

హర్షల్ పటేల్ – 11.75 కోట్లు – పంజాబ్ కింగ్స్

డారిల్ మిచెల్ – 14 కోట్లు – చెన్నై సూపర్ కింగ్స్

క్రిస్ వోక్స్ – 4.20 కోట్లు – పంజాబ్ కింగ్స్

వికెట్ కీపర్లు..

ట్రిస్టన్ స్టబ్స్ – 50 లక్షలు – ఢిల్లీ క్యాపిటల్స్

KS భరత్ – 50 లక్షలు – కోల్‌కతా నైట్ రైడర్స్.

అమ్ముడుపోని ప్లేయర్‌లు..

బ్యాటర్లు..

రిలీ రోసౌ – 2 కోట్లు

కరుణ్ నాయర్ – 50 లక్షలు

స్టీవ్ స్మిత్ – 2 కోట్లు

మనీష్ పాండే – 50 లక్షలు

బౌలర్లు..

లాకీ ఫెర్గూసన్ – 2 కోట్లు

జోష్ హేజిల్‌వుడ్ – 2 కోట్లు

మహ్మద్ వకార్ సలాంఖైల్ – 50 లక్షలు

ఆదిల్ రషీద్ – 2 కోట్లు

అకేల్ హోసేన్ – 50 లక్షలు

ఇష్ సోధి – 75 లక్షలు

తబ్రైజ్ షమ్సీ – 50 లక్షలు

ముజీబ్ ఉర్ రెహమాన్ – 2 కోట్లు

వికెట్ కీపర్లు..

ఫిలిప్ సాల్ట్ – 1.50 కోట్లు

జోష్ ఇంగ్లీస్ – 2 కోట్లు

కుసాల్ మెండిస్ – 50 లక్షలు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

తండ్రి కూతురిని పెళ్లి చేసుకునే దుష్ట ఆచారం..! ఎక్కడో తెలుసా..?
తండ్రి కూతురిని పెళ్లి చేసుకునే దుష్ట ఆచారం..! ఎక్కడో తెలుసా..?
పవన్‌ కుమారుడు ప్రమాదంపై స్పందించిన చిరంజీవి, చంద్రబాబు, లోకేష్,
పవన్‌ కుమారుడు ప్రమాదంపై స్పందించిన చిరంజీవి, చంద్రబాబు, లోకేష్,
ఫేక్ ప్రొఫైల్‌తో అమ్మాయిలకు వల..ఏకంగా MLA ప్రొఫైల్‌నే వాడేశాడు!
ఫేక్ ప్రొఫైల్‌తో అమ్మాయిలకు వల..ఏకంగా MLA ప్రొఫైల్‌నే వాడేశాడు!
మేమేం పాపం చేసాం రోహిత్ బ్రో? అభిమానుల ఆశలు ఆవిరి!
మేమేం పాపం చేసాం రోహిత్ బ్రో? అభిమానుల ఆశలు ఆవిరి!
సాయిపల్లవి.. శ్రీలీల.. సంయుక్త.. బాలీవుడ్‌ కహానీ.. ఎలా సాగుతుంది?
సాయిపల్లవి.. శ్రీలీల.. సంయుక్త.. బాలీవుడ్‌ కహానీ.. ఎలా సాగుతుంది?
ప్రభుత్వ సహాయంతో ఈ సూపర్‌ బిజినెస్‌ గురించి తెలుసా? లక్షల్లో లాభం
ప్రభుత్వ సహాయంతో ఈ సూపర్‌ బిజినెస్‌ గురించి తెలుసా? లక్షల్లో లాభం
23 మంది రేప్‌ చేశారని యువతి ఆరోపణ
23 మంది రేప్‌ చేశారని యువతి ఆరోపణ
సినిమా హిట్ అయినా నన్ను ప్రమోషన్స్‌కు పిలవలేదు..
సినిమా హిట్ అయినా నన్ను ప్రమోషన్స్‌కు పిలవలేదు..
మియాపూర్​లో లారీ బీభత్సం.. కానిస్టేబుల్ దుర్మరణం
మియాపూర్​లో లారీ బీభత్సం.. కానిస్టేబుల్ దుర్మరణం
లారీ డ్రైవర్ నిర్లక్ష్యం.. కానిస్టేుబుల్స్ కుటుంబాల్లో విషాదం
లారీ డ్రైవర్ నిర్లక్ష్యం.. కానిస్టేుబుల్స్ కుటుంబాల్లో విషాదం