Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Year Ender 2023: కోహ్లీ, గంభీర్‌ల రచ్చ నుంచి టైం ఔట్ వరకు.. ఈ ఏడాది చోటు చేసుకున్న 5 వివాదాలు ఇవే..

Year Ender: ప్రతి సంవత్సరం మాదిరిగానే 2023లో ఏడాది పొడవునా క్రికెట్ యాక్షన్ కొనసాగింది. ఎప్పటిలాగే, ఈసారి కూడా క్రికెట్ మైదానంలో చాలా వివాదాలు చోటుచేసుకున్నాయి. అది IPL లేదా యాషెస్ లేదా అతిపెద్ద టోర్నమెంట్ - ప్రపంచ కప్ 2023 అయినా సరే.. ఈ వివాదాల నుంచి తప్పించుకోలేకపోయాయి. అలాంటి వివాదాలను ఓసారి చూద్దాం..

Year Ender 2023: కోహ్లీ, గంభీర్‌ల రచ్చ నుంచి టైం ఔట్ వరకు.. ఈ ఏడాది చోటు చేసుకున్న 5 వివాదాలు ఇవే..
Year Ender 2023
Follow us
Venkata Chari

|

Updated on: Dec 08, 2023 | 12:02 PM

Year Ender 2023: 2023 సంవత్సరం కొద్దిరోజుల్లో ముగియబోతోంది. మరికొద్ది రోజుల్లోనే కొత్త సంవత్సరం ప్రారంభం కానుంది. కొత్త ఏడాదినూ క్రికెట్‌ సందడి చేసేందుకు సిద్ధమైంది. అయితే, చాలా కొత్త కెరీర్‌లు వెలుగుచూడనున్నాయి. అయితే, కొంతమంది కెరీర్ ముగిసేందుకు సిద్ధమైంది. కొన్ని జట్లు ఛాంపియన్లుగా కూడా మారాయి. వీటన్నింటితో పాటు, ఖచ్చితంగా వివాదాలు కూడా చోటుచేసుకున్నాయి. ఎందుకంటే, ఇది ప్రతి సంవత్సరం జరుగుతుంది. అయితే, 2023 కూడా ఈ వివాదాల నుంచి తప్పించుకులేదు. ఈ ఏడాది చోటు చేసుకున్న అత్యంత ముఖ్యమైన 5 వివాదాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

పదేళ్ల తర్వాత మళ్లీ గొడవ..

ఈ సంవత్సరం చర్చల్లో నిలిచిన అతిపెద్ద వివాదం ఏంటంటే.. IPL 2023లో చోటు చేసుకున్నన గంభీర్, కోహ్లీ వివాదమే. పదేళ్ల తర్వాత విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ మరోసారి ఐపీఎల్ మ్యాచ్‌లో ఢీకొన్నారు. ఇంతకుముందు, 2013లో తొలిసారిగా గొడవ జరిగినప్పుడు ఇద్దరూ కెప్టెన్లుగా ఉన్నారు. ఈసారి గంభీర్ లక్నో సూపర్ జెయింట్స్‌కు మెంటార్‌గా ఉండగా, కోహ్లి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాట్స్‌మెన్‌గా ఉన్నాడు. మే 1న లక్నోలో ఇరు జట్ల మధ్య జరిగిన ఘర్షణలో ఈ వివాదం చోటుచేసుకుంది. లక్నో ఇన్నింగ్స్‌లో లక్నో ఆఫ్ఘన్ ఆటగాడు నవీన్ ఉల్ హక్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు, కోహ్లీ స్లెడ్జింగ్ చేస్తున్న సమయంలో ఇది ప్రారంభమైంది. దానికి నవీన్ కూడా సమాధానం చెప్పడంతో చర్చనీయాంశమైంది. దీంతో అంపైర్లు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.

ఆ తర్వాత మ్యాచ్ ముగియడంతో బెంగళూరు విజయం సాధించింది. ఆపై ఇరు జట్ల ఆటగాళ్లు కరచాలనం చేస్తుండగా.. కోహ్లీ, నవీన్ మళ్లీ గొడవపడ్డారు. ఇద్దరూ కరచాలనం చేసి మాట్లాడటం మొదలుపెట్టారు. కోహ్లికి నవీన్ షేక్ హ్యాండ్ ఇచ్చాడు. ఆ తర్వాత వాగ్వాదం ముదిరేలోపే వారిద్దరూ విడిపోయారు. కొంత సమయం తరువాత, గౌతమ్ గంభీర్ ఈ చర్చలోకి ఎంటర్ అయ్యాడు. ఆ తరువాత గొడవ జరిగింది. ఇద్దరూ ఒకరికొకరు చాలా దగ్గరగా వచ్చి ఒకరితో ఒకరు దూకుడుగా మాట్లాడటం మొదలుపెట్టారు. వారిని వదిలించేందుకు ఇరు జట్ల ఆటగాళ్లు, సహాయక సిబ్బంది గుమిగూడారు. ఈ వివాదం ప్రభావం చాలా రోజులుగా కనిపించింది. 2023 ప్రపంచకప్‌లో భారత్-ఆఫ్ఘనిస్థాన్ మ్యాచ్ సందర్భంగా కోహ్లీ, నవీన్‌లు కౌగిలించుకోవడం ద్వారా దాన్ని ముగించారు.

లార్డ్స్‌లో నిర్లక్ష్యం..

ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మధ్య జరిగే యాషెస్ సిరీస్‌లో వివాదాలు రావడం మాములే. ఈసారి కూడా అలాంటిదే జరిగింది. లార్డ్స్ వేదికగా ఇరు జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లండ్ 371 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. ఐదవ రోజున గందరగోళం ఏర్పడింది. జానీ బెయిర్‌స్టో కామెరాన్ గ్రీన్ బౌన్సర్‌ను వికెట్ కీపర్ వద్దకు వెళ్లడానికి అనుమతించాడు. ఇలా చేసిన వెంటనే క్రీజు నుంచి బయటకు వచ్చి ఆస్ట్రేలియా కీపర్ అలెక్స్ కారీ బంతిని స్టంప్‌కు కొట్టాడు. బెయిర్‌స్టో ఆశ్చర్యపోయినా థర్డ్ అంపైర్ ఔట్‌గా ప్రకటించాడు. బాల్ డెడ్ కాకముందే బెయిర్‌స్టో క్రీజ్‌కు దూరంగా ఉండటంతో ఇది జరిగింది. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్, మాజీ ఆటగాళ్లు, మీడియా ఆస్ట్రేలియా క్రీడాకారుల స్ఫూర్తిని తీవ్రంగా ప్రశ్నించింది.

టైమ్ అవుట్: హిస్టరీ మేకింగ్ కాంట్రవర్సీ..

ప్రపంచ కప్ 2023లో, బంగ్లాదేశ్ వర్సెస్ శ్రీలంక మధ్య లీగ్ మ్యాచ్‌కు పెద్దగా ప్రాముఖ్యత లేదు. ఎందుకంటే రెండు జట్లు ఎలిమినేట్ అయ్యాయి. అయితే, ఈ మ్యాచ్ టోర్నీలో అత్యంత వివాదాస్పద క్షణానికి సాక్షిగా నిలిచింది. శ్రీలంక బ్యాటింగ్‌లో సదీర సమరవిక్రమ వికెట్ పడటంతో అనుభవజ్ఞుడైన ఆల్‌రౌండర్ ఏంజెలో మాథ్యూస్ క్రీజులోకి వచ్చాడు. బ్యాటింగ్ ప్రారంభించే ముందు, అతను తన హెల్మెట్‌ను రిపేర్ చేస్తున్నాడు. అయితే, దాని పట్టీ విరిగిపోయింది. అంపైర్‌కు సమాచారం ఇవ్వకుండా మాథ్యూస్ మరో హెల్మెట్ అడిగాడు. బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ టైమ్ అవుట్ కోసం అప్పీల్ చేయగా థర్డ్ అంపైర్ ఔట్‌గా ప్రకటించాడు.

వాస్తవానికి, ప్రపంచకప్‌లో ఆడే పరిస్థితుల ప్రకారం, కొత్త బ్యాట్స్‌మెన్ ఎవరైనా 2 నిమిషాల్లో బంతిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. కానీ, మాథ్యూస్ ఇందులో విఫలమయ్యాడు. ఈ విధంగా క్రికెట్ చరిత్రలో టైం ఔట్ అయిన తొలి బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. దీని తర్వాత, మాథ్యూస్ మీడియా సమావేశం నుంచి సోషల్ మీడియా వరకు షకీబ్, అంపైర్లపై విరుచుకుపడ్డాడు.

ప్రపంచ కప్‌లో పిచ్ గందరగోళం..

ప్రపంచ కప్ 2023లో, టీమ్ ఇండియా ఫైనల్‌కు ముందు వరుసగా 10 మ్యాచ్‌లను గెలుచుకుంది. తన అద్భుతమైన ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకుంది. అయితే, టీమిండియా ఎంపిక ప్రకారమే పిచ్‌ను సిద్ధం చేస్తున్నట్లు పాకిస్థాన్‌తో పాటు మరికొన్ని విదేశీ మీడియాలు ఆరోపణలు గుప్పించాయి. భారత్-న్యూజిలాండ్ సెమీఫైనల్‌కు ముందు ఈ వివాదం తారాస్థాయికి చేరుకుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో సెమీఫైనల్ కోసం భారత జట్టు మేనేజ్‌మెంట్ కోరిక మేరకు పిచ్‌ను మార్చినట్లు సెమీ-ఫైనల్‌కు ఒక రోజు ముందు బ్రిటిష్ వార్తాపత్రిక నివేదించింది. ఇందులో ఐసీసీకి చెందిన ఇండిపెండెంట్ పిచ్ కన్సల్టెంట్‌ను ఉటంకిస్తూ.. టోర్నీ ప్రారంభానికి ముందు సెమీఫైనల్‌కు ఫిక్స్ చేసిన తాజా పిచ్‌ను చివరి క్షణంలో మార్చి పాత పిచ్‌నే ఉపయోగించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. దీనిపై పెద్దఎత్తున దుమారం చెలరేగింది. అయితే టోర్నమెంట్‌లో ముందుగా వేర్వేరు మ్యాచ్‌లలో పిచ్‌లు మారుతున్నాయని, సెమీఫైనల్‌కు తాజా పిచ్‌ను కలిగి ఉండటం తప్పనిసరి కాదని ఐసీసీ ఒక ప్రకటన విడుదల చేసింది.

గంభీర్ vs శ్రీశాంత్..

సంవత్సరం చివరి నెల డిసెంబర్ కూడా మైదానంలో ఫైట్‌లకు సంబంధించి వివాదాన్ని తెచ్చిపెట్టింది. మరోసారి గౌతమ్ గంభీర్ ఇందులో ప్రధాన పాత్ర పోషించాడు. ఐపీఎల్ వివాదం జరిగిన ఏడు నెలల తర్వాత, లెజెండ్స్ లీగ్ క్రికెట్‌లో గంభీర్ తన మాజీ టీమిండియా సహచరుడు ఎస్ శ్రీశాంత్‌తో విభేదించాడు. ఇద్దరి మధ్య మ్యాచ్‌లో స్లెడ్జింగ్‌తో మొదలైన విషయం కొద్దిసేపటికే తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. ఆటగాళ్లు, అంపైర్లు రక్షించాల్సి వచ్చింది. అప్పటి నుంచి, శ్రీశాంత్ నిరంతరం సోషల్ మీడియాలో తన నిర్దోషితత్వాన్ని ప్రకటిస్తూనే ఉన్నాడు. గంభీర్ మైదానంలో తనను దుర్భాషలాడాడని, తనను ఫిక్సర్ అంటూ పిలుస్తున్నాడని ఆరోపించాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..