Team India: టీమిండియా తరపున చివరి టీ20 ప్రపంచకప్ ఆడనున్న ముగ్గురు.. ట్రోఫీతో గుడ్‌బై చెప్పాలంటోన్న ఫ్యాన్స్..

Team India T20 World Cup 2024: టీమ్ ఇండియా ఐసీసీ ట్రోఫీ కోసం తహతహలాడుతోంది. 2007లో తొలి టీ20 ప్రపంచకప్‌ గెలిచిన భారత జట్టు.. మళ్లీ ఛాంపియన్‌గా నిలవలేదు. ఈసారి అమెరికా, వెస్టిండీస్‌లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో ఐసీసీ ట్రోఫీ కరువుకు తెరపడనుంది. దీని కోసం, జట్టును ప్రపంచ ఛాంపియన్‌గా మార్చగల సామర్థ్యం ఉన్న గొప్ప ఆటగాళ్లు భారతదేశంలో పుష్కలంగా ఉన్నారు.

Team India: టీమిండియా తరపున చివరి టీ20 ప్రపంచకప్ ఆడనున్న ముగ్గురు.. ట్రోఫీతో గుడ్‌బై చెప్పాలంటోన్న ఫ్యాన్స్..
Rohit Sharma Virat Kohli

Updated on: May 31, 2024 | 12:10 PM

T20 World Cup 2024: టీమ్ ఇండియా ఐసీసీ ట్రోఫీ కోసం తహతహలాడుతోంది. 2007లో తొలి టీ20 ప్రపంచకప్‌ గెలిచిన భారత జట్టు.. మళ్లీ చాంపియన్‌గా నిలవలేదు. ఈసారి అమెరికా, వెస్టిండీస్‌లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో ఐసీసీ ట్రోఫీ కరువుకు తెరపడనుంది. దీని కోసం, జట్టును ప్రపంచ ఛాంపియన్‌గా మార్చగల సామర్థ్యం ఉన్న గొప్ప ఆటగాళ్లు భారతదేశంలో పుష్కలంగా ఉన్నారు. అయితే కెరీర్ పరంగా చివరి టీ20 ప్రపంచకప్‌ ఆడుతోన్న ముగ్గురు టీమిండియా ఆటగాళ్లు కూడా ట్రోఫీతో ఈ ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పాలని ఆశపడుతున్నారు. లిస్టులో ఉన్న ముగ్గురు ప్లేయర్లు ఎవరో ఇప్పుడు చూద్దాం..

1. విరాట్ కోహ్లీ..

35 ఏళ్ల విరాట్ కోహ్లీ టీ20 ప్రపంచకప్ చరిత్రలో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌గా పేరుగాంచాడు. ఈ టోర్నీలో కోహ్లీ 25 ఇన్నింగ్స్‌ల్లో 14 హాఫ్ సెంచరీలతో సహా 1141 పరుగులు చేశాడు. అయితే రెండు సార్లు ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ కింగ్ కోహ్లి టీ20 ప్రపంచకప్ ట్రోఫీని ఇంకా గెలవలేకపోయాడు. విరాట్ కోహ్లి తన వయసు మేరకు.. మూడు ఫార్మాట్లలో ఆడటం కష్టంగా మారుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో టెస్టు, వన్డేలను ఇష్టపడే కోహ్లీ బహుశా తన చివరి టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియాను చాంపియన్‌గా నిలబెట్టాలని భావిస్తున్నాడు.

2. రోహిత్ శర్మ..

టీ20 క్రికెట్‌లో అత్యంత ప్రమాదకరమైన బ్యాట్స్‌మెన్‌లలో టీమిండియా కెప్టెన్ 37 ఏళ్ల రోహిత్ శర్మ ఒకరు. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అతని పేరిట ఐదు సెంచరీలు కూడా ఉన్నాయి. 2007లో టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో రోహిత్ సభ్యుడు. విరాట్ లాగే రోహిత్ కూడా ఈ ప్రపంచకప్ తర్వాత టీ20 ఫార్మాట్‌కు దూరం కావచ్చు. ఇటువంటి పరిస్థితిలో టీ20 ప్రపంచ కప్‌లో చివరిసారిగా రోహిత్‌ను భారత జెర్సీలో కూడా చూడవచ్చు. టీ20 ప్రపంచకప్‌లో రోహిత్ 36 ఇన్నింగ్స్‌ల్లో 963 పరుగులు చేశాడు.

3. యుజ్వేంద్ర చాహల్..

ఈ లిస్ట్‌లో యుజ్వేంద్ర చాహల్ పేరు ఆశ్చర్యంగా అనిపించినప్పటికీ, ఈ లెగ్ స్పిన్నర్ టీమ్ ఇండియా టీ20 ప్రపంచకప్‌లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. చాహల్ త్వరలో 34 ఏళ్లు పూర్తి చేసుకోనున్నాడు. కాబట్టి తనను తాను నిరూపించుకోవడానికి ఇదే చివరి అవకాశం. చాహల్ టీ20 క్రికెట్‌లో 80 మ్యాచ్‌లలో 25.09 సగటుతో 96 వికెట్లు పడగొట్టాడు. అతని ఎకానమీ 8.19గా నిలిచింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..