IPL 2023: కెప్టెన్‌లకు పట్టిన గ్రహణం.. ఇప్పటికే లీగ్ నుంచి తప్పుకున్న ముగ్గురు..
Indian Premier League 2023: ఐపీఎల్ 16వ సీజన్‌లో లక్నో జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ కూడా గాయం కారణంగా దూరమయ్యాడు. ఈ సీజన్‌లో గాయం కారణంగా దూరమైన మూడో కెప్టెన్‌గా రాహుల్ నిలిచాడు.
IPL 16వ సీజన్‌లో కేఎల్ రాహుల్ రూపంలో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. మే 1న ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో రాహుల్ తొడ గాయంతో మ్యాచ్ నుంచి తప్పుకున్నాడు. తాజాగా స్కాన్, ఇతర నివేదికలు వచ్చిన తర్వాత, అతను సీజన్‌లోని మిగిలిన మ్యాచ్‌లలో పాల్గొనడంలేదని ప్రకటించారు. ఈ సీజన్‌లో ఔట్ అయిన మూడో కెప్టెన్‌గా రాహుల్ నిలిచాడు.
కేఎల్ రాహుల్ కంటే ముందు ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) కెప్టెన్ రిషబ్ పంత్, కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ కూడా ఔట్ అయ్యారు. డిసెంబర్ 2022లో జరిగిన కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రిషబ్ పంత్ ప్రస్తుతం కోలుకుంటున్నాడు. పంత్ పునరాగమనానికి సంబంధించి ఇంకా ఏదీ నిర్ణయించలేదు. 2023 చివరి నాటికి రిషబ్ తిరిగి మైదానంలోకి వస్తాడని భావిస్తున్నారు .
వెన్ను గాయం కారణంగా శ్రేయాస్ అయ్యర్ ఐపీఎల్ 16వ సీజన్‌కు దూరమయ్యాడు. ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్టు మ్యాచ్‌లో అయ్యర్ మళ్లీ వెన్నునొప్పి సమస్యను ఎదుర్కొన్నాడు. అయ్యర్ వీపు భాగాన్ని స్కాన్ చేసిన తర్వాత శస్త్రచికిత్స చేయాలని సూచించారు. ఈ కారణంగా, అతను సుమారు 2 నుంచి 3 నెలల పాటు ఆటకు కూడా దూరంగా ఉన్నాడు.
కేఎల్ రాహుల్ డబ్ల్యూటీసీ ఫైనల్ నుంచి కూడా ఔట్..
కేఎల్ రాహుల్ తొడ ఒత్తిడికి గురైన తర్వాత, ఇప్పుడు అతను ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కూడా ఫైనల్‌కు దూరమయ్యాడు. రాహుల్ నిష్క్రమణ టీమ్ ఇండియాకు పెద్ద దెబ్బే. టైటిల్ మ్యాచ్‌లో రాహుల్ వికెట్ కీపర్‌గా కనిపించాల్సి ఉంది. తాజాగా రాహుల్ తప్పుకోవడంతో.. బీసీసీఐ ఎవరిని జట్టుతో చేర్చుతుందో చూడాలి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..